mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

7, అక్టోబర్ 2011, శుక్రవారం

ఎన్ టి ఆర్ దూకుడు లేని ఊసరవల్లి

ఎంతో భారి అంచనాలతో విడుదలైన ఊసరవల్లి ఎన్ టి ఆర్ అభిమానులకు ఆశినంత సంతోషాన్ని ఇవ్వలేకపోయింది సినిమాకు మిశ్రం స్పంద వస్తోంది .ఓపెనింగ్ రోజున మాత్రం రికార్డ్ కలక్షన్ రావడం కాస్త ఊరట .ప్రస్త్తుతం దీనిని యీవరాజ్ సినిమాగానే చూడవచ్చు .బృందావనం కంటే భిన్నంగా ఎన్ టి ఆర్ కొత్త కోణం లో సినిమా నుంచి బయట బడే ఆలోచన చేస్తున్న ..మాస్స్ ఇమేజ్ ఉన్న ఈ హీరో అంత తొండగా బయట పడ లేరని చెప్పవచ్చు .
ఊసరవల్లి కథ
లో కొంతవరకు బలం ఉన్న దర్శకుడు సురేంద్ర రెడ్డి స్క్రిప్ట్ లో పాటు కోల్పోయాడు .ఎన్ టి ఆర్ ఎనర్జీ నీ సరిగా ఉపయోగించు కోలేక పోయాడు .ముఖ్యం గా కామిడి ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో లేదు . సినిమాలో దేవిశ్రీ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమె .హీరొయిన్ పాత్ర కు మంచి ప్రాధాన్యత ఇవ్వడం బాగానే ఉంది .అయితే ఎన్ టి ఆర్ తమన్నా మధ్య కెమిస్ట్రి కుదరలేదు . ఎన్ టి ఆర్ ఒళ్ళు చేసినట్టు స్పష్టం గా కనిపిస్తున్న ...రచయత కొరటాల రవి "సన్నగా కరంటు తీగలా ఉన్నానని ..." వంటి డైలాగ్స్ రాయడం ఎబ్బెట్టుగా ఉంది .(ఈ మధ్య ఎన్ టి ఆర్ కు పెళ్లి అయింది కదా ?) జయ ప్రకాష్ రెడ్డి బృందం ఎన్ టి ఆర్ మధ్య హాస్య సనివేశాలు పెద్దగా పండ లేదు .కాగ ఎన్ టి ఆర్ డాన్సు ,పైట్స్ బావున్నై .తమన్నా నటన బావుంది .
కథ " ముంబై లో టోని(ఎన్ టి ఆర్ ) చిల్లర దొంగ ...పైసలు ఇస్తే ఎవరినైనా కొడతాడు ..ఎవరికి అర్ధం కాదు .ఊసర వల్లి లా రంగులు మారుస్తాడు .తన తండ్రి మరనిచేతప్పు మంచి పని చెయ్యాలని తలుస్తాడు . నేపధ్యం లో నీహారిక (హీరొయిన్ )కష్టాల్లో కనిపిస్తుంది .ఆమెకు ఇచ్చ్సిన మాట కోసం ఏకం గా మాఫియ డాన్ అజ్జునే ఎదిరించి పోరాడతాడు ....కథకు ముందు ..టోని... నీహారిక కల్సుకోవడం ...ప్రేమ ..విలన్ లను చంపడం అంత విచిత్రంగా ఉంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి