mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

30, డిసెంబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా






జగ్గంపేట లో కొత్త సంవత్సర రాజకీయ సందడి అప్పుడే కనిపిస్తోంది .ఎన్నడు లేని విదంగా జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా కనిపిస్తున్నై .అండర్ బ్రిడ్జే కి పైన,క్రింద పోటాపోటీగా ఫ్లెక్ష్ ఉన్నాయ్ .మూడు పార్టీల నేతలతో (మంత్రి తోట నరసింహం ,వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు ,తెలుగు దేశం నేత జ్యోతుల చంటి బాబు ఫోటోలతో ...ఆయ పార్టీ ల వారు భారీగా  నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు .కాగా జ్యోతుల నెహ్రు అందరి కంటే ముందుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని చెప్పవచ్చు .తన అనుచర గణం తో ప్రతి ఇంటికి మిటాయి,గ్రీటింగ్ కార్డ్ పంపారు 

28, డిసెంబర్ 2011, బుధవారం

ని శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులు తమ దయాగుణం ,




జగ్గంపేట లోని శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులు తమ దయాగుణం ,సామాజిక సేవాగుణం సాటారు.అంధ విద్యార్దుల కోసం అరవై వేలు పోగు చేసి వారికి ఇచ్చారు .కర్సపా డెంట్ రాంబాబు సార్, ప్రిన్సిపాల్ దేవదాస్ పిల్లలను అభినందించారు 

19, డిసెంబర్ 2011, సోమవారం

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!,...ఇదేమిటి విచిత్రం అనుకుంటున్నారా ?   కరెంటు ఉంటె ..భాగేనే ఉంది అనుకుంటాం ..అయితే పగటి పూట కరెంటు ఉంటె మాత్రం జగ్గంపేట జనం తారేత్తిపోతున్నారు......ఇది నిజం.
జగ్గంపేట టౌన్ లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ..అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయత్రం ఆరు వరకు కరెంటు ఉండడం లేదు .....ఈ కోతల్లో ఎప్పుడైనా పొరపాటున కరంటు ఇచ్చారు అంటే జనం భయ పడుతున్నారు ..ఎందుకంటె  ఇచ్చిన కరెంటు ను ఏ అర్ధరాత్రో తీసి నరకం చూపిస్తారన్న భయం ...సోమవారం సంత రోజున ప్రతి చోట ఇదే టాపిక్ ...సాయంత్రం ఆరు గంటలకు ఇవ్వవలసినది ...మూడు గంటలకే ఇవ్వడం ....దీంతో ..ముందుగా ఇచ్చారు .....రాత్రికి ..ఏం జరుగునో అనుకున్నారు ...చూద్దాం 

13, డిసెంబర్ 2011, మంగళవారం

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .మురారి ,జే. కొత్తూరు లలో మంగళవారం దుర్గమ్మ అమ్మావారి తీర్దం ,జాతరలు మొదలయ్యాయి .మురారి లో మొనటి నుంచి జనం వస్తున్నారు .మంగళవారం అశేషం గా వివద దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి అక్కడే వండుకు తిన్నారు .తెల్లవారు జాము నుంచే రద్దీ  ఎక్కువ అయ్యింది .ఇక జే. కొత్తూరు లోనూ భక్తుల సందడి ఎక్కువగా ఉంది 

12, డిసెంబర్ 2011, సోమవారం

సైన్సు పెయర్ ప్రారంభం


దివంగత ఏం ఈ ఓ వెంకట లక్ష్మి జ్ఞాపకార్ధం జగ్గంపేట స్వామీ వివేకానంద స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్సు పెయర్ సోమవారం ప్రారంబమైనది .ఏం ఈ ఓ రమణ పారంబించారు .ఒమ్మి రఘురాం ప్రబృతులు పాల్గున్నారు 

we can watch video on youtube /mettaseema videos 

11, డిసెంబర్ 2011, ఆదివారం

అంకుశం ముఖ్యమంత్రి ఇక లేరు

అంకుశం ముఖ్యమంత్రి  ఏం ఎస్ రెడ్డి ..మల్లె మాల ఇక లేరు . ఎనబై ఏడు సంవత్సరాల మల్లెమాల సినిమా పరిశ్రమలో ముఖ్యలు .బాల రామయణం ద్వారా జూనియర్ యెన్ టి ఆర్ ను పరిచయం చేసింది ఆయనే .ఆయన పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి .హైదరాబాద్ లో స్టూడియో కూడా కట్టారు సిని పరిశ్రమలో అనేక అంశాలతో కూడిన " నా ఆత్మ కథ " వివాదం అయింది .ఈ పుస్తకం లో పలువురు ప్రముఖుల తీరును తూర్పార బట్టారు .

9, డిసెంబర్ 2011, శుక్రవారం

రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి

శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఉచిత డయాబెటిక్ అవగాహన సదస్సు జరుగుతుంది ..ఈ సందర్బం గా రాజముండ్రి రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి చేయనున్నారు .కొత్త కొండబాబు ప్రోగ్రాం కో ఆర్దిన్తర్ గా వ్యవహరిస్తున్నారు .

7, డిసెంబర్ 2011, బుధవారం

జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుండు బయటపడ్డారు

జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుండు బయటపడ్డారు .మంగళవారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ లారి డీకుంది.అయితే చంటిబాబుకు ఏం కాలేదు .కాగే చంటిబాబు ను జిల్లా నేతలతో పాటు నియోజవర్గ అభిమానులు ,కార్యకర్తలు పరామర్శ చేసారు 

6, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది - మంత్రి తోట నరసింహం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది అని మంత్రి తోట నరసింహం విమర్శించారు .జగ్గంపేట లో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ జనానికి మంచి పథకాలూ అందిస్తున్న ప్రభుత్వం పై చంద్రబాబు అవిశ్వాసం పెట్టి ఆబాసు పాలయ్యారని అన్నారు .కాగ రాష్ట్రం లో  నలబై రిజిస్త్రాసన్ కార్యాలయాలకు డబ్బై కోట్లతో సొంత భవనాలు నిర్మించాననున్న్నట్లు  వెల్లడించారు .జగ్గంపేట లో ముప్పై అయిదు లక్షలతొ భవనాలు నిర్మిస్తామనారు 

2, డిసెంబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లో కరెంట్ కోతలు

జగ్గంపేట లో కరెంట్ కోతలు ఊపందుకున్నై? గత మూడు రోజులు గా కోతను పెంచి శీతకాలమే చెమటలు కక్కిస్తున్నారు .జగ్గంపేట పట్టణం లో రాత్రి సమయంలో రెండు గంటలు కొత్త విధిస్తున్నారు .పగటి పూట కోతలు మామూలే .