mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

5, ఏప్రిల్ 2012, గురువారం

rachcha cinema reviewtelugu రచ్చ రచ్చ ..చేసిన రామచరణ్ రెచ్చిపోయిన తమన్నా ..పంజా విసిరినపరుచూరి బ్రదర్స్




ఆరంజ్ తో నిరాశలో ఉన్న రామచరణ్ అభిమానులకు రచ్చ ఆనందాన్ని పంచుతుంది .కొత్త దర్శకుడు సంపత్ నంది కుర్రకారును కనువిందు చేసాడు ...బోర్ కొట్టకుండా సినిమా తీయ గలిగాడు  తమన్నా అందాలు సిన్మాకు ప్లస్ పాయింట్ ...కొంతకాలం సైలెంట్ గా ఉన్నా పరుచూరి బ్రదర్స్ మళ్లీ తమ పంజా విసిరారు .
రచ్చ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన మొదటి మూవీ ...ఇది .
 సినిమా కథ  కొంత వరకు పాతదే అయిన కొంత కొత్త గా ఎన్నుకున్నారు .ట్విస్ట్ లకు అవకాశం గల కథ .ముఖ్యం గా కథనం చక్కగా ఉండడం ....ప్రేక్షకులను దియేటర్ నుంచి కాలు కదపకుండా చేసింది పెద్దగ కొన్ని సన్నివేశాల్లో సస్పెన్సే లేక పోయిన  మొదటి నుంచి థ్రిల్లింగ్ గా ఉంది .
 సినిమాలో మగధీర ,చిరుత చాయలు ఉన్నాయి .మగధీర లో ఎంట్రన్సు లో ఉండే బైక్ రేస్ మాదిరిగా వచ్చే ట్రైన్ ముందుకు వెళ్ళే కార్ పోటి ఉంది ..చిరుత లో క్లైమాక్ష్ మాదిరి గా అడవి ..హెలికాప్టర్ తో వచ్చి హీరొయిన్ ను తీసుకు పోవడం ఉంది ...
అయిన సీన్స్ బాగేనే తీసారు .మగధీర లో మాదిరి జ్ఞాపకాలు  సీన్ కూడా కొంత ఉంది .రామ్ చరణ్ తనదైన స్టైల్ లో కనిపించాడు ...పాటల్లో ..ఫైట్స్ ల తన ఎనర్జీ మళ్లీ రుచి చూపించాడు ....(టైటిల్ సాంగ్ లో మాత్రం స్టెప్స్ అభిమానులను నిరాశ పరిచాయి ....కాని డిల్ల డిల్ల పాత లో మాత్రం ఇరగదీసాడు ) ఈ సినిమాల్లో పలు చోట్ల తన తండ్రి చిరంజీవి ని అనుకరిచాడు .." పేసు టర్నింగ్ ఇచ్చుకో  "లాంటి సీన్ హీరొయిన్ తమన్న తో చేసాడు .....చరణ్ నటన లో మెరుగుదల ఉంది 
 తమన్నా తన అందచందాలతో కనువిందు చేసింది .డాన్సు లో కసి కనిపించిది .కొన్ని స్టెప్స్ లో చరణ్ ను కూడా మించి పోయి చేసి నాటి రాధను గుర్తుకు తెచ్చింది .
 ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ తమ కలం పోటు మరో సారి రుచి చూపించారు ...
"నువ్వు అరిస్తే అరుపులే ..నేను అరిస్తే మెరుపులే ....
"శరీరం లో సునామి పుడుతోందా?" లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు ..అంతేకాదు పరిచూరి వెంకటేశ్వర రావు  ఓ కీలక పాత్ర పోషించారు.
సిమాలో సెట్టింగ్స్ బావున్నై ..విలన్ ఇల్లు ఇంద్రలోకాన్ని మైమరిపించే విదంగా కనిపించింది ...బ్రమానందం ,వేణు ,తాగుబోతు రమేష్ ,ఆలి పాత్రలు పరిమతం గానే ఉన్నాఉన్నంత లో హాస్యం పండించారు 
 .ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయ్ .రెండు పాటలు  ఏదో మధ్యలో ఇరికించి నట్టు కనిపిస్తోంది ..కొన్ని పాత్రలు మరి పరిమితంగా ఉన్నాయ్ .మొత్తానికి ఇది మాస్స్ టార్గెట్ తో తీసినట్టు తెలోస్తోంది....పైసలు మాత్రం భాగానే వస్తాయి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి