mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

23, మే 2012, బుధవారం

మీ బైక్ పేలుతుంది ..

 మీ బైక్ పేలుతుంది ....అవును నిజమే ..అసలే సమ్మర్ ....బైక్ లో పెట్రోల్ అవిరి అవుతోంది ..రోహిణి కార్తి మొదలవడానికి  ముందే రోజు రాత్రే పెట్రోల్ ధర మండిపోతోంది .....ఒళ్ళు మండి   చిరాకు  మీదున్న జనానికి కేంద్రం భలే వాత పెట్టింది కదా 

22, మే 2012, మంగళవారం

అసలు టెన్త్ ,ఇంటర్ ఫలితాలను మంత్రులు ప్రకటించే తంతు

పదవ  తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. ఎవరి వల్ల ? మన విద్య శాఖ మంత్రి గారి వల్ల ...మంత్రి గారికి ఎప్పుడు కుదురు తుందో ...అప్పుడే ప్రకటి స్తారు ...ఇదే ఇదేమి దౌర్భాగ్యం ...? అసలు టెన్త్ ,ఇంటర్ ఫలితాలను మంత్రులు ప్రకటించే  తంతు ఏ మహానుభావుడు కనిపెట్టాడో ....తల్లి దండ్రులు !" ఎవరు అధికారమ్  లో ఉన్న అంతే 

14, మే 2012, సోమవారం

వామ్మో తివారి గారు ! రక్తం ఇవ్వరా >

వామ్మో తివారి గారు ! రక్తం ఇవ్వరా >
మన రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసి ...రాజ్ భవన్ లో రాస లీలలు ఆడారు అన్న ఆంధ్ర జ్య్యోతి కథనం తో పదవి కోల్పోయిన ......యెన్ డి తివారి గారి వ్యవ హారాలు సమసి పోలేదు ...తానే తెవారి కొడకు అని రోహిత్ ఎన్నాళ్ళ నుంచో వాదిస్తున్న ....జిల్లా నుంచి సుప్రీం వరకు తీర్పులు వచ్చిన ...డి ఎన్  ఏ  పరీక్ష చేయించు కోవడానికి  ఇంకా స ససేమిరా అంటున్నారు అట తివారి  ....పైగా దేశం విడిచి పోవడనికి ప్లాన్ వేసారట ..ఈ నేపధ్యం లో  పోలీసుల సాయంతో బలవంతం గగ డి ఎన్  ఏ  పరీక్ష   చెయ్యడానికి  రంగం సిద్దం అయింది . .....తప్పు చేయనప్పుడు ఆయనకు అంత భయం ఎందుకో మరి ?

12, మే 2012, శనివారం

కెవ్వు కేక కు "కోటి " వేస్ట్ .......





కెవ్వు కేక కు "కోటి " వేస్ట్ .......
నిజమే ....గబ్బర్ సింగ్ లో దేవిశ్రీ  తన సంగీతం ద్వారా కెవ్వు కేక అనిపించాడు ...హాట్ గర్ల్ మల్లికా అరోరా 
సినిమా హాల్లో కేవు కేక పెట్టిస్తుంది  అని మురిసి పోయిన ఆభిమానులు తీరా తెర  పై మల్లికాను చూసి .నీరు కారి పోయారు .......దేవిశ్రీ గత ఐటం  సాంగ్స్ తో పోలిస్తే సినిమా హాల్లో ఈ పాట  అలరించలేక పోయింది ......కోటీ తీసుకున్న 
మల్లిక న్యాయం చెయ్యక పోయింది ..తెలుగు నేటివిటి కి తగ్గటు ఆమె ఏ మాత్రం కనిపించ లేదు ..ఈమె బదులు జరీన బెటర్ ..గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్ష్ నలో  ఇదే పాట  కు డాన్సు చేసిన జరినా  బాగా చేసింది ...ఈమే కు బహుశా ఓ ఐదు.. పది వేలు ఇచ్సి ఉంటారు .....సినిమా లో ఈమెను పెట్టిన కోటి మిగిలేది .. ఎంత పొరిగింటి పుల్ల కూర రుచి అయిన ..కాస్త ఆలోచించి  పాకు లాడితే  మంచిది . 

11, మే 2012, శుక్రవారం

అభిమానులకు వేసవి వినోదం పంచిన "గబ్బర్ సింగ్ " *చిత్ర సమీక్ష




అభిమానులకు వేసవి వినోదం పంచిన "గబ్బర్ సింగ్ " *చిత్ర సమీక్ష


9, మే 2012, బుధవారం

మిల్క్ బ్యూటీ తమన్నా - పులిహార .కథ

మన పులిహార అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉంటారు ? మిల్క్ బ్యూటీ తమన్నా అయితే లొట్ట లేసుకుని తిందట ....అది ఒక హీరో గారు పెడితే .....ఇంతకి ఈ తమన్నా పులిహార గోల ఏమిటి ? ..రచ్చ సినిమా షూటింగ్ కోసమా చైనా వెళ్ళినపుడు ...అక్కడ దొరికే న్యూడిల్స్ తినలేక  అవస్త్జ పడేదట  తమన్నా .......హీరో రామ్ చరణ్ తన ఇంటి నుంచి పులిహోర తెప్పించి పెడితే,,,లొట్ట లేసుకుని ఆకలి తీర్చుకుందట .......ఇది విషయం .....
మొన్న టి వి లో ప్రసారం అయిన ఇద్దరు చేసుకున్న ప్రోమో  చర్చ లో చరణ్ ..." నీకు ...నేను తప్ప ఎవ్వరు పులిహార పెట్ట లేదు అంటూ ......." అంటూ పలుమార్లు తమన్నా ను ఆట పట్టించారు ...కథ 

8, మే 2012, మంగళవారం

సాక్షి పత్రిక ,సాక్షి టి వి లకు సంబంధించి ఎకౌంట్లు సి బి ఐ నిలిపి వేయడం తో

జగన్ అరెస్ట్ అవుతారా ? ఈ నెల ఇరవై ఎనిమిది న తేలనుంది ..అయితే  సాక్షి పత్రిక ,సాక్షి  టి వి లకు సంబంధించి ఎకౌంట్లు సి బి ఐ నిలిపి వేయడం తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ....జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎన్నో రోజులగా  ...ముఖ్యంగా రాజకీయంగా రగడ జరుగుతోంది ......తండ్రి ని అడ్డం పెట్టుకుని  జగన్ కోట్లు గడించి.....తన మీడియా తో  రాజకీయం చేస్తున్నాడని  ఆరోపణలు ఉన్నాయి .........మరి జగన్ పరిస్థితి ఎలా  ఉంటుంది ?????/ 
కాగా వాళ్ళ ఆయా సంస్థలలో పని చేసే సిబ్బంది ఎన్నిఇబ్బందులు ఎదుర్కోవాలి ?

..అత్తెసరు మార్కులు వాడిని ఇంజనీరు ను చేస్తే ?...........

 మన గవర్నర్ గారు అన్న మాటలు అక్షరాల నిజం ."సున్నా మార్కులు వచ్చిన ఉన్నత విద్య లో సీటు ఇవ్వడం "ఏ మాత్రం మంచి పద్ధతి కాదు ...మంచి నాణ్యత గల విద్య  నేర్చిన వారు మాత్రమె మన సమాజానికి ఉపయోగ పడతారు .డబ్బులు ఉన్నాయనో ..సర్కార్ పరంగా  సాయం వచ్చింది అనో ...రాజకీయో మో .......ఏదైనా పద్ధతి తో సీటు సంపాదించి అల్లి బెల్లి చదువు తో అందలం ఎక్కితే  ప్రమాదం ....రాకెట్ తయారి బృందం లో నాణ్యత లేని వ్యక్తి  ఉంటె ఎమవు తుంది ?......కాపి చదవు గాడు డాక్టర్ అయితే ..?.అత్తెసరు మార్కులు వాడిని  ఇంజనీరు ను చేస్తే ?...........
అందరికి విద్య కావాలి ..పేద ..ధనికుడు  అన్న భేదం లేకుండా ప్రభుత్వం సాయం చేయాలి ..కాని తగిన అర్హత లేని వారిని ప్రోత్స హించడం మంచిది  కాదు ...

2, మే 2012, బుధవారం

తమన్నా అంత అందం గా ఉండడానికి కారణం




 తమన్నా అంత అందం గా ఉండడానికి కారణం సరిపడే నిద్ర కారణం అట .ఆమె స్వయం గా  చెప్పింది ,షూటింగ్ లేని సమయం లో అవకాశాన్ని బట్టి ...ఇంకే మీ ఆలోచనలు లేకుండా  హాయగ్గా నిద్ర పోతోంది అట .చేసిన సినిమా హిట్,,,    గురించి పట్తించు  కోకుండా బవిష్యత్ గురించి బెంగ పడకుండా ముందుకు పోవడమే తన విజయానికి కారణం అని చెబుతోంది .తెలుగు ,తమిళం తనకు రెండు కళ్ళు అని ...ఈ భాషలు నేర్చ కుంటు న్నానని చెప్పింది 

18, ఏప్రిల్ 2012, బుధవారం

రవికి చిచ్చుపెట్టిన చిరు టిఫిన్ ?

చిరు ఇంటికే ఎందుకు వెళ్లావు రవి ?
పాపం పార్టిని చక్క దిద్దుదామని వచ్చిన వాయిలాల రవి కే నేతల నుంచి నిరసన ఎదురవుతోంది ..కొత్త గా రాజ్య సభ్యుడైన చిరంజీవి ఇంటికి టిఫిన్ కి వెళ్ళడమే రవి చేసిన తప్పట ......పార్టీ అధికార ప్రతినిదిగా వచ్చిన రవి హోటల్ లో ఉండాలి ...అవసరం అయిన వారిని పిలిపించుకోవాలి గాని ఈయన వెళ్ళడం ఏమిటి అని "రవి కి తలంటు పోస్తున్నారు.. .
."ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి " అని వారి  అర్ధమా ?

