mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

31, అక్టోబర్ 2011, సోమవారం

ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే - తోట నరసింహం

రెండవ తేదిన జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే నని మంత్రి తోట నరసింహం తన పార్టీ వారికి నొక్కి చెప్పారు .ఈరోజు జగ్గంపేట లో కాంగ్రెస్స్ కార్యకర్తల మీటింగ్ ప్రత్యేకంగా జరిపారు .ముఖ్యమైన నేతలు హాజరయ్యారు .సి ఎం సభ నియోజవర స్థాయి లోనే జరుగుతున్నా ....జన సమీకరణ భారీగా ఉండాలని ....నియోజవర్గానికి పేరు వచ్చే విధంగా ప్రజలను తీసుకు రావాలని అన్నారు .వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు .కార్య క్రమంలో నేతలు కోర్పు లచ్చయ్య దొర ,అడబాల కుందరాజు, బండారు రాజ ,వత్సవాయి రాజు ,మూర్తి అయ్యన్న ,పైడియ్య,ప్రబృతులు పాల్గున్నారు .తదుపరి ఆయన సి ఎం సభ జరిగే ప్రాంగణాన్ని కలక్టర్ ,ఎస్ పి కల్సి సదర్సించారు .

30, అక్టోబర్ 2011, ఆదివారం

జిల్లా కలక్టర్ ఆకస్మికం గా వసతి గృహాలను తనిఖి


జగ్గంపేట్ వచ్చిన జిల్లా కలక్టర్ ఆకస్మికం గా వసతి గృహాలను తనిఖి చేసారు .స్పెషల్ హాస్టల్ ,గరల్స్ హాస్టల్ ను 
పరిశీలించారు .విద్యార్దు లతో  మాట్లాడి విషయాలు తెల్సుకున్నారు .బుక్స్ ,ఇతర పుస్తకాలు ,సామగ్రి ఇచ్చారో లేదో అని అడిగారు .

సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభ కోసం స్థలం ఎంపిక


సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభ కోసం స్థలం ఎంపిక జరిగింది .గతంలో సోనియా సభ ,జగన్-జ్యోతుల సభ జరిగిన ప్రాంతాన్ని ఎన్నుకున్నారు .ఆదివారం జిల్లా కలక్టర్ రవిచంద్ర తో పాటు పలువురు అధికారులు ,పోలీసు వారి ఆ స్తాలాని పరిశీలించారు  వీడియో

మెట్టసీమ ముచ్చట్లు: జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి -వీడియో ravulammatalli jaggampeta video

మెట్టసీమ ముచ్చట్లు: జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి -వీడియో ravulammatalli jaggampeta video

జగ్గంపేట లో అయ్యప్ప పడిపూజ video

cm tour at jaggampeta on nov 2ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు

ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు ప్రారంబమైంది .వచ్చే నెల రెండవ తేదిన సి ఏం కిరణ్ కుమార్ జగ్గంపేట వస్తున్నారు .రూపాయి కిలో పథకాన్ని జిల్లాలో ఇక్కడనుంచే ప్రారంబిస్తారు .సభ జరిగే ప్రదేశం గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు .ఆదివారం సెలవు దినం  మరియు నాగుల చవితి అయినప్పటికీ జిల్లా,పెద్దాపురం డివిజన్ ,మండల అధికారులు ఉదయమే జగ్గంపేట వచ్చి స్తలాలు పరిశీలించారు .ఇదివరకు సోనియా సభ జరిగిన  ఆదిత్య ఆసుపత్రి ప్రక్క స్తలాని ఎంపిక చేసారు .హెలీ పాడ్ కూడా ఆ పక్కనే నిర్మిస్తారు .

