mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
జనరల్ న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జనరల్ న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మార్చి 2012, మంగళవారం

బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప.......అసలు కారణం ?

ఏదైనా బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప ...వేరే కోణం  లోంచి ఆలోచించడం మర్చిపోతున్న్నాం ....ఈ రోజు ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ పడి పదిమందికి పైగానే చనిపోవడం భాదాకరం .తూర్పు లో బస్ ప్రమాదం మరవక ముందే  మరో ప్రమాదం .........ఈ ఘటనలలో బస్ నడిపిన  డ్రైవర్ ..స్కూల్ యాజమాన్యం భాద్యత వహించ వల్చిందే ......నిబందనలకు అనుగుణం గా బస్ నడుపుతున్నారు లేదో నిగ్గు తేల్చి శిక్షించవలసిందే ..కాని అంతకంటే ముందే సర్కారు తీరును కూడా ప్రశ్నించాలి.జరిగిన ఘటనలు పరిశీలిస్తే .....ఇరుకైన ,పాడైన...వంతెనలు ...సరిగా లేని రోడ్స్ వద్దే ప్రమాదాలు జరగుతున్నై .ఈ విషయం పై లోతుగా చర్చించాలి ....ముఖ్యం గా చిన్నారుల భవిష్యత్ ద్రుష్టి లో ఉంచుకుని ..ఆయ స్కూల్ బస్ లు ఏ రోడ్ పై వెళ్తున్నై ..అవి సేఫ్టీ యా కాదా పరిశీలించాలి ..ఈ కట్టడి వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తమ బిడ్డల కోసం మంచి సదుపాయాలు రోడ్స్ ,వంతెనలు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి పెంచుతారు ..అన్ని బాగుపడతాయి ?

27, జనవరి 2012, శుక్రవారం

విగ్రహాలు ఏమి చేసాయి ?

విగ్రహాలు ఏమి చేసాయి ?
దేశం కోసం తన నిస్వార్ద సేవలు అందించిన మహానుభావులను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మనం వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్మరించుకోవడం మన మంచి సాంప్రదాయం .అలాంటి మహనీయులలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకరు ...దేశం లో ప్రతి గ్రామం లోనూ అయన విగ్రహం ఉంటుంది ....అమల పురం లో కొందరు దుండగులు విగ్రహాని పాడు చెయ్యడం దారుణం ..దీనితో కోనసీమలో ఉద్రిక్తత ...మళ్లీ దవలేస్వరం లో .......తూర్పు గోదావరికే తలవంపు తెచ్చే సంఘటనలు ఇవి .....అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు ...ఎవరి మీదో కోపం విగ్రహాలపై చూపించడం దుసంప్రదాయం అవుతుంది .....ఇది ఏదో ఒక జాతికి ..కులానికి సంబదించినది కాదు .....మహనీయుల జ్ఞాపకాలను వీలుంటే కాపాడే ప్రయత్నం చెయ్యాలి తప్ప కూల దోయ్యరాదు.  విగ్రహాలను పాడు చేసే వారికి  క ఠినంగా శిక్ష వేయాలి 

25, జనవరి 2012, బుధవారం

కుల గజ్జి చాటుకోవడం దారుణం

బురద రాజకీయాలు  మరింత రొచ్చులో దిగుతున్నాయి .ఇదివరకు చాటుమాటుగా కుల రాజకీయాలు నడిపే నేతలు నేడు మీడియా ముందు కు వచ్చి మరి తమ కుల గజ్జి చాటుకోవడం దారుణం .మా కులం వారికి అన్యాయం జరిగిందని కొందరు ....మా కులపోడికి ఇవ్వకపోతే ఖబడ్దార్ అని మరి కొందరు చిందులు వేయడం జరుగుతోంది ...ఇదే పరిస్తితి కొన సాగితే రాష్ట్రం రావనకాష్టమే.

.అభిమానులు ! మీరు కొట్టుకోవడం ఎందుకు ?







బాలయ్య ,చిరు ల మధ్య మాటల యుద్ధం ఫాన్స్ ను ఇబ్బంది పెడుతోంది .సినిమా పరంగా అభిమానులైన వారు నేడు రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తూ అలజడి  రేపుకుంటున్నారు.ఏ హీరో అభిమానులైన ఒకటి గుర్తు పెట్టుకోవాలి .సినిమా వేరు .రాజకీయం వేరు ...నిజంగా సినిమా లో మెగాస్టార్ క్రజ్ ను బట్టి చిరుకు బంపర్ మెజార్టీ రావాలి .కాని ఏమైంది ? చిరు మళ్లీ సినిమా తీస్తే చూడడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు ......అలాగే మిగతా హీరోల వ్యవహారం కూడా ......బావ ను సి ఏం ను చెయ్యడానికి బాలయ్య తన ఇమేజ్ వాడుకుంటున్నారు ...కాంగ్రెస్ లో చిరు తన అదృష్టాన్ని పరిశేలించు కుంటున్నారు ..కాబట్టి అభిమానులు రాజకీయం గా ఎవరి ఎత్తులు వాళ్ళవి అని తెల్సుకోండి 