17, ఏప్రిల్ 2012, మంగళవారం

గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాస రావు పాడిన పాట..-డియ్యాలో డియ్యాలో తర్వాత మళ్లి కెవ్వు కేక

మందు బాబులం మేము మందు బాబులం .
.మందు కొడితే మేము మహారాజులం ...
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గబ్బర్ సింగ్  లో కోట శ్రీనివాస రావు పాడిన పాట ఇది .
వయసు మీద పాడిన కోట గళం భలే తమాషా గా ఉంది .
గబ్బర్ సింగ్ లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయ్ .
దేకో దేకో గబ్బర్ సింగ్ ...అనే పాటను బాబా సెహగల్  ఉషారుగా గానం చేసారు 
పిల్ల   అనే పాట కూడా ఫాస్ట్ గా బావుంది .
మమత శర్మ గానం చసిన కెవ్వు కేక క్లబ్ సాంగ్ కుర్రకారుకి కేక పెట్టించేది లా ఉంది .
దేవి శ్రీ ప్రసాద్  ప్రతి సినిమా లో ఏదో స్పెషల్ ఉంటుంది 
డియ్యాలో డియ్యాలో తర్వాత మళ్లి కెవ్వు కేక పెట్టించాడు 

.వావ్ ! ఇది మన ఊరేనే ? ఆరోజు..

మీ గ్రామానికి ప్రభుత్వ పరంగా ఏమైనా అభివృద్ధి  జరగాలని అనుకుంటున్నారా  ? అయితే  మీ గ్రామానికి ఏ మంత్రో ...ఉన్నత అధికారో రావాలని కోరుకోండి......ఎన్నికలు వస్తే మరి మంచిది ...
ఎవరైనా అధికారం గల వారు వస్తున్నారంటేనే...మన వీధులు శుభ్రం గా కనిపిస్తాయి ..బ్లీచింగ్ జల్లుతారు ......పూడికలు పూడ్చడం ....వావ్ ఆరోజు ఇది మన ఊరేనే ? అనిపిస్తుంది..ఎందుకంటే ఎప్పుడు రోడ్ మీద ఏమున్న పట్టించి కొనే నేతలు ..ఈ రోజు ఇలా కనపడితే ......????? 
ఇది మన ప్రజాస్వామ్యం ..................మన దౌర్భాగ్యం ......కాదు కాదు మనం చేతులారా చేసుకుంటున్న ......రాజకీయం ....ఏ పార్టీ అధికారం లో ఉన్న అదే పరిస్తితి ..నేడు అంతే..త్వరలో ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజవర్గ ప్రాంతాలకు కోట్ల నిధులు మంజూరు అయిపోతున్నై ..క్షణాల్లో జీవోలు ..రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ?

మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ పాలన

వై ఎస్ ఆర్ తర్వాత మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ  పాలన మొదలయినట్టు ఎవరికైన యిట్టె అర్ధం అవుతోంది ...మొయిలీ రాక తో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్తితి పై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నై .....తరచు ముఖ్య మంత్రులను మార్చే ప్రక్రియ కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉంది ..పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు మామూలే ...ఎవరి ఇష్టాలు వారివి ..ఎవరి స్వార్ధం వారిది ...తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ లో తాకట్టు పడుతున్నారంటూ నాటి ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ స్తాపించి ..కాంగ్రెస్ ను ఖంగు తినిపించారు ........టి డి పి ఓడినప్పుడు అధికారం వచ్చిన మళ్లీ కుమ్ములాటలే.......ఇది పరిస్తి తి  కొనసాగితే కాంగ్రెస్స్ కు మరింత కష్ట కాలమే ...తెలుగు ప్రజల అవసరాలకు తగ్గట్టు ఢిల్లీ పాలన ఉంటుందా ?????

15, ఏప్రిల్ 2012, ఆదివారం

తార చౌదరి పై సినిమా కు టైటిల్స్ ఇవే

సంచలనం రేపిన తార చౌదరి పై సినిమా తీయడానికి నిర్మాతలు రెడి అవుతుంటే ..పలువురు రచయతలు ,దర్శకులు అప్పుడే కథ తయారు చేసేస్తునట్టు చెప్పు కుంటున్నారు .మరో పక్క టైటిల్ నమోదు జరిగిపోతోంది ..ఈ నేపధ్యం లో పలువురు కుర్రాళ్ళు ఈ సినిమాకు సరదాగా  తమాషా టైటిల్ చెప్పు కొచ్చారు ..ఓ సారి మీరు లూక్కెయండి   ..


తార వస్తోందోస్తోంది 


ఓ మై తార !


తారతళుకులు 


 తళుకు మన్న తార 


మై ప్యారి తార 


,అమ్మో తార !

14, ఏప్రిల్ 2012, శనివారం

.అంత మన మంచికే .రాష్ట్రం లో మరో రాజకీయ కూటమి ,, జయప్రకాష్ నారాయణ సారధ్యం !

.రాష్ట్రం లో  మరో రాజకీయ పార్టీ వస్తోంది ........అది పార్టీల సంకీర్ణం కావచ్చు ....వేరే కావచ్చు ...లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ దీనికి రూపకల్పన చేయడం విశేషం ..నిజమే నేడు ముఖ్యమని పాత్రీలు అన్ని రాజకీయ సంక్షోభాన్ని ...క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటూ ఉన్నాయి .కాంగ్రెస్స్ కలహాలతో ..తెలుగు దేశం ....సవాలక్షా కారణాలతో సతమత మోవుతున్నై ..కొత్తగా పుట్టుకు వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ అధినేత ఆరోపణల తో తల్లడిల్లుతున్నారు ..ఈ సమయం లో మంచి బలం గల పార్టీ వస్తే ...గ్యారంటీ గా దూసుకుపోతోందని రాజకీయ పండితులే సెలవిస్తున్నారు ..చిరం జీవి ఇలాంటి సమయంలో రాజకీయంలో ప్రవేశిస్తే లాభం చేకూరేదని ఆయన అభిమానాలే అంటున్నారు ....కాని ఆయన ...అయన పార్టీ .అల అయిపోయారు 
ఇక రాజకీయంగా చూస్తె ఎటువంటి ఆరోపణలు లేని జయప్రకాష్ నారాయణ  లోకసత్తా పార్టీ పెట్టిన ...ఉన్న ధన ...అధికార ...కుల .....కుయుక్త్తులు మధ్య ఆయన అనుకున్నన సీట్లు సంపాదించ లేక పోయారు ...ఏం ఎల్ ఏ అయిన తరవాత ....రాజకీయం పూర్తిగా అర్ధం అయి ఉంటుంది ....ఇప్పుడు రాష్ట్రం లో మూడు ప్రత్యమ్న్యాం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ..ముందుగా అయన కమ్యూనిస్టుల తో మాట్లాడారు ..తర్వాత ..మరో పార్టీ తో ..రాష్ట్రం లో ఎన్నో చిన్న చితక పార్టీలు ఉన్నాయి ..ఎంతో మంది మేధావులు ఉన్నారు ...వీరినందరిని కలిపితే మూడు కూటమి సాధ్యమే ..అంత మన మంచికే ..అయితే ఇది అయ్యే పనేనా ? ఏమో చూద్దాం 

7, ఏప్రిల్ 2012, శనివారం

కొంపదీసి ..నా పేరు కాని ,నా సెల్ నంబర్ కాని "తార"" లిస్టు లో ఉందా?..................తార గుప్పిట్లో ఎందరు శృంగార పురుషులు !

హైటెక్ సెక్స్ రాకెట్ నడుపుతున్నది అంటూ తార చౌదరి గురించి మీడియా లో వస్తున్నా కధనాలు చూస్తుంటే ఏ శృంగార సినిమా సరిపోదేమో అనిపిస్తోంది .ఆమె సెల్ ఫోన్ లో ఎనిమిది వందల నంబర్లు ..కేవలం మూడు నెలల కాలం లో ఎనిమిది వేల కాల్స్ ........
ఆ ఆరోపణలు  నిజమైతే ....(ఆధారాలు ఉన్నాయి అంటున్నారు )
వార్నీ.!.భలే బాలామణి కాబోలు ....
ఆరోపణలు ఎదుర్కున్న తార కోర్టు మెట్టులు ఎక్కుతుండగా ..ఆమె తో వ్యవ హారం నడిపిన వారు పోలీసుల చెంత కు చేరుతున్నారట ...
పోలీసు బాబాయ్ !కొంపదీసి ..నా పేరు కాని ,నా సెల్ నంబర్ కాని "తార లిస్టు లో ఉందా?చూసి చెప్పి పుణ్యం కట్టుకో మంటున్నారట..తార కు పలువురు సిని ..రాజకీయ ప్రముఖులతో సంబంధం ఉందని వార్తలు వస్తున్నా నేపధ్యం లో వాళ్ళ కాళ్ళు వణుకుతున్నాయి అన్నమాట .
నిమిషాల సౌఖ్యం  కోసం చూసుకుంటే ....జీవితాంతం టెన్సన్ పడక తప్పదు మరి ....
రంకు..బొంకు ఎన్నాళ్ళు దాగుతుంది .?..అని పెద్దలు ఊరకే అనలేదు కదా !

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

రచ్చ సినిమాలో ఆ డైలాగ్ అవసరమా ?