29, అక్టోబర్ 2011, శనివారం

జగ్గంపేట లో అయ్యప్ప పడిపూజ




జగ్గంపేట లో శనివారం అయ్యప్ప పడిపూజ ,పెడతుల్లు ఘనంగా జరిగాయి .మావిళ్ళపల్లి కృష్ణ ,కుమారుడు అయ్యప్ప ఆధ్వర్యం లో వారి ఇంటి దగ్గర నిర్వహించారు .పరిసర గ్రామాలనుంచి అయ్యప్ప భక్త్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేసారు .పద్దేన్మిది మెట్లు ...అరటి బోదె లతో అందమైన మండపం నిర్మించి ...శబరిమలై లో చేసినట్టు రకరకాలా పూజలు అభిషేకాలు చేసారు .అయ్యప్పలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది .

వెంకట లక్ష్మి మృతికి .సంతాపం

జగ్గంపేట ఏం ఈ  ఓ వెంకట లక్ష్మి మృతికి పలువురు తమ సంతాపాన్ని తెలిపారు .కొందరు రాజమండ్రి వెళ్లి బౌతిక కాయని సందర్శించి వచ్చారు .ఏం డి ఓ నాతి బుజ్జి ,ఎక్ష్ ఏం పి పి మారిసెట్టి పాపరత్నం భద్రం ,యూ టి ఎఫ్ నాయకులు వెళ్ళిన వారిలో ఉన్నారు .కాగ శుక్రవారం జగ్గంపేట లో సంతాప సభ జరిగింది .ఈ సందర్బంగా ఆమె సేవలను పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు 

గండేపల్లి లో పౌర కేంద్రం

గండేపల్లి లో పౌర కేంద్రాన్ని మంత్రి తోట నరసింహం పారంబించారు .పదియేను రకాల సేవలు అందించే దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు .కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ .ఎం పి డి ఓ మురళీధర్ ,వరలక్ష్మి పాల్గున్నారు .

27, అక్టోబర్ 2011, గురువారం

jaggampeta meo dead మండల విద్య శాఖాధికారి వి .వెంకట లక్ష్మిమృతి

మండల విద్య శాఖాధికారి  వి .వెంకట లక్ష్మి గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు .గత మూడు నెలలుగా ఆమె కాన్సర్ వ్యాధి తో భాద పడుతున్నారు .ఆరేళ్ళుగా ఆమె జగ్గంపేట మండలం లోనే పని చేస్తునారు .ఆమెకు భర్త ,ఇద్దరు పిల్లలు .ఏ ఈ ఓ మృతి కి సంతాప సూచకంగా శుక్రవారం మండలం లోని ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూల్స్ మూత పడుతున్నాయి .

meo office visit by p.o విద్యా శాఖాధికారి వారి కార్యాలయాని తనిఖిచేసిన రాజీవ్ విద్యా మిషన్ జిల్లా పీ ఓ రమేష్




రాజీవ్ విద్యా మిషన్ జిల్లా పీ ఓ  రమేష్ ఈ రోజు సాయత్రం జగ్గంపేట లోనే విద్యా శాఖాధికారి వారి కార్యాలయాని  తనిఖి చేసారు .విలేకర్లతో అయన మాట్లాడుతూ రెండో విడత గా మండలం లో బడి చినారుల దుస్తులు పంపిణి చెయ్యాలని ....గోడౌన్ లో సరుకు ఉందని చెప్పారు .వాలంటీర్ల జీతాలు విడుదల చేస్తున మన్నారు .ఏం ఈ ఓ పోస్ట్ పై నిర్ణయం జరుగుతోందని చెప్పారు . 

కాట్రావులపల్లి లో ఐ కాంప్



లయన్స్ కోడూరి రంగారావు కంటి ఆసుపత్రి వారి అద్వర్యం లో ఈ రోజు కాట్రావులపల్లి లో ఐ కాంప్ నిర్వహించారు .

narendra patnam villegers problam నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న

నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మురారు రవికుమార్ విమర్శింశారు.విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎస్ సి పేట లో గత రెండు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదని  అలాగే దళితులు ఇంకా అనేక సమస్యలతో సతమత మవుతున్నారని చెప్పారు .గ్రామానికి బస్ సౌకర్యం లేదని ...వన్ జీరో ఎయిట్ వాహనం రావడం లేదన్నారు .

23, అక్టోబర్ 2011, ఆదివారం

compter teachers to be attack కంప్యూటర్ టీచర్స్ నిరసన తీవ్ర తరం



కంప్యూటర్ టీచర్స్ తమ నిరసన తీవ్ర తరం చేస్తున్నారు .నేత ల పై ఒత్తిడి తేవడానికి సిద్దమయ్యారు .ఈ నెల ఇరవై నాలుగు ,ఇరవై తేదిలలో మంత్రి ఇంటిని ముట్టడించడం ,ఇరవై ఏడు నుంచి హైదరాబాద్ లో రిలే దీక్ష లు ..ముప్పై ఒకటిన చలో అసెంబ్లీ చేయ్యనున్నట్లు సంఘ నేత పడాల బాలాజీ ,రాంపండు చెప్పారు 

22, అక్టోబర్ 2011, శనివారం

eye camp at svn techno shcool శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులకు ఉచితంగా కంటి పరీక్షలు

కోడూరి రంగ రావు జిల్లా లయన్స్  కంటి ఆసుపత్రి జగ్గంపేట వారి అధ్వర్యంలో  శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులకు ఉచితంగా కంటి పరీక్షలు జరిపారు .కొత్త కొండ బాబు ,రాంబాబు సార్, డాక్టర్ బషీర్ ప్రబృతులు పాల్గున్నారు 

computer teachers begging at jpt భిక్షాటన

ముప్పై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న కంప్యూటర్ టీచర్స్ శుక్రవారం భిక్షాటన చేసారు .తమ సమస్యలు పరిష్కారం అయేవరకు తమ పోరాటం ఆపమని పడాల బాలాజీ ,రాంపండు చెప్పారు 

21, అక్టోబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లోఅమరవీరుల సంస్మరణ దినోత్సవం








అమరవీరుల సంస్మరణ దినోత్సవం జగ్గంపేట లో ఘనం గా నిర్వహించారు .సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో జగ్గంపేట కు చెందిన పలు  స్కూల్స్ చిన్నార్లు,పెద్దలు  అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేస్తూ భారి ర్యాలి లో పోల్గున్నారు .కాగా సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో విద్యార్దులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు 

19, అక్టోబర్ 2011, బుధవారం



జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది .చైర్మన్ గా అడబాల కుండరాజు ,పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేసారు .మంత్రి తోట నరసింహం ముఖ్య అదితి గా హాజరయ్యారు .జిల్లా కు చెందినా పలువురు ప్రజా ప్రతినిదులు ,కాంగ్రెస్ నేతలు ,జగ్గంపేట నియోజవర్గ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు .తులా కామ్ప్లెక్ష్ నందు ఈ సందడి జరిగింది

16, అక్టోబర్ 2011, ఆదివారం

కంప్యూటర్ టీచర్లు కు అఖిల పక్ష నేతల మద్దతు


నెల రోజుఅల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించు కోక పోవడం పై కంప్యూటర్ టీచర్లు మంది పడుతున్నారు .ఎన్నో విధాలుగా ఆందోళన చేస్తున్న వారు అఖిల పక్ష నేతల మద్దతు తో ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు సంఘ నేత పడాల బాలాజీ తెలిపారు .

రావులమ్మ తల్లి దగ్గరసింహ ద్వారం ఏర్పాటు-మంత్రి తోట నరసంహం


మంత్రి తోట నరసంహం ఆదివారం జగ్గంపేట లోని రావులమ్మ తల్లి ని దర్శించుకున్నారు .పూజలు చేసారు . సందర్బం గా ఆయన మాట్లాడుతూ రావులమ్మ తల్లి అంటే ఎంతో తనకు నమ్మకమని రెండువేల నాలుగు ఎన్నికల దగ్గర్నుంచి తానూ ముందుగా రావులమ్మ తల్లి ఆశీస్సులు అందుకుని ప్రచారం మొదలు పెట్టడం ఆనవాయితి అని చెప్పారు .తల్లి దగ్గర సరి కొత్త శోభ కనిపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేసారు .త్వరలోనే రోడ్ వేస్తారని ....ఆలాగే తన వంతు గా రోడ్ దగ్గర సింహ ద్వారం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు

14, అక్టోబర్ 2011, శుక్రవారం

వాకర్స్ హెల్త్ క్లబ్ చే పేదలకు దుప్పట్లు jaggampeta walkers club service camp



జగ్గంపేట వాకర్స్ హెల్త్ క్లబ్ పదవ సంవత్సరం లోకి అడుగిడుతున్న సందర్భంగా కాట్రావులపల్లి గ్రామంలో లెప్రచి కాలని వాసులు నలబై అయిదు మందికి దుప్పట్లు ,పండ్లు ,బిస్కట్స్ అందించారు ,ముఖ్య అతిధి జగ్గంపేట సి మాట్లాడుతూ పేదలకు సేవ కొత్త కొండ బాబు ను ప్రశంసించారు .కార్యక్రమమ లో వాకర్స్ క్లబ్ సభ్యలు పాల్గున్నారు

13, అక్టోబర్ 2011, గురువారం

world health day at jaggampeta జగ్గంపేట లో దృష్టి దినోత్సవం

దృష్టి దినోత్సవం సందర్భంగా జగ్గంపేట లోని లయన్స్ కోడూరి రంగారావ్ జిల్లా కంటి ఆసుపత్రి నందు పళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు .కొత్తగా కొనుగోలు చేసిన కంటి యంత్రాన్ని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయకుమార్ .కొత్త కొండ బాబు విరాళంగా ఇచ్చ్సిన శీతల యంత్రం ను గవర్నర్ డి వి ఎస్ రాజు (రమేష్ ) ప్రారంబించారు . రోజు చాల మందికి పరీక్షలు జరిపి ఉచితం గా మందులు ఇచ్చారు .కార్యక్రమం లో కొండబాబు ,డాక్టర్ భషీర్ లయన్స్ సభ్యులు పాల్గున్నారు .

తెలుగుదేశం జన చైతన్య యాత్రలు


జగ్గంపేట నియోజవర్గం లో తెలుగుదేశం జన చైతన్య యాత్రలు గురువారం నుంచి పారంబంయ్యాయి .నియోజవర్గ ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు స్వగ్రాం ఇర్రిపాక లో ప్రారంబించారు .కార్యకర్తల ఉత్సాహం మధ్య పార్టి జండా ఎగురవేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు .వీధ్య్ల్లో పర్యటించారు .ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ వల్లే ప్రజలకు కస్టాలు వచ్చాయన్నారు .ధరలు పెరిగి సామాన్యుడు చితికి పోతున్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు .కాంగ్రెస్ విష వృక్ష కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమం లో నేతలు ఎస్ వి ఎస్ అప్పల రాజు ,కందుల కొండయ్య దొర ,అల్లువిజయ్ కుమార్ ,పోతుల మోహన్ కుమార్ ,దొడ్డ విజయ భాస్కర్ ,నిమ్మగడ్డ సత్యనారాయణ జోగారావు కట్టమూరి బంగారం ,కార్యకర్తలు పాల్గున్నారు

తెలుగుదేశం జన చైతన్య యాత్రలు

జగ్గంపేట నియోజవర్గం లో తెలుగుదేశం జన చైతన్య యాత్రలు గురువారం నుంచి పారంబంయ్యాయి .నియోజవర్గ ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు స్వగ్రాం ఇర్రిపాక లో ప్రారంబించారు .కార్యకర్తల ఉత్సాహం మధ్య పార్టి జండా ఎగురవేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు . సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ వల్లే ప్రజలకు కస్టాలు వచ్చాయన్నారు .ధరలు పెరిగి సామాన్యుడు చితికి పోతున్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు .కాంగ్రెస్ విష వృక్ష కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు

11, అక్టోబర్ 2011, మంగళవారం

అన్నదాతలతో వానదేవుడు ఆటలాడుకుంటున్నాడు.

