mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

29, మార్చి 2012, గురువారం

dammu songs review .దమ్ము పాటల రివ్యూ

దమ్ము లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి .కీరవాణి 
బాబా సెహగల్ పాడిన  ఓ లిల్లీ ..బూరి బుగ్గల బుల్లి పాట తో ఆడీయో ప్రారంభమైంది  

రాహుల్,శ్ర్వావని భార్ఘవి ,శివాని  గానం చేసిన "వాస్తు బాగుందే..బేబివాస్తు బాగుందే " అనే పాట ఫాస్ట్ బీట్ తో హుషారుగా ఉంది .బహుశ ఈ పాటను హీరో ,ఇద్దరు హీరొయిన్ ల మీద చిత్రీకరించి ఉంటారు ...మంచి స్టెప్స్ వేయడానికి అనుకూలమైన మూజిక్ ఉంది 
నీలో ఉంది దమ్ము ...నాలో ఉంది సొమ్ము 
దమ్ము సొమ్ము ఏకం చేసి ...అనే పాట  క్లబ్ మాస్ బీట్ గా ఉంది ...బహుశ ఈ పాటను కూడా హీరో ,ఇద్దరు హీరొయిన్ ల మీద చిత్రీకరించి ఉంటారు 
రూలర్......రాజది రాజ  అనే పాట  రెండు వర్సన్ లో ఉన్నాయి .ఒకటి సినిమా వర్సన్ ,..రెండవది సీడీ వర్సన్ ....మగధీర లో ధీర ...ధీర పాటను పోలి ఉంది .
రాజు వచ్చినారు .....శ్రీ శ్రీ రాజ వాసి రెడ్డి ..నీవు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అంటూ క్లాస్స్ మిక్ష్ చేసిన మాస్స్ సాంగ్ కీరవాణి స్వయంగా గానం చేసారు ....సింహ పదజాలం తో ఈ పాట సాగింది .వైవిధ్యంగా ఉంది ఈ పాట .
మొత్తం మీద ఎన్ టి ఆర్ అభిమానులను అలరించే విదంగా పాటలు ఉన్నాయ్ 

దమ్ము ఆడియో రిలీజ్ ఫంక్షన్కు ఎన్ టి ఆర్ ప్రణీత తో ...సౌండ్ తగ్గించుకో ....ఒక్కసారి కొట్టానంటే





దమ్ము ఆడియో రిలీజ్ ఫంక్షన్కు   ఎన్ టి ఆర్  ప్రణీత తో కల్సి వచ్చారు .కీరవాణి దంపతులు ఎన్ టి ఆర్  దంపతు లకు తోలి సీడీ అందించారు .ట్రైలర్ ను దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు .బోయపాటి శ్రీను ...ఎన్ టి ఆర్ సిన్మాలో డైలాగ్స్ చెప్పి అలరించారు .....ట్రైలర్ బావుంది ...సింహ మాదిరి గానే సినిమా కనిపిస్తోంది
ఒక్కసారి కొట్టానంటే ...నంటూ పవర్ఫుల్ డైలాగ్  చెప్పారు .
సౌండ్ తగ్గించుకో ....ఒక్కసారి కొట్టానంటే గొంతు రావడానికి అయిదు రోజులు పడుద్ది 

25, మార్చి 2012, ఆదివారం

గాంధి తాత !ఈ పండు తిను (నిజమైన ఫోటో తో )





మిట్ట మధ్యహ్నం  రెండు గంటల సమయం ...తిరుపతి సమీపాన పాపనాసనం దగ్గర రోడ్ పై  ఓ ముసలి వాడు హటాత్ గా గాంధి వేషం లో నిలబడ్డాడు .....తన కాళ్ళ దగ్గర ఓ ప్లాస్టిక్ డబ్బా పెట్టాడు ..ఓ డబ్బాలో పలువురు డబ్బులు వేస్తున్నారు .......కాని ఓ వ్యక్తి మాత్రం అక్కడ అమ్ముతున్న ఫ్రూట్ సలాడ్ తీసుకు వచ్చి .." తాత ! తిను " అంటూ పిలిచాడు ....దాదాపు అతను ఓ పది నిమిషాలు ప్లేట్ పట్టుకుని అలానే ఉంది పోయాడు ..కాని గాంధి వేషదారి మాత్రం కదల లేదు ...మెదల లేదు ....ఈ లోగ బస్ రావడం తో "తాత తర్వాత తిను " అని ముందుకు కదిలాడు .....
ఈ రోజుల్లో ఇలాంటి మానవత్వం గల మనిషి కనిపించడం చాల అరుదు కదా ?

23, మార్చి 2012, శుక్రవారం

సుమ ,ఝాన్సి ల కు పోటీ యాంకర్ ?

టీవీ న్యూస్ రీడర్స్ కూడా క్రమం గా యాంకర్స్ గా మారుతున్నారు .ప్రత్యెక ఫంక్సన్ లలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు .తాజాగా టి వి నైన్ న్యూస్ రీడర్ దీప్తి వాజపేయీ  నేడు నంది అవార్డ్ ఫంక్సన్ లో యాంకరింగ్ చేసింది .సుమ ,ఝాన్సి ల కు పోటీ గా వస్తుదేమో .