రచ్చ సినిమాలో ఆ డైలాగ్ అవసరమా ? ఇదే విషయాన్ని చాలమంది చర్చించు కుంటున్నారు .
"ఏదో చూసి తొడలు కొట్టే టైపు కాదు నాది ""...........రాం చరణ్ కొత్త సినిమాలో ఓ డైలాగ్ ఇది .
ఈ డైలాగ్ వచ్చినప్పుడు సినిమా హాల్ లో అభిమానుల చప్పట్లు ఏ రేంజ్  లో మ్రోగుతున్నాయో 
అదే స్తాయిలో  చర్చ సాగుతోంది ....తొడ అనే పదం కు సిని పరిశ్రమలో ఎవరికి సంబంధమో అందరికి 
ఇలాంటి డైలాగ్స్ వల్ల అభిమానుల మధ్య వైరం పెరిగే అవకాసం ఉంటుంది ..వారి సినిమా లో వీరు వీరి 
సినిమాలో వారు ఇష్టం వచ్చినట్టు ఊగిపోతారు ..ఇది మంచి పద్దితి కాదు అని సీనియర్ అభిమానులే 
అంటున్నారు ...హీరోలు మాత్రం ఒకరి సినిమాకు ఒకరు క్లాప్స్ కొట్టుకోవడం .పోగుడుకోవడం......తీరా 
సినిమాల్లో ఇలా చేయడం .......విచిత్రం గా ఉంటుంది ....
 సినిమా ను పెద్దలు ముందే చూసి ఉంటారు .....ఈ డైలాగ్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో తెలియదా ?
కుర్ర హీరో ల దూకుడు పెద్దలు కంట్రోల్ చెయ్య వలసిందే ......
తెలుగు సినిమా బాగు పడాలి అంటే  ముఖ్యం గా హీరోలు ,దర్శకులు ,నిర్మాతల మధ్య మంచి సయోధ్య ఉండాలి ...అది సాధ్యం అయ్యేల్ సిని పెద్దలు నడుం కట్టాలి 

.హీరోలకు సవాల్ ,నాటి బ్లాక్ బ్యూటీ , నేటి మిల్క్ బ్యూటీ

సాధారణంగా హీరో  చెంత హీరొయిన్ గ్లామర్ తప్ప  పెద్ద గా హీరో తో పాటు పాత్రలు ఉండవు ..అంత ప్రాధాన్యత ఉండదు .కాని ఒక్కోసారి హీరొయిన్ పాత్ర చిందే అయిన మంచి గుర్తింపు ఉంటుంది ..ఈ మధ్య సినిమాల్లో హీరొయిన్ పాటలకే పరిమితిం అవుతోంది ...క్రుర్ర హీరోలు కాబట్టి హీరో గారి స్టెప్స్ కే ప్రాధాన్యత నిస్తున్నారు ..ఈ క్రమం లో వచ్చిన "రచ్చ " సినిమా లో తమన్నా వేసిన స్టెప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ..పరిశ్రమలో ....ప్రేక్షకులు ..సిని విమర్శకులు ఇదే విషయాన్ని చర్చించు కుంటున్నారు ....తమన్నా ను చూసి నాటి బ్లాక్ బ్యూటీ "రాధ " ను గుర్త్కు తెచ్చుకుంటున్నారు .చిరంజీవి ,బాలకృష్ణ ,వంటి స్టార్స్ తో పోటీ పడి రాధా స్టెప్స్ వేయడం జరిగింది .చాల సార్లు హీరో లను మించిపోయి రాధ స్టెప్స్ వేచి అందరి చేత శభాష్ అనిపించుకుంది ...నేడు మళ్ళి నేటి మిల్క్ బ్యూటీ  తమన్నా తన స్టెప్స్ తో మతి పోయేలా చేసింది ..రామ్ చరణ్ స్టెప్స్ కే సవాల్ విసిరింది ....( ఈ స్టెప్స్ ,అందం చూసేనేమో  తన నూట యాబై సినిమా లో తమన్నా హీరొయిన్ గా ఉంటె బావుంటుంది అని మెగా స్టార్ చిరు రచ్చ ఆడియో ఫంక్షన్ లో తన కోరిక ను వెల్లడించారు )......అంటే తమన్నా దూకుడు తో హీరో లు స్టెప్స్ వేయవలసిందే .హీరోలకు సవాల్ 

5, ఏప్రిల్ 2012, గురువారం

రచ్చ సినిమా కథ

రచ్చ సినిమా కథ  
 బెట్టింగ్ రాజ్ (చరణ్ )  రిస్క్ పనులు చేసే ఓ బస్తి కుర్రాడు .ఏం ఎస్ నారాయణ ,సుధా దంపతుల వద్ద పెరుగుతుంటాడు .నారాయణ ఆపరేసన్ కోసం ఓ ఇరవై లక్షలు అవసరం కావడం తో జేమ్స్ (అజ్మల్ ) 
పందెం కడతాడు .బెట్ ప్రకారం గనులు గల పెద్ద మనిషి బళ్ళారి (ముఖేష్ రుషి ) కూతురు  చైత్ర (తమన్నా ) 
ను ప్రేమించి ఓ ముప్పై రోజులలో ఆమె తో ఐ లవ్ యు చెప్పించాలి ....డబ్బు కోసం చైత్ర వెంట పడి..ఎన్నో రిస్క్స్ 
చేసి చివరకు ఆమె ప్రేమను పొందుతాడు ...అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది .....చైత్ర కోసమే జేమ్స్ బెట్ కట్టడం ....అసలు చైత్ర ఎవరు అన్న నిజం తెలుస్తుంది ..రాయదుర్గం లోని మూడువేల ఎకరాల్లో ఉన్న ఇనప ఖనిజం కోసం బళ్ళారి చేసిన దుర్మార్గం ......తన తండ్రి మరణం  వంటి విషయాలు తెల్సుకున్న రాజ్ శత్రువులలను ఎలా చంపాడు అన్నదే మిగతా కథ .

rachcha cinema reviewtelugu రచ్చ రచ్చ ..చేసిన రామచరణ్ రెచ్చిపోయిన తమన్నా ..పంజా విసిరినపరుచూరి బ్రదర్స్




ఆరంజ్ తో నిరాశలో ఉన్న రామచరణ్ అభిమానులకు రచ్చ ఆనందాన్ని పంచుతుంది .కొత్త దర్శకుడు సంపత్ నంది కుర్రకారును కనువిందు చేసాడు ...బోర్ కొట్టకుండా సినిమా తీయ గలిగాడు  తమన్నా అందాలు సిన్మాకు ప్లస్ పాయింట్ ...కొంతకాలం సైలెంట్ గా ఉన్నా పరుచూరి బ్రదర్స్ మళ్లీ తమ పంజా విసిరారు .
రచ్చ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన మొదటి మూవీ ...ఇది .
 సినిమా కథ  కొంత వరకు పాతదే అయిన కొంత కొత్త గా ఎన్నుకున్నారు .ట్విస్ట్ లకు అవకాశం గల కథ .ముఖ్యం గా కథనం చక్కగా ఉండడం ....ప్రేక్షకులను దియేటర్ నుంచి కాలు కదపకుండా చేసింది పెద్దగ కొన్ని సన్నివేశాల్లో సస్పెన్సే లేక పోయిన  మొదటి నుంచి థ్రిల్లింగ్ గా ఉంది .
 సినిమాలో మగధీర ,చిరుత చాయలు ఉన్నాయి .మగధీర లో ఎంట్రన్సు లో ఉండే బైక్ రేస్ మాదిరిగా వచ్చే ట్రైన్ ముందుకు వెళ్ళే కార్ పోటి ఉంది ..చిరుత లో క్లైమాక్ష్ మాదిరి గా అడవి ..హెలికాప్టర్ తో వచ్చి హీరొయిన్ ను తీసుకు పోవడం ఉంది ...
అయిన సీన్స్ బాగేనే తీసారు .మగధీర లో మాదిరి జ్ఞాపకాలు  సీన్ కూడా కొంత ఉంది .రామ్ చరణ్ తనదైన స్టైల్ లో కనిపించాడు ...పాటల్లో ..ఫైట్స్ ల తన ఎనర్జీ మళ్లీ రుచి చూపించాడు ....(టైటిల్ సాంగ్ లో మాత్రం స్టెప్స్ అభిమానులను నిరాశ పరిచాయి ....కాని డిల్ల డిల్ల పాత లో మాత్రం ఇరగదీసాడు ) ఈ సినిమాల్లో పలు చోట్ల తన తండ్రి చిరంజీవి ని అనుకరిచాడు .." పేసు టర్నింగ్ ఇచ్చుకో  "లాంటి సీన్ హీరొయిన్ తమన్న తో చేసాడు .....చరణ్ నటన లో మెరుగుదల ఉంది 
 తమన్నా తన అందచందాలతో కనువిందు చేసింది .డాన్సు లో కసి కనిపించిది .కొన్ని స్టెప్స్ లో చరణ్ ను కూడా మించి పోయి చేసి నాటి రాధను గుర్తుకు తెచ్చింది .
 ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ తమ కలం పోటు మరో సారి రుచి చూపించారు ...
"నువ్వు అరిస్తే అరుపులే ..నేను అరిస్తే మెరుపులే ....
"శరీరం లో సునామి పుడుతోందా?" లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు ..అంతేకాదు పరిచూరి వెంకటేశ్వర రావు  ఓ కీలక పాత్ర పోషించారు.
సిమాలో సెట్టింగ్స్ బావున్నై ..విలన్ ఇల్లు ఇంద్రలోకాన్ని మైమరిపించే విదంగా కనిపించింది ...బ్రమానందం ,వేణు ,తాగుబోతు రమేష్ ,ఆలి పాత్రలు పరిమతం గానే ఉన్నాఉన్నంత లో హాస్యం పండించారు 
 .ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయ్ .రెండు పాటలు  ఏదో మధ్యలో ఇరికించి నట్టు కనిపిస్తోంది ..కొన్ని పాత్రలు మరి పరిమితంగా ఉన్నాయ్ .మొత్తానికి ఇది మాస్స్ టార్గెట్ తో తీసినట్టు తెలోస్తోంది....పైసలు మాత్రం భాగానే వస్తాయి .

