mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

18, ఏప్రిల్ 2012, బుధవారం

రవికి చిచ్చుపెట్టిన చిరు టిఫిన్ ?

చిరు ఇంటికే ఎందుకు వెళ్లావు రవి ?
పాపం పార్టిని చక్క దిద్దుదామని వచ్చిన వాయిలాల రవి కే నేతల నుంచి నిరసన ఎదురవుతోంది ..కొత్త గా రాజ్య సభ్యుడైన చిరంజీవి ఇంటికి టిఫిన్ కి వెళ్ళడమే రవి చేసిన తప్పట ......పార్టీ అధికార ప్రతినిదిగా వచ్చిన రవి హోటల్ లో ఉండాలి ...అవసరం అయిన వారిని పిలిపించుకోవాలి గాని ఈయన వెళ్ళడం ఏమిటి అని "రవి కి తలంటు పోస్తున్నారు.. .
."ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి " అని వారి  అర్ధమా ?

17, ఏప్రిల్ 2012, మంగళవారం

గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాస రావు పాడిన పాట..-డియ్యాలో డియ్యాలో తర్వాత మళ్లి కెవ్వు కేక

మందు బాబులం మేము మందు బాబులం .
.మందు కొడితే మేము మహారాజులం ...
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గబ్బర్ సింగ్  లో కోట శ్రీనివాస రావు పాడిన పాట ఇది .
వయసు మీద పాడిన కోట గళం భలే తమాషా గా ఉంది .
గబ్బర్ సింగ్ లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయ్ .
దేకో దేకో గబ్బర్ సింగ్ ...అనే పాటను బాబా సెహగల్  ఉషారుగా గానం చేసారు 
పిల్ల   అనే పాట కూడా ఫాస్ట్ గా బావుంది .
మమత శర్మ గానం చసిన కెవ్వు కేక క్లబ్ సాంగ్ కుర్రకారుకి కేక పెట్టించేది లా ఉంది .
దేవి శ్రీ ప్రసాద్  ప్రతి సినిమా లో ఏదో స్పెషల్ ఉంటుంది 
డియ్యాలో డియ్యాలో తర్వాత మళ్లి కెవ్వు కేక పెట్టించాడు 

.వావ్ ! ఇది మన ఊరేనే ? ఆరోజు..

మీ గ్రామానికి ప్రభుత్వ పరంగా ఏమైనా అభివృద్ధి  జరగాలని అనుకుంటున్నారా  ? అయితే  మీ గ్రామానికి ఏ మంత్రో ...ఉన్నత అధికారో రావాలని కోరుకోండి......ఎన్నికలు వస్తే మరి మంచిది ...
ఎవరైనా అధికారం గల వారు వస్తున్నారంటేనే...మన వీధులు శుభ్రం గా కనిపిస్తాయి ..బ్లీచింగ్ జల్లుతారు ......పూడికలు పూడ్చడం ....వావ్ ఆరోజు ఇది మన ఊరేనే ? అనిపిస్తుంది..ఎందుకంటే ఎప్పుడు రోడ్ మీద ఏమున్న పట్టించి కొనే నేతలు ..ఈ రోజు ఇలా కనపడితే ......????? 
ఇది మన ప్రజాస్వామ్యం ..................మన దౌర్భాగ్యం ......కాదు కాదు మనం చేతులారా చేసుకుంటున్న ......రాజకీయం ....ఏ పార్టీ అధికారం లో ఉన్న అదే పరిస్తితి ..నేడు అంతే..త్వరలో ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజవర్గ ప్రాంతాలకు కోట్ల నిధులు మంజూరు అయిపోతున్నై ..క్షణాల్లో జీవోలు ..రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ?

మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ పాలన

వై ఎస్ ఆర్ తర్వాత మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ  పాలన మొదలయినట్టు ఎవరికైన యిట్టె అర్ధం అవుతోంది ...మొయిలీ రాక తో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్తితి పై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నై .....తరచు ముఖ్య మంత్రులను మార్చే ప్రక్రియ కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉంది ..పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు మామూలే ...ఎవరి ఇష్టాలు వారివి ..ఎవరి స్వార్ధం వారిది ...తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ లో తాకట్టు పడుతున్నారంటూ నాటి ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ స్తాపించి ..కాంగ్రెస్ ను ఖంగు తినిపించారు ........టి డి పి ఓడినప్పుడు అధికారం వచ్చిన మళ్లీ కుమ్ములాటలే.......ఇది పరిస్తి తి  కొనసాగితే కాంగ్రెస్స్ కు మరింత కష్ట కాలమే ...తెలుగు ప్రజల అవసరాలకు తగ్గట్టు ఢిల్లీ పాలన ఉంటుందా ?????

15, ఏప్రిల్ 2012, ఆదివారం

తార చౌదరి పై సినిమా కు టైటిల్స్ ఇవే

సంచలనం రేపిన తార చౌదరి పై సినిమా తీయడానికి నిర్మాతలు రెడి అవుతుంటే ..పలువురు రచయతలు ,దర్శకులు అప్పుడే కథ తయారు చేసేస్తునట్టు చెప్పు కుంటున్నారు .మరో పక్క టైటిల్ నమోదు జరిగిపోతోంది ..ఈ నేపధ్యం లో పలువురు కుర్రాళ్ళు ఈ సినిమాకు సరదాగా  తమాషా టైటిల్ చెప్పు కొచ్చారు ..ఓ సారి మీరు లూక్కెయండి   ..


తార వస్తోందోస్తోంది 


ఓ మై తార !


తారతళుకులు 


 తళుకు మన్న తార 


మై ప్యారి తార 


,అమ్మో తార !

14, ఏప్రిల్ 2012, శనివారం

.అంత మన మంచికే .రాష్ట్రం లో మరో రాజకీయ కూటమి ,, జయప్రకాష్ నారాయణ సారధ్యం !

.రాష్ట్రం లో  మరో రాజకీయ పార్టీ వస్తోంది ........అది పార్టీల సంకీర్ణం కావచ్చు ....వేరే కావచ్చు ...లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ దీనికి రూపకల్పన చేయడం విశేషం ..నిజమే నేడు ముఖ్యమని పాత్రీలు అన్ని రాజకీయ సంక్షోభాన్ని ...క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటూ ఉన్నాయి .కాంగ్రెస్స్ కలహాలతో ..తెలుగు దేశం ....సవాలక్షా కారణాలతో సతమత మోవుతున్నై ..కొత్తగా పుట్టుకు వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ అధినేత ఆరోపణల తో తల్లడిల్లుతున్నారు ..ఈ సమయం లో మంచి బలం గల పార్టీ వస్తే ...గ్యారంటీ గా దూసుకుపోతోందని రాజకీయ పండితులే సెలవిస్తున్నారు ..చిరం జీవి ఇలాంటి సమయంలో రాజకీయంలో ప్రవేశిస్తే లాభం చేకూరేదని ఆయన అభిమానాలే అంటున్నారు ....కాని ఆయన ...అయన పార్టీ .అల అయిపోయారు 
ఇక రాజకీయంగా చూస్తె ఎటువంటి ఆరోపణలు లేని జయప్రకాష్ నారాయణ  లోకసత్తా పార్టీ పెట్టిన ...ఉన్న ధన ...అధికార ...కుల .....కుయుక్త్తులు మధ్య ఆయన అనుకున్నన సీట్లు సంపాదించ లేక పోయారు ...ఏం ఎల్ ఏ అయిన తరవాత ....రాజకీయం పూర్తిగా అర్ధం అయి ఉంటుంది ....ఇప్పుడు రాష్ట్రం లో మూడు ప్రత్యమ్న్యాం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ..ముందుగా అయన కమ్యూనిస్టుల తో మాట్లాడారు ..తర్వాత ..మరో పార్టీ తో ..రాష్ట్రం లో ఎన్నో చిన్న చితక పార్టీలు ఉన్నాయి ..ఎంతో మంది మేధావులు ఉన్నారు ...వీరినందరిని కలిపితే మూడు కూటమి సాధ్యమే ..అంత మన మంచికే ..అయితే ఇది అయ్యే పనేనా ? ఏమో చూద్దాం 

7, ఏప్రిల్ 2012, శనివారం

కొంపదీసి ..నా పేరు కాని ,నా సెల్ నంబర్ కాని "తార"" లిస్టు లో ఉందా?..................తార గుప్పిట్లో ఎందరు శృంగార పురుషులు !