అన్నదాతలతో వానదేవుడు ఆటలాడుకుంటున్నాడు.పంట వేసిన తర్వాత మెట్టసీమ లో ఎక్కడ జడివాన లేదు .దీంతో వర్శదారంగా వేసే పంటలతో పాటు ..కరంట్ కష్టాలు గల బోర్ల దగ్గర పంటలు ఎండుతున్నై .ఇప్పుడైనా కాస్త వర్షం పడితే కొద్ది గా అయిన పంట చేస్తికి వస్తుందని కర్షకులు ఎదురు చూస్తున్నారు .గత రెండు రోజులుగా ఆకశం లో మబ్బులు చూసి అన్నదాత ఆనందం పడే లోపే అది ఆవిరి అవుతోంది ......చిన్న పాటి జల్లులు తప్ప వర్షం లేదు ... గంట లో నైన వాన దేవుడు కరుణించక పోతాడా అన్న గంపెడాశతో ఎదురుచూస్తున్నాడు

పి.నాయకంపల్లి లో పిడుగు

గండేపల్లి మండలం పి.నాయకంపల్లి గ్రామమలో పిడుగు పడింది .అయితే ఎవ్వరికీ ప్రమాదం వాటిల్లలేదు .గ్రామం లోని సీతారామ ఆలయం గోపురం పై సోమవారం మధ్యానం పిడుగు పడింది . సమయంలో సుమారు పదియేను మంది అయ్యప్ప స్వామీ భక్త్తులు ఆలయం లో ఉన్నారు .పక్కనే ఉన్న స్కూల్లో విద్యార్దులు మధ్య్హాన్ భోజనం చేస్తునారు .పిడుగు పాటుకు అందరు ఉలిక్కి పడ్డారు .అయితే అదృష్టవ శాత్తు ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు .

10, అక్టోబర్ 2011, సోమవారం

ఎన్నాళ్ళ కు గుర్తోచ్చమే వాన !

ఎన్నాళ్ళ కు గుర్తోచ్చమే వాన ! అంటూ ...ఈరోజు వర్షం కురిసింది .చిటపట చినుకులతో కాస్త సాయత్రం సందడి చేసింది .వాతావరణం కాస్త కూల్ అయిన ...పంటలకు ఉపయోగే పడే విధంగా తగిన కనీస వర్షం కురియలేదు .ఇప్పటికే పలు పంటలు ఎండి పోతున్నాయి .మంచి వర్షం కురితే పైరు మేలు జరుగుతుంది .

9, అక్టోబర్ 2011, ఆదివారం

jakkampudi with jaggampeta జక్కంపూడి రామ్మోహన్ రావు కు జగ్గంపేట కు ఎంతో అనుభందం ఉంది