23, జనవరి 2012, సోమవారం

."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు ""-అన్న పొలిటికల్ బాలయ్య

అనుకున్నట్టుగానే బాలయ్య చిరు ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ,,,బాలయ్య  యమ దూకుడు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు .."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు "" అంటూ వైజాగ్ లో సింహ లో మాదిరిగా పొలిటికల్ డైలాగ్స్ వదిలి పెట్టారు .....పరొక్షమ్ గా చిరు పైన "నన్ను బాలుడు " అన్నారు అంటూ విమర్శ చేసారు .దీనిపై తిరుపతి లో చిరు బాలయ్య మాటలకు స్పదిన్చావాల్సిన అవసరం లేదని సింగిల్ డైలాగ్ తో తెల్సేసారట ..అయితే కొందరు చిరు అభిమానులు మాత్రం బాలయ్య దిష్టి బొమ్మను తగలుబెట్టినట్లు వార్తలు వస్తున్నై ..అంటే మొత్తానికి బాలయ్య రాజకీయంగా అగ్గి భాగానే రాజేస్తున్నారు .....మరి తెలుగు తమ్ములు బాలయ్యను ఏ రకంగా అర్ధం చేసుకుంటారో వేచి చూడవలసిందే .

22, జనవరి 2012, ఆదివారం

చిరంజీవి ,బాలకృష్ణ ... సై సై -పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

నాడు సినిమా పరంగా పోటి పడ్డ ఆ ఇద్దరు నేడు రాజకీయంగా తలపడడానికి సిద్ద పడుతున్నారు .వాటే చిరంజీవి ,బాలకృష్ణ .....ఈ మధ్య వీరిద్దరి మధ్య రాజకీయ వైరి వ్యాక్యలకు తెర లేచింది ...మాటకు మాట అనే వేడి ఇంకా రాలేదు కాని రావడానికి అవకాశం ఉంది .తాజాగా ఈ రోజు చిరం జీవి పై పోటీ చెయ్యడానికి సిద్దమని బాలయ్య ప్రకటించారు ...అంటే చిరు పై సై అంటున్నారు ....వీరిద్దరూ ఎలాను పోటీ చేయారు కాని ...మాటల యుద్ధం మాత్రం త్వరలోనే వినే అవకాశం ఉంది ..వేచి చూద్దాం ....పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

19, జనవరి 2012, గురువారం

.ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల!


సినీ నిర్మాతల ప్రచార తీరు మారు తోంది .."దండుకున్న వాడికి దండుకున్నంత " అన్నట్టు ఎంత ప్రచారం చేస్తుకుంటే అంత లాభం అని ఏ విషయాన్ని వదలడం లేదు ..టి వి ఆన్ చేస్తే చాలు బుసినెస్ మెన్ "పూరి " తెగ దంచుతున్నారు ...వర్మను మించిపోయారు .తాజాగా "నిప్పు " సినిమా పాటల సందడి కనిపిస్తోంది ...ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల చేస్తున్నారు ...(పాట ముక్కలేనండి ..మొత్తం కాదు లెండి ) నిన్న టి వి నైన్,నేడు ఎన్ టి వి లో పాట విడుదల చేసారు ..ఆడియో ఫంక్షన్ వేరుగానే ఉంటుంది అట ..ఇదో రక మైన ప్రచారం ....రవి తేజ ఆంజనేయులు సినిమాలో చెప్పినట్టు ...ప్రచారాలు జోరేత్తుతున్న్నై. న్యూస్ చాన్నాళ్ళ కు సరిపడా న్యూస్ లేదు ...ఆదాయం కావలి ..కాబట్టి సినిమా కబుర్లతో నింపుతున్నారు .

18, జనవరి 2012, బుధవారం

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి .....పాపం సి ఎం కిరణ్ గారు మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చెయ్యాలని ఆశించారు .....అయితే అయన ఇష్టం కాదు కదా ,,ఢిల్లీ పెద్దల మాటే వేదం ......సహా లక్ష రాజకీయాలతో కాంగ్రెస్స్ అధిస్తానవర్గం తల మునకైలై ఉంది ఒక వైపు అయిదు రాష్ట్రాల ఎన్నికలు ..తెలంగాన వేడి ఉండనే ఉంది ..ఈ నేపధ్యం లో ఎందుకు వచ్చిన గొడవ ...కదిపితే కందిరీగ అనుకున్నటున్నారు....." మన ప్రభుత్వాన్ని కాపాడిన  చిరు పార్టీ లో ఆ ఇద్దరినీ తీసుకుని ..సరిపెట్టికోమని ...చక్కగా చేతులు దులుపు కున్నారు ......