హైటెక్ సెక్స్ రాకెట్ నడుపుతున్నది అంటూ తార చౌదరి గురించి మీడియా లో వస్తున్నా కధనాలు చూస్తుంటే ఏ శృంగార సినిమా సరిపోదేమో అనిపిస్తోంది .ఆమె సెల్ ఫోన్ లో ఎనిమిది వందల నంబర్లు ..కేవలం మూడు నెలల కాలం లో ఎనిమిది వేల కాల్స్ ........
ఆ ఆరోపణలు  నిజమైతే ....(ఆధారాలు ఉన్నాయి అంటున్నారు )
వార్నీ.!.భలే బాలామణి కాబోలు ....
ఆరోపణలు ఎదుర్కున్న తార కోర్టు మెట్టులు ఎక్కుతుండగా ..ఆమె తో వ్యవ హారం నడిపిన వారు పోలీసుల చెంత కు చేరుతున్నారట ...
పోలీసు బాబాయ్ !కొంపదీసి ..నా పేరు కాని ,నా సెల్ నంబర్ కాని "తార లిస్టు లో ఉందా?చూసి చెప్పి పుణ్యం కట్టుకో మంటున్నారట..తార కు పలువురు సిని ..రాజకీయ ప్రముఖులతో సంబంధం ఉందని వార్తలు వస్తున్నా నేపధ్యం లో వాళ్ళ కాళ్ళు వణుకుతున్నాయి అన్నమాట .
నిమిషాల సౌఖ్యం  కోసం చూసుకుంటే ....జీవితాంతం టెన్సన్ పడక తప్పదు మరి ....
రంకు..బొంకు ఎన్నాళ్ళు దాగుతుంది .?..అని పెద్దలు ఊరకే అనలేదు కదా !

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

రచ్చ సినిమాలో ఆ డైలాగ్ అవసరమా ?

రచ్చ సినిమాలో ఆ డైలాగ్ అవసరమా ? ఇదే విషయాన్ని చాలమంది చర్చించు కుంటున్నారు .
"ఏదో చూసి తొడలు కొట్టే టైపు కాదు నాది ""...........రాం చరణ్ కొత్త సినిమాలో ఓ డైలాగ్ ఇది .
ఈ డైలాగ్ వచ్చినప్పుడు సినిమా హాల్ లో అభిమానుల చప్పట్లు ఏ రేంజ్  లో మ్రోగుతున్నాయో 
అదే స్తాయిలో  చర్చ సాగుతోంది ....తొడ అనే పదం కు సిని పరిశ్రమలో ఎవరికి సంబంధమో అందరికి 
ఇలాంటి డైలాగ్స్ వల్ల అభిమానుల మధ్య వైరం పెరిగే అవకాసం ఉంటుంది ..వారి సినిమా లో వీరు వీరి 
సినిమాలో వారు ఇష్టం వచ్చినట్టు ఊగిపోతారు ..ఇది మంచి పద్దితి కాదు అని సీనియర్ అభిమానులే 
అంటున్నారు ...హీరోలు మాత్రం ఒకరి సినిమాకు ఒకరు క్లాప్స్ కొట్టుకోవడం .పోగుడుకోవడం......తీరా 
సినిమాల్లో ఇలా చేయడం .......విచిత్రం గా ఉంటుంది ....
 సినిమా ను పెద్దలు ముందే చూసి ఉంటారు .....ఈ డైలాగ్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో తెలియదా ?
కుర్ర హీరో ల దూకుడు పెద్దలు కంట్రోల్ చెయ్య వలసిందే ......
తెలుగు సినిమా బాగు పడాలి అంటే  ముఖ్యం గా హీరోలు ,దర్శకులు ,నిర్మాతల మధ్య మంచి సయోధ్య ఉండాలి ...అది సాధ్యం అయ్యేల్ సిని పెద్దలు నడుం కట్టాలి 

.హీరోలకు సవాల్ ,నాటి బ్లాక్ బ్యూటీ , నేటి మిల్క్ బ్యూటీ

సాధారణంగా హీరో  చెంత హీరొయిన్ గ్లామర్ తప్ప  పెద్ద గా హీరో తో పాటు పాత్రలు ఉండవు ..అంత ప్రాధాన్యత ఉండదు .కాని ఒక్కోసారి హీరొయిన్ పాత్ర చిందే అయిన మంచి గుర్తింపు ఉంటుంది ..ఈ మధ్య సినిమాల్లో హీరొయిన్ పాటలకే పరిమితిం అవుతోంది ...క్రుర్ర హీరోలు కాబట్టి హీరో గారి స్టెప్స్ కే ప్రాధాన్యత నిస్తున్నారు ..ఈ క్రమం లో వచ్చిన "రచ్చ " సినిమా లో తమన్నా వేసిన స్టెప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ..పరిశ్రమలో ....ప్రేక్షకులు ..సిని విమర్శకులు ఇదే విషయాన్ని చర్చించు కుంటున్నారు ....తమన్నా ను చూసి నాటి బ్లాక్ బ్యూటీ "రాధ " ను గుర్త్కు తెచ్చుకుంటున్నారు .చిరంజీవి ,బాలకృష్ణ ,వంటి స్టార్స్ తో పోటీ పడి రాధా స్టెప్స్ వేయడం జరిగింది .చాల సార్లు హీరో లను మించిపోయి రాధ స్టెప్స్ వేచి అందరి చేత శభాష్ అనిపించుకుంది ...నేడు మళ్ళి నేటి మిల్క్ బ్యూటీ  తమన్నా తన స్టెప్స్ తో మతి పోయేలా చేసింది ..రామ్ చరణ్ స్టెప్స్ కే సవాల్ విసిరింది ....( ఈ స్టెప్స్ ,అందం చూసేనేమో  తన నూట యాబై సినిమా లో తమన్నా హీరొయిన్ గా ఉంటె బావుంటుంది అని మెగా స్టార్ చిరు రచ్చ ఆడియో ఫంక్షన్ లో తన కోరిక ను వెల్లడించారు )......అంటే తమన్నా దూకుడు తో హీరో లు స్టెప్స్ వేయవలసిందే .హీరోలకు సవాల్ 

5, ఏప్రిల్ 2012, గురువారం

రచ్చ సినిమా కథ

రచ్చ సినిమా కథ  
 బెట్టింగ్ రాజ్ (చరణ్ )  రిస్క్ పనులు చేసే ఓ బస్తి కుర్రాడు .ఏం ఎస్ నారాయణ ,సుధా దంపతుల వద్ద పెరుగుతుంటాడు .నారాయణ ఆపరేసన్ కోసం ఓ ఇరవై లక్షలు అవసరం కావడం తో జేమ్స్ (అజ్మల్ ) 
పందెం కడతాడు .బెట్ ప్రకారం గనులు గల పెద్ద మనిషి బళ్ళారి (ముఖేష్ రుషి ) కూతురు  చైత్ర (తమన్నా ) 
ను ప్రేమించి ఓ ముప్పై రోజులలో ఆమె తో ఐ లవ్ యు చెప్పించాలి ....డబ్బు కోసం చైత్ర వెంట పడి..ఎన్నో రిస్క్స్ 
చేసి చివరకు ఆమె ప్రేమను పొందుతాడు ...అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది .....చైత్ర కోసమే జేమ్స్ బెట్ కట్టడం ....అసలు చైత్ర ఎవరు అన్న నిజం తెలుస్తుంది ..రాయదుర్గం లోని మూడువేల ఎకరాల్లో ఉన్న ఇనప ఖనిజం కోసం బళ్ళారి చేసిన దుర్మార్గం ......తన తండ్రి మరణం  వంటి విషయాలు తెల్సుకున్న రాజ్ శత్రువులలను ఎలా చంపాడు అన్నదే మిగతా కథ .

rachcha cinema reviewtelugu రచ్చ రచ్చ ..చేసిన రామచరణ్ రెచ్చిపోయిన తమన్నా ..పంజా విసిరినపరుచూరి బ్రదర్స్