జక్కంపూడి రామ్మోహన్ రావు కు జగ్గంపేట కు ఎంతో అనుభందం ఉంది .కాంగ్రెస్స్ పార్టి రథ సారధి గా జక్కంపూడి జగ్గంపేట లో అనేక కార్య క్రమాల్లో పాల్గొన్నారు ...నియోజవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మనో ధ్యరయం అందించేవారు .ముఖ్యంగా డి సి సి జిల్లా నేత గా ,తెలుగు దేశం హయాంలో గట్టి ప్రతి పక్షం గా పనిచేసారు .అప్పటి జిల్లా టి డి పి అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు తో పలుమార్లు రాజకీయం గా డీ కున్నారు .తోట వెంకట చలం ఆకష్మిక మృతి సమయంలో ఆయన చాల సమయస్పూర్తి గా మెలిగి కుటుంబానికి న్యాయం చేసారు .చలం చనిపోయిన వెంటనే అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్ చలం కుటుంబానికి ఇప్పిస్తానని మాట ఇచ్చి ప్రకారం తమ్ముడు తోట నరసింహం కు సీటు ఇప్పించారు .కాగ ఆయన కుటుంబం నేడు వై ఎస్ ఆర్ పార్టి లో ఉంది .ఆయన మృతి కి అటు మంత్రి తోట నరసింహం ,ఇటు జ్యోతుల నెహ్రు తో పాటు అన్ని పార్టీల నేతలు అభిమానులు తమ సంతాపాన్ని తెలిపారు

వికలాంగుల మండల సమైక్యలు ఏవి ?

వికలాంగులను ఇందిరా క్రాంత పథం ( కే పి) లో చేర్చమని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు వికలాంగుల మండల సమైక్యలు ఏర్పాటు చెయ్యలేదని మథర్ థెరిస్సా మండల వికలాంగుల సమైక్య విమర్శిసింది .అప్పన పెదకాపు అధ్యక్షతన జగ్గంపేటలో ఆదివారం జరిగిన సమావేశం లో వారు మాట్లాడుతూ విషయం గూర్చి గ్రీవెన్ సేల్స్ కు రెండు సార్లు ,మంత్రి గార్కి విన్నవించామని వాపోయారు

జగ్గంపేట మెట్టసీమ: "దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో

వంద రోజుల వేడుక కాకినాడలో: మహేష్ బాబు లేటెస్ట్ హిట్ మూవీ " దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో జరగనుంది ..

కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న


కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించు కాకపోవడం శోచనీయం .న్యాయమైన తమ డిమాండ్స్ తీర్చమని వారు సమ్మె చేస్తునారు .రోజుకో నిరశన చొప్పున ప్రతీ రోజు టెంట్ వేసుకుని ఉదయం నుంచి సాయత్రం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు .కళ్ళ కు గంతలు కట్టుకోవడం ..మహనీయుల విగ్రహాలకు పాలాభిషేకం ..వినతిపత్రాలు ఇవ్వడం ...పచ్చిరొట్ట తినడం ...మోకాళ్ళు వేయడం ....దున్నపోతు కు వినతి పత్రం ..దిష్టిబొమ్మ దగ్దం ...సి ఏం కు ఉత్తరాలు రాయడం ....ఇలా ఎన్నో రకాల నిరసన కార్య క్రమామలు చేస్తూనే ఉన్నారు .ఆదివారం జగ్గంపేట జాతీయరవదారి పై రాస్తా రోకో చేసి తమ నిరసన్ తెలిపారు .....ఉపాధ్యాయ ,ఉద్యోగ సంఘాలు ....తో పాటు సి టి యూ అద్వర్యం లో ఎన్నోసంఘాలు వీరికి మద్దతు గా నిలిచాయి .జగ్గంపేట నియోజవర్గ కంప్యూటర్ టీచర్స్ సంఘం అధ్యక్షుడు పడాల బాలాజీ అద్వర్యం లో కార్య క్రమలూ జరుగుతున్నాయి .సోమవారం నుంచి మరో వైపు స్కూల్స్ తెరుస్తునారు .హైస్కూల్స్ లో కంప్యూటర్ విద్యకు విఘాతం కల్గుతుంది .పైగా విద్యార్ధి ప్రతి సమాచారం కంప్యూటర్ ద్వారానే అధికార్లులు అడుగుతున్నారు .త్వరగా వీరి సమస్య పరిష్కారం చేస్తే అందరికి మంచిది .