29, మార్చి 2012, గురువారం

dammu songs review .దమ్ము పాటల రివ్యూ

దమ్ము లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి .కీరవాణి 
బాబా సెహగల్ పాడిన  ఓ లిల్లీ ..బూరి బుగ్గల బుల్లి పాట తో ఆడీయో ప్రారంభమైంది  

రాహుల్,శ్ర్వావని భార్ఘవి ,శివాని  గానం చేసిన "వాస్తు బాగుందే..బేబివాస్తు బాగుందే " అనే పాట ఫాస్ట్ బీట్ తో హుషారుగా ఉంది .బహుశ ఈ పాటను హీరో ,ఇద్దరు హీరొయిన్ ల మీద చిత్రీకరించి ఉంటారు ...మంచి స్టెప్స్ వేయడానికి అనుకూలమైన మూజిక్ ఉంది 
నీలో ఉంది దమ్ము ...నాలో ఉంది సొమ్ము 
దమ్ము సొమ్ము ఏకం చేసి ...అనే పాట  క్లబ్ మాస్ బీట్ గా ఉంది ...బహుశ ఈ పాటను కూడా హీరో ,ఇద్దరు హీరొయిన్ ల మీద చిత్రీకరించి ఉంటారు 
రూలర్......రాజది రాజ  అనే పాట  రెండు వర్సన్ లో ఉన్నాయి .ఒకటి సినిమా వర్సన్ ,..రెండవది సీడీ వర్సన్ ....మగధీర లో ధీర ...ధీర పాటను పోలి ఉంది .
రాజు వచ్చినారు .....శ్రీ శ్రీ రాజ వాసి రెడ్డి ..నీవు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అంటూ క్లాస్స్ మిక్ష్ చేసిన మాస్స్ సాంగ్ కీరవాణి స్వయంగా గానం చేసారు ....సింహ పదజాలం తో ఈ పాట సాగింది .వైవిధ్యంగా ఉంది ఈ పాట .
మొత్తం మీద ఎన్ టి ఆర్ అభిమానులను అలరించే విదంగా పాటలు ఉన్నాయ్ 

దమ్ము ఆడియో రిలీజ్ ఫంక్షన్కు ఎన్ టి ఆర్ ప్రణీత తో ...సౌండ్ తగ్గించుకో ....ఒక్కసారి కొట్టానంటే





దమ్ము ఆడియో రిలీజ్ ఫంక్షన్కు   ఎన్ టి ఆర్  ప్రణీత తో కల్సి వచ్చారు .కీరవాణి దంపతులు ఎన్ టి ఆర్  దంపతు లకు తోలి సీడీ అందించారు .ట్రైలర్ ను దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు .బోయపాటి శ్రీను ...ఎన్ టి ఆర్ సిన్మాలో డైలాగ్స్ చెప్పి అలరించారు .....ట్రైలర్ బావుంది ...సింహ మాదిరి గానే సినిమా కనిపిస్తోంది
ఒక్కసారి కొట్టానంటే ...నంటూ పవర్ఫుల్ డైలాగ్  చెప్పారు .
సౌండ్ తగ్గించుకో ....ఒక్కసారి కొట్టానంటే గొంతు రావడానికి అయిదు రోజులు పడుద్ది 

25, మార్చి 2012, ఆదివారం

గాంధి తాత !ఈ పండు తిను (నిజమైన ఫోటో తో )





మిట్ట మధ్యహ్నం  రెండు గంటల సమయం ...తిరుపతి సమీపాన పాపనాసనం దగ్గర రోడ్ పై  ఓ ముసలి వాడు హటాత్ గా గాంధి వేషం లో నిలబడ్డాడు .....తన కాళ్ళ దగ్గర ఓ ప్లాస్టిక్ డబ్బా పెట్టాడు ..ఓ డబ్బాలో పలువురు డబ్బులు వేస్తున్నారు .......కాని ఓ వ్యక్తి మాత్రం అక్కడ అమ్ముతున్న ఫ్రూట్ సలాడ్ తీసుకు వచ్చి .." తాత ! తిను " అంటూ పిలిచాడు ....దాదాపు అతను ఓ పది నిమిషాలు ప్లేట్ పట్టుకుని అలానే ఉంది పోయాడు ..కాని గాంధి వేషదారి మాత్రం కదల లేదు ...మెదల లేదు ....ఈ లోగ బస్ రావడం తో "తాత తర్వాత తిను " అని ముందుకు కదిలాడు .....
ఈ రోజుల్లో ఇలాంటి మానవత్వం గల మనిషి కనిపించడం చాల అరుదు కదా ?

23, మార్చి 2012, శుక్రవారం

సుమ ,ఝాన్సి ల కు పోటీ యాంకర్ ?

టీవీ న్యూస్ రీడర్స్ కూడా క్రమం గా యాంకర్స్ గా మారుతున్నారు .ప్రత్యెక ఫంక్సన్ లలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు .తాజాగా టి వి నైన్ న్యూస్ రీడర్ దీప్తి వాజపేయీ  నేడు నంది అవార్డ్ ఫంక్సన్ లో యాంకరింగ్ చేసింది .సుమ ,ఝాన్సి ల కు పోటీ గా వస్తుదేమో .

22, మార్చి 2012, గురువారం

నెలకు పైగా నిల్వ .ఉండే ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి అంటే ఇష్ట పడిన వారు ఉండరు ..అయితే ఆయా ప్రాంతాలను బట్టి పచ్చడి ఉంటుంది .అమృతం లాంటి పచ్చడి చాల రోజులు వరకు కూడా నిల్వ చేసు కోవచ్చు.
పచ్చడి పల్చగా కాకుండా జెల్ మాదిరిగా చేసు కుంటే బావుంటుంది ....ఇది ఎలా చెయ్యాలి అంటే 
 కావలసినవి
 "బాగా ముగ్గిన కర్పూర అరటి పళ్ళు ఓ డజెన్.....కే జి బెల్లం ,పావు కే జి వేపిన సెనగ పప్పు ,ఓ మామిడి కాయ ,పావు కే జి చింతపండు  ,తగినంత వేపపువ్వు ,సాల్ట్ ,నెయ్యి ,కిస్మిస్ ...
తయారి విధానం  ఓ వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకుని ...ముందుగా సిద్దం చేసుకున్న చింతపండు గుజ్జును వేసి బాగా కలియబెట్టాలి .తర్వాత తరిగిన బెల్లంను వాసి అది నీటిలో మొత్తం కరిగేలా చూడాలి ...(అవసరాన్ని బట్టి కొంత నీరు చేర్చాలి ).అరటి పండు ను ఒక్కటిగా తీసుకుని దానిని బాగా పిసకాలి .పాత్రలో బెల్లం ,చింతపండు ,అరటిపళ్ళు మొత్తం ద్రవరూపం పొందాలి ...ఈ ద్రవ మిశ్రమం లో మామిడి ముక్కలు ,సేనగాపప్ప్కు ,కిస్మిస్స్,వేప పువ్వు ,సాల్ట్ ,వేసి మొత్తం కల్పి ...చివరగా కొద్దిగా నెయ్యి చేర్చాలి .......ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ ..ఇది బయట పదియేను రోజులు ,ప్రిజ్ లో అయితే నెలకు పైగా నిల్వ ఉంటుంది ..

20, మార్చి 2012, మంగళవారం

బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప.......అసలు కారణం ?

ఏదైనా బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప ...వేరే కోణం  లోంచి ఆలోచించడం మర్చిపోతున్న్నాం ....ఈ రోజు ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ పడి పదిమందికి పైగానే చనిపోవడం భాదాకరం .తూర్పు లో బస్ ప్రమాదం మరవక ముందే  మరో ప్రమాదం .........ఈ ఘటనలలో బస్ నడిపిన  డ్రైవర్ ..స్కూల్ యాజమాన్యం భాద్యత వహించ వల్చిందే ......నిబందనలకు అనుగుణం గా బస్ నడుపుతున్నారు లేదో నిగ్గు తేల్చి శిక్షించవలసిందే ..కాని అంతకంటే ముందే సర్కారు తీరును కూడా ప్రశ్నించాలి.జరిగిన ఘటనలు పరిశీలిస్తే .....ఇరుకైన ,పాడైన...వంతెనలు ...సరిగా లేని రోడ్స్ వద్దే ప్రమాదాలు జరగుతున్నై .ఈ విషయం పై లోతుగా చర్చించాలి ....ముఖ్యం గా చిన్నారుల భవిష్యత్ ద్రుష్టి లో ఉంచుకుని ..ఆయ స్కూల్ బస్ లు ఏ రోడ్ పై వెళ్తున్నై ..అవి సేఫ్టీ యా కాదా పరిశీలించాలి ..ఈ కట్టడి వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తమ బిడ్డల కోసం మంచి సదుపాయాలు రోడ్స్ ,వంతెనలు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి పెంచుతారు ..అన్ని బాగుపడతాయి ?