17, జనవరి 2012, మంగళవారం

.సి ఎం గారు! సమన్వయము మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి

ఏ  రాష్ట్రం బాగుపడాలన్నా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే నేతలపై ఆధారపడి ఉంటుంది .ముఖ్యమంత్రి తో పాటు మంత్రూలు సమిష్టిగా పనిచేస్త్నే జనం భాగుపడతారు .అయితే ప్రస్తుతం ఎడ్డ మంటే తెడ్డు అన్నట్టు ..మంత్రివర్గం లో సమన్వయము లేదన్న విషయం అందరికి తెల్సు .సి ఏం తన మార్కు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఆ పార్టీ లోనే వ్యతి రేక వర్గం అడ్డు పడుతోంది ...తమ మాట సి ఏం వినడం లేదని వారి ఆరోపణ .ఇదిలా ఉండగా ....ఈ రోజు ఢిల్లీ కాంగ్రెస్స్ లో సి ఏం ,కిరణ్ ,బొత్స  ఇతఃరుఅలు  జరిపిన రాజకీయం తో .....రాష్ట్ర మంత్రి వర్గం విస్తరిచానున్నారు .మరి సి ఎం కు నచ్చిన వారు వస్తారో ,హై కమాండ్ వారి సిపార్సు వారు వస్తారో వేసి చూడాలి ..ఈ నెల లో జరిగే మంత్రివర్గం విస్తరణ తర్వాత అయిన కిరణ్ సర్కార్ మరింత మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం .

15, జనవరి 2012, ఆదివారం

.కోడి కొసల కోసం గొడవలు

కోడిపందాలు జరుగుతున్నాయి .అధికారులు మొదట ఎలా చెప్పిన పండుగ రోజుల్లో  ఎవరు లెక్క చెయ్యారు.సాంప్రదాయ పద్దతి లో పందాలు జరపుకుంటే పెద్దగా పట్టించు కో నవసరం లేదు ..అది ఓ సరదా గా సరిపెట్టుకోవచ్చు ..కాని రాను రానూ ఇది పెద్ద జూదం ల తయారయ్యింది ..అశాంతి వాతావరణాన్ని ఏర్పడుతోంది .అందుకే ఆంక్షలు .....ప్రజా ప్రతినిదుల ఒత్తిడి కి తల్లోగ్గి పండుగ మూడురోజులు పోలీసులు చూసి చూడనట్టు వదిలెయ్యడం తో గోదావరి జిల్లా లో "కాయ్ రాజా కాయ్ " జోరుగా జరుగుతోంది .తెలంగాణా రాయలసీమ వాసులు తో పాటు విదేశీయులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు .కాగా పల్లె సీమల్లో నూ అదే జోరు ...పందాలకు కొదవ లేదు ..నాటు కూడా ఫుల్ల్గా గా దొరుకుతూ ఉండడం తో అక్కడక్కడ కూడా కొట్లాటలు కూడా జరుగుతున్నట్లు సమాచారం ...కోడి కొసల కోసం ఎక్కువక్గా గొడవలు జరగడం సర్వసాదారణ విషయం ..కొస యమ టే స్టీ గా ఉందాం తో ధర కూడా వేళల్లోనే పలుకుతుంది .

చలి సంక్రాంతి .

చలి సంక్రాంతి ..నిజం గా ఇది చలి సంక్రాంతే.ఎన్నడు ఇంత చలి లేదు .భోగి మంట సంప్రదాయం ఎందుకు పెట్టారో ఇప్పుడు అందరికి అర్ధం అవుతోంది ..చలి కి ఎవ్వరు నిద్ర లేవడానికి ఇష్టపడరు ..అయితే పండుగ రోజున పెందల కాదనే నిద్ర లేవక తప్పదు.లేచిన తర్వాత చక్కగా భోగి మంట దగ్గర కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటోంది ..సంక్రాంతి రోజున అదే పరిస్తితి ...ఈ సంవత్సరం ముందుగ చలి లేకున్నా తర్వాత భాగ పెరిగింది ...అన్ని వసతులు గల వారికి పర్వ లేదు కాని దుప్పటి కూడా లేని పేద వాళ్లకు నరకమే ..ముఖ్యం గా వసతి గ్రుహాల్ల్లో ఉండే విద్యార్దులు చాల బాధ పడతారు .వీరి గురించి ఆలోచించాలి ప్రభుత్వం ..