mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

22, మార్చి 2012, గురువారం

నెలకు పైగా నిల్వ .ఉండే ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి అంటే ఇష్ట పడిన వారు ఉండరు ..అయితే ఆయా ప్రాంతాలను బట్టి పచ్చడి ఉంటుంది .అమృతం లాంటి పచ్చడి చాల రోజులు వరకు కూడా నిల్వ చేసు కోవచ్చు.
పచ్చడి పల్చగా కాకుండా జెల్ మాదిరిగా చేసు కుంటే బావుంటుంది ....ఇది ఎలా చెయ్యాలి అంటే 
 కావలసినవి
 "బాగా ముగ్గిన కర్పూర అరటి పళ్ళు ఓ డజెన్.....కే జి బెల్లం ,పావు కే జి వేపిన సెనగ పప్పు ,ఓ మామిడి కాయ ,పావు కే జి చింతపండు  ,తగినంత వేపపువ్వు ,సాల్ట్ ,నెయ్యి ,కిస్మిస్ ...
తయారి విధానం  ఓ వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకుని ...ముందుగా సిద్దం చేసుకున్న చింతపండు గుజ్జును వేసి బాగా కలియబెట్టాలి .తర్వాత తరిగిన బెల్లంను వాసి అది నీటిలో మొత్తం కరిగేలా చూడాలి ...(అవసరాన్ని బట్టి కొంత నీరు చేర్చాలి ).అరటి పండు ను ఒక్కటిగా తీసుకుని దానిని బాగా పిసకాలి .పాత్రలో బెల్లం ,చింతపండు ,అరటిపళ్ళు మొత్తం ద్రవరూపం పొందాలి ...ఈ ద్రవ మిశ్రమం లో మామిడి ముక్కలు ,సేనగాపప్ప్కు ,కిస్మిస్స్,వేప పువ్వు ,సాల్ట్ ,వేసి మొత్తం కల్పి ...చివరగా కొద్దిగా నెయ్యి చేర్చాలి .......ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ ..ఇది బయట పదియేను రోజులు ,ప్రిజ్ లో అయితే నెలకు పైగా నిల్వ ఉంటుంది ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి