mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

8, మే 2012, మంగళవారం

సాక్షి పత్రిక ,సాక్షి టి వి లకు సంబంధించి ఎకౌంట్లు సి బి ఐ నిలిపి వేయడం తో

జగన్ అరెస్ట్ అవుతారా ? ఈ నెల ఇరవై ఎనిమిది న తేలనుంది ..అయితే  సాక్షి పత్రిక ,సాక్షి  టి వి లకు సంబంధించి ఎకౌంట్లు సి బి ఐ నిలిపి వేయడం తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ....జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎన్నో రోజులగా  ...ముఖ్యంగా రాజకీయంగా రగడ జరుగుతోంది ......తండ్రి ని అడ్డం పెట్టుకుని  జగన్ కోట్లు గడించి.....తన మీడియా తో  రాజకీయం చేస్తున్నాడని  ఆరోపణలు ఉన్నాయి .........మరి జగన్ పరిస్థితి ఎలా  ఉంటుంది ?????/ 
కాగా వాళ్ళ ఆయా సంస్థలలో పని చేసే సిబ్బంది ఎన్నిఇబ్బందులు ఎదుర్కోవాలి ?

1 కామెంట్‌:

  1. http://www.janardhanpen.blogspot.in/2012/05/blog-post_6269.html

    బ్లాక్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా.. సాక్షికి జర్నలిస్టుల శాపం తగిలింది. జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..?


    జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..? బ్లాక్ డే అంటూ సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో ఈ రోజు బేనర్ పెట్టుకుంది. వాస్తవానికి సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు.. కానీ ఈ రాష్ట్ర్రంలో ఉన్న జర్నలిస్టులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే బ్లాక్ లిస్టులో చేరిపోయారు. చిన్న పత్రికలన్నీ చాలా వరకు కూడూ గుడ్డా లేకుండా రోడ్డున పడ్డాయి. రెండు రూపాయలకే చాటెడు చెత్త అందిస్తానని చెప్పుకొచ్చిన సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు. కానీ వార్తా పత్రికలేమన్నా. భగవద్గీతలా.. ఖురానా.. బైబిలా వాటి అంత సత్య నిరత ఉందా... ? వార్తా పత్రికల్లో వార్త పడితే స్పందించాలా.. పత్రికలో అధికారుల అలసత్వం పై, అవినీతి పై వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలా...? అంటూ వ్యంగ్య బాణాలు విసిరిన పరమ మీడియా ద్వేషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం ప్రతి జర్నలిస్టుకూ తెలుసు. చనిపోయి ఏ లోకంటో ఉన్నాడో గానీ.. బతికున్నపుడు చేసిన నిర్వాకం వల్ల పేద జర్నలిస్టులు చాలా మంది కూటికెల్లక కూలీ పడుతున్నారు. చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా.. వార్తలు రాసీ రాసీ విసుగు పుడుతుందే తప్ప ఏ ఒక్క అధికారిలో కదలిక లేదు. అతగాడి చెత్త వ్యూహం వల్ల రాష్ట్రంలో జవాబుదారీ తనంలోపించింది. అధికారులు అవినీతి పరులయ్యారు. బాహాటంగానే లంచాలు పుచ్చుకుంటున్నారు. ఎవరైనా విలేకరులు వివరణలు అడిగితే.. కావాలంటే ఫోటోలు తీసుకోండని వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఎన్ని వార్తలు రాసినా అధికారులు పాత పద్దతిలోనే అంటే.. వార్తలు భగవద్గీతలు కావు కదా అని వైయస్ చెప్పాడని నెట్టుకొస్తున్నారు. సాక్షిలో వస్తేనే వార్త, సాక్షి చానల్‌లో ప్రసారమైందే సిసలైన వార్త.. ఇదీ వైయస్ రాజశేకర్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్దాంతం వల్ల పత్రికలన్నీ మూసేసుకోవాలనే పన్నాగం పన్ని..రాష్ట్రంలో ఏ పత్రికకూ యాడ్స్ రాకుండా అడ్డుకున్నాడు. చిన్న పత్రికలైతే మరీ బిచ్చగాళ్లలా తిరిగినా.. కాళ్లరిగేలా తిరిగినా ఏ సమాచార అధికారీ ఒక్క యాడ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరికైనా కాళ్లొత్తే అలవాటు ఉంటే.. ఒకరిద్దరు బతకనేర్చి యాడ్స్ తెచ్చుకునేవారు. ఆత్మభిమానం ఉన్న వాళ్లంతా డీటీపీ ఆపరేటర్లుగానో.. డెస్ట్ ఎడిటర్లుగానో అవతారం ఎత్తారు. ఎప్పుడైతే సాక్షి తాకిడికి, వైయస్ చెత్త నిర్ణయాలకు పత్రికలు, జర్నలిస్టులు బలయ్యారో.. ఆ రోజే జర్నలిజానికి బ్లాక్ డే మొదలయింది.

    ఈ రోజు సాక్షి పత్రికకు ఒక్కరోజు యాడ్స్ నిలిపేస్తే గొంతు చించుకుంటున్న సో కాల్డ్ జర్నలిస్టులు.. ఇంతకాలం ఇన్ని పత్రికల గోస తెలియదా... అమర్ లాంటి వ్యక్తి ఈ రోజు మీడియా ముండు నిలబడి అప్రజాస్వామికమని గొంతు చించుకుంటున్నాడే.. ఏపీ‍యూడబ్ల్యూజే అధ్యక్షుడయి కూడా ఏనాడన్నా చిన్న పత్రికల గోడు పట్టించుకున్నాడా.. తనకు లక్షలాధి రూపాయల జీతం ఇచ్చి... యాంకర్ గా ప్రసెంట్ చేసిన సాక్షి ఖాతాలు ఆగిపోగానే..యాడ్స్ ఆగిపోగానే..తన జీతం ఎక్కడ ఆగుతుందో అనో.. లేక జగన్ మెహర్‌బానీ కోసమో..జర్నలిస్టు విలువలు, పత్రికా స్వేచ్ఛ గుర్తొచ్చాయి. కలర్ పేపర్ మాయలో కనుమరుగయిపోయిన కరకు పత్రికల సాక్షిగా... జర్నలిస్టులు కన్నీళ్ల సాక్షిగా... ఎన్నో కుటుంబాల గోస తగిలి ఈ సాక్షి నాశనం కాక తప్పదు. పాలనా వ్యవస్థను పాడు చేసిన వ్యక్తికి పేదవారి శాపం తగలక మానదు. ఓ సోకాల్డ్ జర్నలిస్ట్ మేతావుల్లారా.. ఒక సాక్షికి యాడ్స్ ఆపినపుడు కాదు.. చిన్నపత్రికలు యాడ్స్, అక్రిడేషన్లు ఆపినపుడు కూడా మీ నోరు తెరవండి.. లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

    రిప్లయితొలగించండి