9, మార్చి 2012, శుక్రవారం

ఆ బాలిక కు గుర్తింపు ఏది ?

 కబాడీ లో ప్రపంచ కప్పు  సాధనలో మన తెలుగు బాలిక ఉంది ....కాని గుర్తింపే లేక పోవడం భాదాకరం .మహారాష్ట్ర ఇప్పటికే విజేతలకు పెక్కు నగదు బహుమతులు ఇచ్చింది ..కబాడిలో అందున ఓ బాలిక లక్ష్మి విజయం తో తిరిగిన వచ్చిన తగిన ఫలితం లేక పోవడం దారుణం ..క్రికెట్ వంటి వాటికే ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళ సంప్రదాయక ఆటలు మరుగున పడిపోట్టున్నై అనుటకు ఇదే ఉదాహరణ ....లక్ష్మి విషయంలో చాల చానెల్స్ స్పదిస్తున్నై ..సర్కార్ కూడా వెంటనే స్పందిస్తే మంచిది 

7, మార్చి 2012, బుధవారం

.విమానం లో చెప్పులు తెప్పించుకున్న ........??..చాల గట్టిగా బుద్ది చెప్పడం

ఉప ఎన్నికల ఫలితాలను ,అక్కడి రాజకీయాన్ని ఓ సారి పరిశీలిస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితం గా అర్ధమౌతోంది.అవినీతి నేతలకు పతనం తప్పదు..రౌడీ గూండాలకు చోట లేకుండా చేయవచ్చు అని .విమానం లో చెప్పులు తెప్పించుకున్న విలాస  సి ఏం ,ప్రభుత్వ డబ్బును మంచినీళ్ళ ల ఖర్హు పెట్టి విగ్రహాలు పెట్టించుకున్న మాయావతికి అక్కిడి ప్రజలు చాల గట్టిగా బుద్ది చెప్పడం సంతోషకర విషయం ..ములాయం కుమారుడు అఖిలేష్ యువతకు స్ఫూర్తి దాయకం గా నిలిచారు .తన పార్టీలో రౌడీ లకు స్థానం లేకుండా చేసి జనం మనసు గెల్చుకున్నారు .ఇలాంటి యువ నేతలు అన్ని రాష్ట్రాల్లో ఉంటె దేశం బాగు పడుతుంది .

25, ఫిబ్రవరి 2012, శనివారం

రైల్వే స్టేషన్ లో భోజనం లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే

రైల్వే స్టేషన్ లో భోజనం  లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే పట్టికేల్లాలి.తీరా మీరు తినొచ్చు తినక పోవచ్చు ......ప్రయాణికుల బలహీనతలతో సొమ్ము చేసుకుంటూ కనీస ధర్మం పాటించక పోవడం దారుణం ....పెద్దదైన బెజవాడ వన్న్తి స్టేసన్ ల లోనే దారుణమన పరిస్తితి ..చూడడానికి మాత్రం చాల చూడముచ్చటగా ఉంటున్నాయి ....సౌత్,నార్త్ ,చైనీస్ అంటూ ..బోర్డ్స్ పెట్టి ప్రయానికులను నిలువునా దోసుకుంటున్నారు.ఉదాహరణకు ఓ వెజ్ భోజనం డబ్బై రూపాయలు ....కొంత రైసు,పప్పు ,సాంబార్ ,ఓ కూర ,ఓ కప్పు పెరుగు ..ఇది మెను.....పోనీ ఇవన్ని రుచిగా ఉంటాయంటే ..అది లేదు ...పై పెచ్చు ...చిన్న పిల్లోడికి అయిన  డబ్బై చెల్లించాలి ......పాపం చిన్న పిల్లోడు కథ అదే ప్లేట్ లో తిన మని తల్లిదండ్రులు  అనుకున్న కుదరదు ..హోటల్ వారు ఒప్పుకోరు .....ఇక టిఫిన్స్ అంతే..రైల్ కోసం వేచి చూసే వాళ్ళు ,త్వరగా వెళ్ళాలి అనుకునే వారు ......పాపం అన్నం తినాలని ఆశ పడే వారి అవసరాని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు ....శుచి ,శుబ్రత లో ఎంతో శ్రద్ద చూపిస్తున్న రైల్వే శాఖ ఈ దోపిడీ హోటల్ ల గురుంచి కూడా కొంత శ్రద్ద పెడితే మంచిది 

13, ఫిబ్రవరి 2012, సోమవారం

వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు


L
L
L
LLLLLLL



ప్రేమ పవిత్ర మైనది ......తల్లిదండ్రులను ప్రేమించిన వారు ..తన ప్రియులను ప్రేమిస్తారు 
ప్రేమ గుడ్డిది ................అమ్మాయి ఆకారమే చాలు ...అంతర సౌందర్యం అక్కర లేదు 
ప్రేమ పిచ్చి .................ఇదొక వెర్రి 
వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు 

8, ఫిబ్రవరి 2012, బుధవారం

చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే

చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే మన దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్ధం చేసుకోవచ్చు .కర్ణాటకలో మంత్రులు సభ లోనే నీలి చిత్రాలు చూడడం మనందరికీ మాయని మచ్చ .ఇలాంటివి జరిగితే యువత మరింత పతనం కాక తప్పదు.ఇలాంటి ప్రజా ప్రతినిదులకు భవిష్యత్ లేకుండా క ఠిన చర్యలు తీసుకోవాలి 

4, ఫిబ్రవరి 2012, శనివారం

జగ్గంపేట లో జగన్ సందడి



వై ఎస్ ఆర్ అధినేత జగన్ ఈరోజు జగ్గంపేట లో సందడి చేసారు .సాయంత్రం ఆరు గంటలకు జగ్గంపేట వచ్చారు .ముఖ్యమైన కార్యకర్తలను కల్సుకుని పొటోలు దిగారు .జ్యోతుల నెహ్రు అద్వర్యం లో జరిగిన్ ఈ కార్యక్రమం లో జగన్ తో ఫోటో తీయుంచు కోవడానికి పోటి పడ్డారు .....
వీడియో చూడండి




31, జనవరి 2012, మంగళవారం

రాష్ట్రం లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ..లేక పోతే పెట్రోల్

మంత్రి గారు   చూడండి బావగారు ! మీ అబ్బాయి ఏమి కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను .ఏ జిల్లాలో ఏ ఫాక్టరీ  పెట్టుకుంటారో మీ ఇష్టం ..భూమి కూడా రప్పిస్తా
  వియ్యంకుడు   యేమి వద్దు కాని ...మీరు పైసా ఇవ్వనక్కర లేదు ..ఓ జీ ఓ పాస్ చేయించండి చాలు 
మంత్రి గారు ఏమిటి చెప్పండి ...గంటల లో వస్తుంది 
  వియ్యంకుడు  రాష్ట్రం లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ..లేక పోతే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయారు అని 

(రాంచి జిల్లాలో హెల్మెట్ లేక పోతే పెట్రోల్ పోయకుండా పోలీసులు హుకుం జారి చేసారట )

30, జనవరి 2012, సోమవారం

.స్కూల్స్ ఎందుకు బంద్ చేయాలి ?.అసలు చేస్తున్న ఆందోళనలకు ..విద్య సంస్థాలకు సంబంధం ఉందా


ఈ సంవత్సరం పండుగ వరకు  రాష్ట్రం ఎంతో సంతోషం గా ఉంది ...తర్వాతే అన్ని చికాకులు..మళ్లీ బందులు ప్రారంబం కావడం విచారకరం ....జరుగుతున్నా సంఘటనలకు నిరసనగా కొన్ని బందు లైతే ...తమ సమస్యలు తీర్చమని ..ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి కొన్ని వర్గాలు బలవంతపు బందులు చేయిస్తున్న్నై ...ముఖ్యంగా ఆయ ప్రాంతాలలో స్కూల్స్ ను కూడా మూయడం దారుణం .....అసలు చేస్తున్న ఆందోళనలకు ..విద్య సంస్థాలకు సంబంధం ఉందా ?ఏ సమస్య వచ్చిన ముందు స్కూల్స్ మూయించి వేయడం అలవాటుగా మారింది .సర్కార్ ఈ విషయంలో తగిన చట్టం చేస్తే కాని స్కూల్స్ బాగు పడవు 

27, జనవరి 2012, శుక్రవారం

ramcharan "rachcha" title song leak "రచ్చ ".... పాట లీక్ సైలెంట్ చూపులోడు .. వైలెంట్ చేతలోడు కరంట్ కల్లలోడు .

రామ్ చరణ్ కొత్త చిత్రం "రచ్చ "....సంగీత మణిశర్మ .ఆడియో రిలీజ్ కాలేదు .అయితే ఓ పాట లీక్ అయ్యింది . టైటిల్ సాంగ్ అది .ఫాస్ట్ బీట్ లో ఉండే ఈ పాట కావాలని లీక్ చేసారా ? దొంగ చాటుగా విడుదల అయిందా? అనుమానమే ..ఇదివరకు కొన్ని తెలుగు సాంగ్స్ ఆలాగే లీక్ అవుతున్నాయి .ఇదే ఒక పబ్లిసిటీ కావచ్చు .చెప్పలేం ..ఏది ఏమైనా చరణ్ అభిమానులకు మంచి ఊపున్న పాట గా ఉంది .



సైలెంట్ చూపులోడు ..
వైలెంట్ చేతలోడు 
కరంట్ కల్లలోడు ....
..వీడు  చిరుత .......
అడుగేస్తే ఆంద్ర నైజాం రచ్చ ....

విగ్రహాలు ఏమి చేసాయి ?

విగ్రహాలు ఏమి చేసాయి ?
దేశం కోసం తన నిస్వార్ద సేవలు అందించిన మహానుభావులను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మనం వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్మరించుకోవడం మన మంచి సాంప్రదాయం .అలాంటి మహనీయులలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకరు ...దేశం లో ప్రతి గ్రామం లోనూ అయన విగ్రహం ఉంటుంది ....అమల పురం లో కొందరు దుండగులు విగ్రహాని పాడు చెయ్యడం దారుణం ..దీనితో కోనసీమలో ఉద్రిక్తత ...మళ్లీ దవలేస్వరం లో .......తూర్పు గోదావరికే తలవంపు తెచ్చే సంఘటనలు ఇవి .....అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు ...ఎవరి మీదో కోపం విగ్రహాలపై చూపించడం దుసంప్రదాయం అవుతుంది .....ఇది ఏదో ఒక జాతికి ..కులానికి సంబదించినది కాదు .....మహనీయుల జ్ఞాపకాలను వీలుంటే కాపాడే ప్రయత్నం చెయ్యాలి తప్ప కూల దోయ్యరాదు.  విగ్రహాలను పాడు చేసే వారికి  క ఠినంగా శిక్ష వేయాలి 

26, జనవరి 2012, గురువారం

గణతంత్ర శుభాకాంక్షలు

తెలుగు 
బ్లాగర్స్ 
 అందరికి 
గణతంత్ర 
శుభాకాంక్షలు 

25, జనవరి 2012, బుధవారం

కుల గజ్జి చాటుకోవడం దారుణం

బురద రాజకీయాలు  మరింత రొచ్చులో దిగుతున్నాయి .ఇదివరకు చాటుమాటుగా కుల రాజకీయాలు నడిపే నేతలు నేడు మీడియా ముందు కు వచ్చి మరి తమ కుల గజ్జి చాటుకోవడం దారుణం .మా కులం వారికి అన్యాయం జరిగిందని కొందరు ....మా కులపోడికి ఇవ్వకపోతే ఖబడ్దార్ అని మరి కొందరు చిందులు వేయడం జరుగుతోంది ...ఇదే పరిస్తితి కొన సాగితే రాష్ట్రం రావనకాష్టమే.

.అభిమానులు ! మీరు కొట్టుకోవడం ఎందుకు ?







బాలయ్య ,చిరు ల మధ్య మాటల యుద్ధం ఫాన్స్ ను ఇబ్బంది పెడుతోంది .సినిమా పరంగా అభిమానులైన వారు నేడు రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తూ అలజడి  రేపుకుంటున్నారు.ఏ హీరో అభిమానులైన ఒకటి గుర్తు పెట్టుకోవాలి .సినిమా వేరు .రాజకీయం వేరు ...నిజంగా సినిమా లో మెగాస్టార్ క్రజ్ ను బట్టి చిరుకు బంపర్ మెజార్టీ రావాలి .కాని ఏమైంది ? చిరు మళ్లీ సినిమా తీస్తే చూడడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు ......అలాగే మిగతా హీరోల వ్యవహారం కూడా ......బావ ను సి ఏం ను చెయ్యడానికి బాలయ్య తన ఇమేజ్ వాడుకుంటున్నారు ...కాంగ్రెస్ లో చిరు తన అదృష్టాన్ని పరిశేలించు కుంటున్నారు ..కాబట్టి అభిమానులు రాజకీయం గా ఎవరి ఎత్తులు వాళ్ళవి అని తెల్సుకోండి 

23, జనవరి 2012, సోమవారం

."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు ""-అన్న పొలిటికల్ బాలయ్య

అనుకున్నట్టుగానే బాలయ్య చిరు ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ,,,బాలయ్య  యమ దూకుడు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు .."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు "" అంటూ వైజాగ్ లో సింహ లో మాదిరిగా పొలిటికల్ డైలాగ్స్ వదిలి పెట్టారు .....పరొక్షమ్ గా చిరు పైన "నన్ను బాలుడు " అన్నారు అంటూ విమర్శ చేసారు .దీనిపై తిరుపతి లో చిరు బాలయ్య మాటలకు స్పదిన్చావాల్సిన అవసరం లేదని సింగిల్ డైలాగ్ తో తెల్సేసారట ..అయితే కొందరు చిరు అభిమానులు మాత్రం బాలయ్య దిష్టి బొమ్మను తగలుబెట్టినట్లు వార్తలు వస్తున్నై ..అంటే మొత్తానికి బాలయ్య రాజకీయంగా అగ్గి భాగానే రాజేస్తున్నారు .....మరి తెలుగు తమ్ములు బాలయ్యను ఏ రకంగా అర్ధం చేసుకుంటారో వేచి చూడవలసిందే .

22, జనవరి 2012, ఆదివారం

చిరంజీవి ,బాలకృష్ణ ... సై సై -పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

నాడు సినిమా పరంగా పోటి పడ్డ ఆ ఇద్దరు నేడు రాజకీయంగా తలపడడానికి సిద్ద పడుతున్నారు .వాటే చిరంజీవి ,బాలకృష్ణ .....ఈ మధ్య వీరిద్దరి మధ్య రాజకీయ వైరి వ్యాక్యలకు తెర లేచింది ...మాటకు మాట అనే వేడి ఇంకా రాలేదు కాని రావడానికి అవకాశం ఉంది .తాజాగా ఈ రోజు చిరం జీవి పై పోటీ చెయ్యడానికి సిద్దమని బాలయ్య ప్రకటించారు ...అంటే చిరు పై సై అంటున్నారు ....వీరిద్దరూ ఎలాను పోటీ చేయారు కాని ...మాటల యుద్ధం మాత్రం త్వరలోనే వినే అవకాశం ఉంది ..వేచి చూద్దాం ....పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

పంది పదియేను పిల్లలు పెడుతుంది .....



19, జనవరి 2012, గురువారం

నిప్పు సినిమా లో ఎన్ టి వి లో వచ్చిన కొత్త సాంగ్

నిప్పు సినిమా లో ఎన్ టి వి లో వచ్చిన  కొత్త సాంగ్ 
niippu song

.ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల!


సినీ నిర్మాతల ప్రచార తీరు మారు తోంది .."దండుకున్న వాడికి దండుకున్నంత " అన్నట్టు ఎంత ప్రచారం చేస్తుకుంటే అంత లాభం అని ఏ విషయాన్ని వదలడం లేదు ..టి వి ఆన్ చేస్తే చాలు బుసినెస్ మెన్ "పూరి " తెగ దంచుతున్నారు ...వర్మను మించిపోయారు .తాజాగా "నిప్పు " సినిమా పాటల సందడి కనిపిస్తోంది ...ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల చేస్తున్నారు ...(పాట ముక్కలేనండి ..మొత్తం కాదు లెండి ) నిన్న టి వి నైన్,నేడు ఎన్ టి వి లో పాట విడుదల చేసారు ..ఆడియో ఫంక్షన్ వేరుగానే ఉంటుంది అట ..ఇదో రక మైన ప్రచారం ....రవి తేజ ఆంజనేయులు సినిమాలో చెప్పినట్టు ...ప్రచారాలు జోరేత్తుతున్న్నై. న్యూస్ చాన్నాళ్ళ కు సరిపడా న్యూస్ లేదు ...ఆదాయం కావలి ..కాబట్టి సినిమా కబుర్లతో నింపుతున్నారు .

18, జనవరి 2012, బుధవారం

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి .....పాపం సి ఎం కిరణ్ గారు మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చెయ్యాలని ఆశించారు .....అయితే అయన ఇష్టం కాదు కదా ,,ఢిల్లీ పెద్దల మాటే వేదం ......సహా లక్ష రాజకీయాలతో కాంగ్రెస్స్ అధిస్తానవర్గం తల మునకైలై ఉంది ఒక వైపు అయిదు రాష్ట్రాల ఎన్నికలు ..తెలంగాన వేడి ఉండనే ఉంది ..ఈ నేపధ్యం లో ఎందుకు వచ్చిన గొడవ ...కదిపితే కందిరీగ అనుకున్నటున్నారు....." మన ప్రభుత్వాన్ని కాపాడిన  చిరు పార్టీ లో ఆ ఇద్దరినీ తీసుకుని ..సరిపెట్టికోమని ...చక్కగా చేతులు దులుపు కున్నారు ......

17, జనవరి 2012, మంగళవారం

.సి ఎం గారు! సమన్వయము మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి

ఏ  రాష్ట్రం బాగుపడాలన్నా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే నేతలపై ఆధారపడి ఉంటుంది .ముఖ్యమంత్రి తో పాటు మంత్రూలు సమిష్టిగా పనిచేస్త్నే జనం భాగుపడతారు .అయితే ప్రస్తుతం ఎడ్డ మంటే తెడ్డు అన్నట్టు ..మంత్రివర్గం లో సమన్వయము లేదన్న విషయం అందరికి తెల్సు .సి ఏం తన మార్కు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఆ పార్టీ లోనే వ్యతి రేక వర్గం అడ్డు పడుతోంది ...తమ మాట సి ఏం వినడం లేదని వారి ఆరోపణ .ఇదిలా ఉండగా ....ఈ రోజు ఢిల్లీ కాంగ్రెస్స్ లో సి ఏం ,కిరణ్ ,బొత్స  ఇతఃరుఅలు  జరిపిన రాజకీయం తో .....రాష్ట్ర మంత్రి వర్గం విస్తరిచానున్నారు .మరి సి ఎం కు నచ్చిన వారు వస్తారో ,హై కమాండ్ వారి సిపార్సు వారు వస్తారో వేసి చూడాలి ..ఈ నెల లో జరిగే మంత్రివర్గం విస్తరణ తర్వాత అయిన కిరణ్ సర్కార్ మరింత మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం .

శ్రీ రావులమ్మ అమ్మవారి జాతర ఉత్సవం వైభవం గా



మెట్టసీమ ఆరాధ్య దేవత శ్రీ రావులమ్మ అమ్మవారి జాతర ఉత్సవం వైభవం గా జరిగింది.ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్దిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ కార్య క్రమానికి పెద్ద ఎత్తున భక్త్తులు వచ్చారు  

డప్పు విన్యాసం చూసారా ? ఇదిగో వీడియో

డప్పు విన్యాసం చూసారా ? ఇదిగో వీడియో dappu vinyaasam

16, జనవరి 2012, సోమవారం

అన్నవరం పుణ్య క్షేత్రం లో అద్భుత నీడ గడియారం చూడండి వీడియో

అన్నవరం పుణ్య క్షేత్రం లో అద్భుత నీడ గడియారం ఉంది .ఇంచుమించు కొద్ది నిమిషాల తేడ ఉన్న సమయం యెంత అయ్యింది తెల్సుకోవడానికి బావుంటుంది .పంతొమ్మిది వందల నలబై మూడు సంవత్సరం లో దీనిని నిర్మించారు .తరవాత ఏబై ఎనిమిది లో దీని మళ్లి నిర్మించారు .కొండ పై సత్యనారాయణ స్వామీ సన్నిది .చెంత  గోసాల పక్కన ఇది కనిపిస్తుంది annavaram sundail

వీర్యం కోసం ప్రకటనలా ?.ఇరవై వేలు ?

వీర్యం కోసం ప్రకటనలా ? అసలు దేశం లో విలువలు ఎమౌతున్నై ?
పిల్లలు పుట్టలేదు ...కాబట్టి కృత్రిమ గర్భాదారంతో బిడ్డను కందమనుకున్నారు ..తప్పు లేదు .కాని పుట్టే వాడు తెలివైన వాడు కావలి అనుకుని ...ఐ ఐ టి విద్యార్ది వీర్యం కావాలని ఓ జంట చెన్నై లో ప్రకటన చేసారు ......దాత కు ఓ ఇరవై వేలు ఇస్తారట .....ఈ ప్రకటన  చూసి ఆ విద్యార్దులు అయోమయానికి గురి చ చ అనుకున్నారట ....
అందంగా ఉండే ఓ సినిమా హీరొయిన్ ..అమోఘ తెలివితేటలూ గల అందవికారం గా ఉండే ఓ కవి తో .."మనం పెళ్లి చేసుకుందాం .నీ తెలివి ..నా అందం గల బిడ్డ పుడుతుంది " అనగానే అయిన "రివర్స్ అయితే " అన్నాడట ...............................
 అందం తెలివి తేటలు అన్నవి భగవంతుని సృష్టి ....అందరకి అన్ని అన్ని ఉంటాయి ...మన యొక్క కృషి ,పట్టుదల ను బట్టి తెలివి అబ్బుతుంది ..అంతే తప్ప కేవలం కనేయ్యడం వాళ్ళ కాదు .....
వీర్యం లాంటి అమ్మకాలు జరుగుతూ ఉంటె ...ఇంకా ఎవరు నేరుగా పిల్లలను కానరు ...ఆయా అమ్మకాల కేంద్రాల నుంచి కొన్నుక్కోవడమే .

15, జనవరి 2012, ఆదివారం

.కోడి కొసల కోసం గొడవలు

కోడిపందాలు జరుగుతున్నాయి .అధికారులు మొదట ఎలా చెప్పిన పండుగ రోజుల్లో  ఎవరు లెక్క చెయ్యారు.సాంప్రదాయ పద్దతి లో పందాలు జరపుకుంటే పెద్దగా పట్టించు కో నవసరం లేదు ..అది ఓ సరదా గా సరిపెట్టుకోవచ్చు ..కాని రాను రానూ ఇది పెద్ద జూదం ల తయారయ్యింది ..అశాంతి వాతావరణాన్ని ఏర్పడుతోంది .అందుకే ఆంక్షలు .....ప్రజా ప్రతినిదుల ఒత్తిడి కి తల్లోగ్గి పండుగ మూడురోజులు పోలీసులు చూసి చూడనట్టు వదిలెయ్యడం తో గోదావరి జిల్లా లో "కాయ్ రాజా కాయ్ " జోరుగా జరుగుతోంది .తెలంగాణా రాయలసీమ వాసులు తో పాటు విదేశీయులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు .కాగా పల్లె సీమల్లో నూ అదే జోరు ...పందాలకు కొదవ లేదు ..నాటు కూడా ఫుల్ల్గా గా దొరుకుతూ ఉండడం తో అక్కడక్కడ కూడా కొట్లాటలు కూడా జరుగుతున్నట్లు సమాచారం ...కోడి కొసల కోసం ఎక్కువక్గా గొడవలు జరగడం సర్వసాదారణ విషయం ..కొస యమ టే స్టీ గా ఉందాం తో ధర కూడా వేళల్లోనే పలుకుతుంది .

.సినిమా .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే సంక్రాంతి కి రెండు "బి "లు

ప్రేక్షకులను పంచుకున్న "బి *లు ......సంక్రాంతి అనే సరికి తెలుగు లో కనీసం అయిదారు సినిమాలు సందడి చేస్తాయి .అయితే నేడు ముఖ్య  హీరోల చిత్రాలు రెండే విడుదల అయ్యాయి ....అవి బిసినెస్ మెన్ మరియు బాడిగార్డ్...నిజానికి రెండు కూడా ఏవరేజ చిత్రాలే ......మరేవీ పోటి లేక పోవడం తో  కుర్రకారు ...మొదటి చితాన్ని ..మిగతా వారు రెండవ చిత్రాన్ని చూడక తప్పడం లేదు .....జాగర్త గా పరిశీలిస్తే ఓ విషయం అర్ధమవుతోంది ..
 నేడు ఏ సినిమా ku అయిన మొదటి మూడు రోజుల కలక్షనలే కీలకం ...
ఈ నేపధ్యం లో పండుగకు విడులవుతాయి అనుకున్న చాల చిత్రాలు వాయిదే వేసినట్టు అనుకోవచ్చు .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే  ఎవరు ఎవరికి పోటి రాకుండా జాగర్త పడుతున్నర్రు అన్న మాట .

చలి సంక్రాంతి .

చలి సంక్రాంతి ..నిజం గా ఇది చలి సంక్రాంతే.ఎన్నడు ఇంత చలి లేదు .భోగి మంట సంప్రదాయం ఎందుకు పెట్టారో ఇప్పుడు అందరికి అర్ధం అవుతోంది ..చలి కి ఎవ్వరు నిద్ర లేవడానికి ఇష్టపడరు ..అయితే పండుగ రోజున పెందల కాదనే నిద్ర లేవక తప్పదు.లేచిన తర్వాత చక్కగా భోగి మంట దగ్గర కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటోంది ..సంక్రాంతి రోజున అదే పరిస్తితి ...ఈ సంవత్సరం ముందుగ చలి లేకున్నా తర్వాత భాగ పెరిగింది ...అన్ని వసతులు గల వారికి పర్వ లేదు కాని దుప్పటి కూడా లేని పేద వాళ్లకు నరకమే ..ముఖ్యం గా వసతి గ్రుహాల్ల్లో ఉండే విద్యార్దులు చాల బాధ పడతారు .వీరి గురించి ఆలోచించాలి ప్రభుత్వం .. 

13, జనవరి 2012, శుక్రవారం

కథకు హీరో ఉంటేనా చాలా?....... బిసినెస్ మెన్ సినిమా చూస్తె అందరికి అర్ధం అవుతుంది .

కథకు హీరో ఉంటేనా చాలా?....... బిసినెస్ మెన్ సినిమా చూస్తె అందరికి అర్ధం అవుతుంది .అసలు విషయం ..నిజం గా ఈ సినిమా మహేష్ బాబు చేసాడు కాబట్టి సరిపోయింది గాని ...లేక పోతే ఊహించడం కష్టం ...నవ రసాలు ఉంటేనే ఏ సినిమా అయిన ప్రేక్షకుడు చూసేది ..దూకుడు ఆ రేంజ్ లోనే ఆడింది ....ముఖ్యం గా కామిడి సీన్స్ ఆ సినిమాలో ఎంతో బావున్నై .అన్ని రకాల సేడ్స్ ఉన్నాయ్ 
  కాని పూరి వారి తాజా సినిమా బిసినెస్ మెన్ లో కేవలం హీరో తో నే అన్ని చేయన్చారు .హాస్య నటులు అసలు లేరు ..ఆ లోపం పూర్తిగా కనిపించింది .మానవత్వం అన్న మాట పదే పదే పలికారు కాని ఎక్కడ అది కనిపించ లేదు ..మాపియా కథల కాపిల సిమేమా తీస్తే ఎలా ? సెక్స్ సీన్స్ కనపడకుండా తెరలు పెట్టిన ..బూతు డైలాగ్స్ కట్ అయిన ....బూతు మాటలు ఫుల్ గానే ఉండడం బాగా లేదు ....సరి అయిన కథ లేక పోతే ...ఆ సినిమా అంటే మరి ....