22, మార్చి 2012, గురువారం

నెలకు పైగా నిల్వ .ఉండే ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి అంటే ఇష్ట పడిన వారు ఉండరు ..అయితే ఆయా ప్రాంతాలను బట్టి పచ్చడి ఉంటుంది .అమృతం లాంటి పచ్చడి చాల రోజులు వరకు కూడా నిల్వ చేసు కోవచ్చు.
పచ్చడి పల్చగా కాకుండా జెల్ మాదిరిగా చేసు కుంటే బావుంటుంది ....ఇది ఎలా చెయ్యాలి అంటే 
 కావలసినవి
 "బాగా ముగ్గిన కర్పూర అరటి పళ్ళు ఓ డజెన్.....కే జి బెల్లం ,పావు కే జి వేపిన సెనగ పప్పు ,ఓ మామిడి కాయ ,పావు కే జి చింతపండు  ,తగినంత వేపపువ్వు ,సాల్ట్ ,నెయ్యి ,కిస్మిస్ ...
తయారి విధానం  ఓ వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకుని ...ముందుగా సిద్దం చేసుకున్న చింతపండు గుజ్జును వేసి బాగా కలియబెట్టాలి .తర్వాత తరిగిన బెల్లంను వాసి అది నీటిలో మొత్తం కరిగేలా చూడాలి ...(అవసరాన్ని బట్టి కొంత నీరు చేర్చాలి ).అరటి పండు ను ఒక్కటిగా తీసుకుని దానిని బాగా పిసకాలి .పాత్రలో బెల్లం ,చింతపండు ,అరటిపళ్ళు మొత్తం ద్రవరూపం పొందాలి ...ఈ ద్రవ మిశ్రమం లో మామిడి ముక్కలు ,సేనగాపప్ప్కు ,కిస్మిస్స్,వేప పువ్వు ,సాల్ట్ ,వేసి మొత్తం కల్పి ...చివరగా కొద్దిగా నెయ్యి చేర్చాలి .......ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ ..ఇది బయట పదియేను రోజులు ,ప్రిజ్ లో అయితే నెలకు పైగా నిల్వ ఉంటుంది ..

20, మార్చి 2012, మంగళవారం

బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప.......అసలు కారణం ?

ఏదైనా బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప ...వేరే కోణం  లోంచి ఆలోచించడం మర్చిపోతున్న్నాం ....ఈ రోజు ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ పడి పదిమందికి పైగానే చనిపోవడం భాదాకరం .తూర్పు లో బస్ ప్రమాదం మరవక ముందే  మరో ప్రమాదం .........ఈ ఘటనలలో బస్ నడిపిన  డ్రైవర్ ..స్కూల్ యాజమాన్యం భాద్యత వహించ వల్చిందే ......నిబందనలకు అనుగుణం గా బస్ నడుపుతున్నారు లేదో నిగ్గు తేల్చి శిక్షించవలసిందే ..కాని అంతకంటే ముందే సర్కారు తీరును కూడా ప్రశ్నించాలి.జరిగిన ఘటనలు పరిశీలిస్తే .....ఇరుకైన ,పాడైన...వంతెనలు ...సరిగా లేని రోడ్స్ వద్దే ప్రమాదాలు జరగుతున్నై .ఈ విషయం పై లోతుగా చర్చించాలి ....ముఖ్యం గా చిన్నారుల భవిష్యత్ ద్రుష్టి లో ఉంచుకుని ..ఆయ స్కూల్ బస్ లు ఏ రోడ్ పై వెళ్తున్నై ..అవి సేఫ్టీ యా కాదా పరిశీలించాలి ..ఈ కట్టడి వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తమ బిడ్డల కోసం మంచి సదుపాయాలు రోడ్స్ ,వంతెనలు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి పెంచుతారు ..అన్ని బాగుపడతాయి ?

9, మార్చి 2012, శుక్రవారం

ఆ బాలిక కు గుర్తింపు ఏది ?

 కబాడీ లో ప్రపంచ కప్పు  సాధనలో మన తెలుగు బాలిక ఉంది ....కాని గుర్తింపే లేక పోవడం భాదాకరం .మహారాష్ట్ర ఇప్పటికే విజేతలకు పెక్కు నగదు బహుమతులు ఇచ్చింది ..కబాడిలో అందున ఓ బాలిక లక్ష్మి విజయం తో తిరిగిన వచ్చిన తగిన ఫలితం లేక పోవడం దారుణం ..క్రికెట్ వంటి వాటికే ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళ సంప్రదాయక ఆటలు మరుగున పడిపోట్టున్నై అనుటకు ఇదే ఉదాహరణ ....లక్ష్మి విషయంలో చాల చానెల్స్ స్పదిస్తున్నై ..సర్కార్ కూడా వెంటనే స్పందిస్తే మంచిది 

7, మార్చి 2012, బుధవారం

.విమానం లో చెప్పులు తెప్పించుకున్న ........??..చాల గట్టిగా బుద్ది చెప్పడం

ఉప ఎన్నికల ఫలితాలను ,అక్కడి రాజకీయాన్ని ఓ సారి పరిశీలిస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితం గా అర్ధమౌతోంది.అవినీతి నేతలకు పతనం తప్పదు..రౌడీ గూండాలకు చోట లేకుండా చేయవచ్చు అని .విమానం లో చెప్పులు తెప్పించుకున్న విలాస  సి ఏం ,ప్రభుత్వ డబ్బును మంచినీళ్ళ ల ఖర్హు పెట్టి విగ్రహాలు పెట్టించుకున్న మాయావతికి అక్కిడి ప్రజలు చాల గట్టిగా బుద్ది చెప్పడం సంతోషకర విషయం ..ములాయం కుమారుడు అఖిలేష్ యువతకు స్ఫూర్తి దాయకం గా నిలిచారు .తన పార్టీలో రౌడీ లకు స్థానం లేకుండా చేసి జనం మనసు గెల్చుకున్నారు .ఇలాంటి యువ నేతలు అన్ని రాష్ట్రాల్లో ఉంటె దేశం బాగు పడుతుంది .