7, అక్టోబర్ 2011, శుక్రవారం

మల్లిసాల లో ఉచిత కంటి వైద్య శిబిరం


జగ్గంపేట మండలం మల్లిసాల లో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది .జిల్లా లయన్స్ కంటి ఆసుపత్రి ,జగ్గంపేట వారి అద్వర్యం లో నూట ఇరవై మందికి వైద్య పరీక్షలు చేసారు .తెల్ల కార్డు గల ఇరవై మందికి ఉచిత ఆపరేషన్లు చేయడానికి నిర్ణయించారు .చైర్మన్ కొత్త కొండబాబు ,డాక్టర్ బషీర్ ప్రబృతులు కార్యక్రమం లో పోల్గున్నారు .

ఎన్ టి ఆర్ దూకుడు లేని ఊసరవల్లి

ఎంతో భారి అంచనాలతో విడుదలైన ఊసరవల్లి ఎన్ టి ఆర్ అభిమానులకు ఆశినంత సంతోషాన్ని ఇవ్వలేకపోయింది సినిమాకు మిశ్రం స్పంద వస్తోంది .ఓపెనింగ్ రోజున మాత్రం రికార్డ్ కలక్షన్ రావడం కాస్త ఊరట .ప్రస్త్తుతం దీనిని యీవరాజ్ సినిమాగానే చూడవచ్చు .బృందావనం కంటే భిన్నంగా ఎన్ టి ఆర్ కొత్త కోణం లో సినిమా నుంచి బయట బడే ఆలోచన చేస్తున్న ..మాస్స్ ఇమేజ్ ఉన్న ఈ హీరో అంత తొండగా బయట పడ లేరని చెప్పవచ్చు .
ఊసరవల్లి కథ
లో కొంతవరకు బలం ఉన్న దర్శకుడు సురేంద్ర రెడ్డి స్క్రిప్ట్ లో పాటు కోల్పోయాడు .ఎన్ టి ఆర్ ఎనర్జీ నీ సరిగా ఉపయోగించు కోలేక పోయాడు .ముఖ్యం గా కామిడి ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో లేదు . సినిమాలో దేవిశ్రీ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమె .హీరొయిన్ పాత్ర కు మంచి ప్రాధాన్యత ఇవ్వడం బాగానే ఉంది .అయితే ఎన్ టి ఆర్ తమన్నా మధ్య కెమిస్ట్రి కుదరలేదు . ఎన్ టి ఆర్ ఒళ్ళు చేసినట్టు స్పష్టం గా కనిపిస్తున్న ...రచయత కొరటాల రవి "సన్నగా కరంటు తీగలా ఉన్నానని ..." వంటి డైలాగ్స్ రాయడం ఎబ్బెట్టుగా ఉంది .(ఈ మధ్య ఎన్ టి ఆర్ కు పెళ్లి అయింది కదా ?) జయ ప్రకాష్ రెడ్డి బృందం ఎన్ టి ఆర్ మధ్య హాస్య సనివేశాలు పెద్దగా పండ లేదు .కాగ ఎన్ టి ఆర్ డాన్సు ,పైట్స్ బావున్నై .తమన్నా నటన బావుంది .
కథ " ముంబై లో టోని(ఎన్ టి ఆర్ ) చిల్లర దొంగ ...పైసలు ఇస్తే ఎవరినైనా కొడతాడు ..ఎవరికి అర్ధం కాదు .ఊసర వల్లి లా రంగులు మారుస్తాడు .తన తండ్రి మరనిచేతప్పు మంచి పని చెయ్యాలని తలుస్తాడు . నేపధ్యం లో నీహారిక (హీరొయిన్ )కష్టాల్లో కనిపిస్తుంది .ఆమెకు ఇచ్చ్సిన మాట కోసం ఏకం గా మాఫియ డాన్ అజ్జునే ఎదిరించి పోరాడతాడు ....కథకు ముందు ..టోని... నీహారిక కల్సుకోవడం ...ప్రేమ ..విలన్ లను చంపడం అంత విచిత్రంగా ఉంటుంది