బిసినెస్ మెన్ ఎలా ఉంది

మహేష్ బాబు తాజా సినిమా బిసినెస్ మెన్  భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదల అయ్యింది .....దూకుడు తరవాత వచ్చిన ఈ సినిమా గురించి భారిగా ప్రచారం జరింగింది .
 సినిమాలో ఏమి నచ్చాయి ? 
మహేష్ నటన ....డైలాగ్స్ తూటాల కంటే  వేగం గా పేలాయి 
సాంగ్స్   బావున్నై ..ఊపు నిస్తాయి .....ఫైట్స్ మామూలే ..కాజల్ నటన బావుంది .


లేనిది 
 కథలో బలం లేదు .....అంత మహేష్ డైలాగ్స్ ...సస్పెన్సే లేమి..భారీ సెట్స్ ఏమి లేవు..పోకిరి తో పోల్చకూడదు   
 కథ 
 అమెరికా లో మంచి బిజినెస్ చేసి డబ్బు సంపాందించి ఇండియా కు సేవ చేద్దామని వచ్చిన ఓ ప్రవాస భారతీయుడు కొడుకు సూర్య ....రాజాకీయ నేత ను నమ్మి ..అతని మోసం తో సూర్య తల్లిదండులు ప్రాణాలు కోల్పోతారు ....ఆ నేత పై పగ తో రగిలే కుర్రోడు  సూర్య తన తెలివితేటలతో ముంబై కి దడ పుట్టిస్తాడు ....పోలీసు ఆఫీసర్ కూతురు చిత్ర (కాజల్ ) తో ప్రేమ నడుపుతాడు .......ఇంతకి సూర్య  ఆ నేతను ఏం చేసాడు ?....ఎలా అయ్యాడు అన్నదే కథ  ఎలా ఉంది 

12, జనవరి 2012, గురువారం

ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..

పి సి సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కు తనకు ఎటువంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు జనం చెప్పుకుంటున్నారు .అదంతా మీడియా సృష్టి అని సి ఏం గారే చెబుతున్నారు ..పోనీ అలా అనుకుంటే  ఒకటో ,రెండో పత్రికల్లో ..లేదా చానల్ లో రావాలి కాని ..మీడీయా మొత్తం మీద ఈ వార్తలు వచ్చాయి ...ఇద్దరి మాట ఎలా ఉన్న ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..బొత్స సత్యనారయణ సి ఏం కావడానికి ప్రయతిస్తున్నారని ....అందుకే గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్స్ ఉందని ...మరో పక్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ ,మెగా స్టార్ చిరు కూడా సి ఏం రేసులోనే ఉన్నారు ...కాంగ్రెస్స్ లో ఏదన్నా సాధ్యమే ..కాకపోతే ఏచిచూడాలి..

11, జనవరి 2012, బుధవారం

క్యాంపస్ ఇంటర్వ్యూ ల కు హాజారవుతున్నారా ? జాగర్త .

క్యాంపస్ ఇంటర్వ్యూ ల కు హాజారవుతున్నారా ? జాగర్త .  మీ దగ్గర డబ్బులు దండుకుని మిమ్మల్ని మోసం చేసే టోపీ గాళ్ళు  వస్తున్నారు .వీరిలో ఆడ కేడీలు కూడా ఉన్నారు .తూర్పులో ఇలాంటివారినే పోలీసులు పట్టుకున్నారు .పూర్తిగా చదువు లేకపోయినా ఆంగ్ల పరిజ్ఞానం సంపాదించిన భార్య భర్తలు  ఉన్నత చదువులు గాల వారికే టోపీ పెట్టేసారు .జిల్లాలో గల ఇంజనీరింగ్ వంటి ఉన్న్నత విద్య సంస్థలకు వచ్చి కాంపస్ ఇంటర్వ్యూలు పేరుతో కొత్త మొత్తాన్ని కట్టించుకోవడం ,నకిలీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వీళ్ళ పని ..డబ్బులు సమర్పించుకున్న వారిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయట ......అది సంగతి .....
       ఆయా విద్య సంస్థ ల వారు తమ సంస్థలలో చదివిన వారి కోసం ...వచ్చిన ప్రతి వారిని ఇంటర్వ్యూలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల్లె ఇలాంటివి జరుగుతున్నాయని  విద్యార్ధులు వాపోతున్నారు .ఇప్పనికైన కళ్ళు తెరచి ....మంచి పేరు గల సంస్థలను ....మోసం లేని వారినికి మాత్రమె అనుమతించి విద్యార్దులు జీవితాలు కాపాడవలసి ఉంది 

10, జనవరి 2012, మంగళవారం

తూరుపు లో ఆ నల్గురు ఏం ఎల్ ఏ లకు ఆశాభంగమే

ఆ నల్గురు ఎంతో ఆరాట పడ్డారు .కనీసం ఒకరికైనా మంత్రి యోగం దక్కుతుందని ..అయితే వారి ఆసలు ఆవిరి అయ్యాయి ...వారే ప్రజారాజ్యం ఏం ఎల్ ఏ లు  వంగా గీత ,బండారు సత్యానందం ,పంతం గండి మోహన్  మరియు కురసాల కన్నబాబు .చిరంజీవి కాంగ్రెస్స్ గూటిలో చేరిన నేపథ్యం లో తూర్పు లో ఎక్కవ గా ఉన్న నల్గురి లో ఒకర్కి మంత్రి పదవి ఖాయం అని ..పైగా ప్రస్తుత మంత్రి తోట నరసింహం పదవికి గండం అని వార్తలు వచ్చాయి .అయితే నేడు జరుగుతున్నా పరిణామాల ప్రకారం చిరు వర్గం నుంచి రామచంద్రయ్య ,గంటా శ్రినివాసులకే  మంత్రి పదవులు దక్కుతున్నాయని ..ఈ  నెల పంతోమిదోవ తేదిన ప్రమాణ స్వీకారం చేయ్యబోతునట్లు రూడీ అవుతోంది ..అంటే ఆ నల్గురి ఇక ఆశాభంగమే .

సంక్రాంతి మజా తూర్పు లోనే

తూర్పు నుంచి రాజధానికి మరో నాలుగు  రైల్స్ ప్రకటించడం ఆనందదాయకం .సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరబాద్ లో ఉన్న వేలాది మంది విధిగా స్వస్థలానికి వస్తారు .ముఖ్యంగా ఉబయగోదావరి జిల్లాలకు తాకిడి ఎక్కువ ..రాష్ట్రం లో ఎక్కడ లేని సరదా ఇక్కడే ఉంటుంది మరి .ఇంటి దగ్గర మహిళలు ,ఆరు బయట పురుషులు చేసే సందడి .....అల్లరి చూసి తీరవలసిందే పండుగ మజా చెయ్యాలి అంటే ఇక్కడ కు రావాల్సింది .చక్కని ప్రకృతి మధ్య ఏ  సాంప్రదాయ "పందాలు " చూడాలన్న ఇక్కడే సాధ్యం .ఎన్ని అడ్డంకులున్న కనీసం పండుగా మూడు రోజు లు ఎంజాయ్ చెయ్యవచ్చు ...(ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ..అనుమతులు పొందేసారు !).ఇక వెళ్ళడానికి ,రావడానికి రైల్స్, ఏ సి బస్సులు ఉండానే ఉన్నాయ్ 

6, జనవరి 2012, శుక్రవారం

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు ముగిస్సాయి .ఉదయం నుంచి అనేక మంది ప్రముఖులు ఆయన బౌతిక కాయని దర్శించి నివాళులు అర్పించారు .వై ఎస్ జగన్ ,జిల్లా మంత్రులు ,మూడు పార్టీల నేతలు ..వచ్చారు .మంత్రి తోట నరసింహం కాడి కూడా పట్టారు 

5, జనవరి 2012, గురువారం

తోట గోపాల కృష్ణ మృతి

తోట గోపాల కృష్ణ మృతి చెందారు .కాకినాడ ఎం.పి గా ,పెద్దాపురం ఎం ఎల్ ఏ గా ఆయన పనిచేసారు .తెలుగుదేశం లో ఎం పి ,కాంగ్రెస్స్ లో ఎం ఎల్ ఏ ..నేడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ లో ఉన్నారు ..ఆయన సభలో ఏమి మాట్లాడిన సరదాగా ఉంటుంది .ఏ విషయాన్నీ అయిన పిట్ట కతల లతో ముడి వేసి చెప్పి జనం తో చప్పట్లు కొట్టించు కోవడంలో ఆయనకు ఆయనే సాటి .గోపాల కృష్ణ మృతి పట్ల అన్ని పార్టీల నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు 

4, జనవరి 2012, బుధవారం

కంటి శిబిరం



జగ్గంపేట లయి న్ కంటి ఆసుపత్రి వారి అధ్వర్యంలో కంటి శిబిరం జరిగింది 

3, జనవరి 2012, మంగళవారం

గ్రామసభ




జగ్గంపేట ,గోవిందపుర గ్రామాల్లో ఏం పి డి ఓ నాతి బుజ్జి గ్రామసభ నిర్వహించారు .మధ్యాహాన బోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు 

1, జనవరి 2012, ఆదివారం

పోటా పోటీగా వేడుక చేసి .....

జగ్గంపేట లో నూతన సంవత్సర వేడుకలు చాల భారీగా జరిగాయి .రాజకీయ నేతలు పోటా పోటీగా వేడుక చేసి అభిమానులను అలరించారు .వీరవరం లో మంత్రి తోట నరసింహం ,ఇర్రిపాక లో జ్యోతుల నెహ్రు ,జగ్గంపేట లో జ్యోతుల చంటిబాబు సందడి చేసారు .నెహ్రు ,చంటి బాబు శిబిరాల్లో బోజనాల హడావడి భారీ స్తాయిలో కనిపించింది .మొత్తం మీద ముగ్గురు దగ్గరాకు జనం భారీగానే వచ్చారు