ఆరంజ్ తో నిరాశలో ఉన్న రామచరణ్ అభిమానులకు రచ్చ ఆనందాన్ని పంచుతుంది .కొత్త దర్శకుడు సంపత్ నంది కుర్రకారును కనువిందు చేసాడు ...బోర్ కొట్టకుండా సినిమా తీయ గలిగాడు  తమన్నా అందాలు సిన్మాకు ప్లస్ పాయింట్ ...కొంతకాలం సైలెంట్ గా ఉన్నా పరుచూరి బ్రదర్స్ మళ్లీ తమ పంజా విసిరారు .
రచ్చ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన మొదటి మూవీ ...ఇది .
 సినిమా కథ  కొంత వరకు పాతదే అయిన కొంత కొత్త గా ఎన్నుకున్నారు .ట్విస్ట్ లకు అవకాశం గల కథ .ముఖ్యం గా కథనం చక్కగా ఉండడం ....ప్రేక్షకులను దియేటర్ నుంచి కాలు కదపకుండా చేసింది పెద్దగ కొన్ని సన్నివేశాల్లో సస్పెన్సే లేక పోయిన  మొదటి నుంచి థ్రిల్లింగ్ గా ఉంది .
 సినిమాలో మగధీర ,చిరుత చాయలు ఉన్నాయి .మగధీర లో ఎంట్రన్సు లో ఉండే బైక్ రేస్ మాదిరిగా వచ్చే ట్రైన్ ముందుకు వెళ్ళే కార్ పోటి ఉంది ..చిరుత లో క్లైమాక్ష్ మాదిరి గా అడవి ..హెలికాప్టర్ తో వచ్చి హీరొయిన్ ను తీసుకు పోవడం ఉంది ...
అయిన సీన్స్ బాగేనే తీసారు .మగధీర లో మాదిరి జ్ఞాపకాలు  సీన్ కూడా కొంత ఉంది .రామ్ చరణ్ తనదైన స్టైల్ లో కనిపించాడు ...పాటల్లో ..ఫైట్స్ ల తన ఎనర్జీ మళ్లీ రుచి చూపించాడు ....(టైటిల్ సాంగ్ లో మాత్రం స్టెప్స్ అభిమానులను నిరాశ పరిచాయి ....కాని డిల్ల డిల్ల పాత లో మాత్రం ఇరగదీసాడు ) ఈ సినిమాల్లో పలు చోట్ల తన తండ్రి చిరంజీవి ని అనుకరిచాడు .." పేసు టర్నింగ్ ఇచ్చుకో  "లాంటి సీన్ హీరొయిన్ తమన్న తో చేసాడు .....చరణ్ నటన లో మెరుగుదల ఉంది 
 తమన్నా తన అందచందాలతో కనువిందు చేసింది .డాన్సు లో కసి కనిపించిది .కొన్ని స్టెప్స్ లో చరణ్ ను కూడా మించి పోయి చేసి నాటి రాధను గుర్తుకు తెచ్చింది .
 ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ తమ కలం పోటు మరో సారి రుచి చూపించారు ...
"నువ్వు అరిస్తే అరుపులే ..నేను అరిస్తే మెరుపులే ....
"శరీరం లో సునామి పుడుతోందా?" లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు ..అంతేకాదు పరిచూరి వెంకటేశ్వర రావు  ఓ కీలక పాత్ర పోషించారు.
సిమాలో సెట్టింగ్స్ బావున్నై ..విలన్ ఇల్లు ఇంద్రలోకాన్ని మైమరిపించే విదంగా కనిపించింది ...బ్రమానందం ,వేణు ,తాగుబోతు రమేష్ ,ఆలి పాత్రలు పరిమతం గానే ఉన్నాఉన్నంత లో హాస్యం పండించారు 
 .ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయ్ .రెండు పాటలు  ఏదో మధ్యలో ఇరికించి నట్టు కనిపిస్తోంది ..కొన్ని పాత్రలు మరి పరిమితంగా ఉన్నాయ్ .మొత్తానికి ఇది మాస్స్ టార్గెట్ తో తీసినట్టు తెలోస్తోంది....పైసలు మాత్రం భాగానే వస్తాయి .