mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

30, డిసెంబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా






జగ్గంపేట లో కొత్త సంవత్సర రాజకీయ సందడి అప్పుడే కనిపిస్తోంది .ఎన్నడు లేని విదంగా జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా కనిపిస్తున్నై .అండర్ బ్రిడ్జే కి పైన,క్రింద పోటాపోటీగా ఫ్లెక్ష్ ఉన్నాయ్ .మూడు పార్టీల నేతలతో (మంత్రి తోట నరసింహం ,వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు ,తెలుగు దేశం నేత జ్యోతుల చంటి బాబు ఫోటోలతో ...ఆయ పార్టీ ల వారు భారీగా  నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు .కాగా జ్యోతుల నెహ్రు అందరి కంటే ముందుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని చెప్పవచ్చు .తన అనుచర గణం తో ప్రతి ఇంటికి మిటాయి,గ్రీటింగ్ కార్డ్ పంపారు 

28, డిసెంబర్ 2011, బుధవారం

ని శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులు తమ దయాగుణం ,




జగ్గంపేట లోని శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులు తమ దయాగుణం ,సామాజిక సేవాగుణం సాటారు.అంధ విద్యార్దుల కోసం అరవై వేలు పోగు చేసి వారికి ఇచ్చారు .కర్సపా డెంట్ రాంబాబు సార్, ప్రిన్సిపాల్ దేవదాస్ పిల్లలను అభినందించారు 

19, డిసెంబర్ 2011, సోమవారం

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!,...ఇదేమిటి విచిత్రం అనుకుంటున్నారా ?   కరెంటు ఉంటె ..భాగేనే ఉంది అనుకుంటాం ..అయితే పగటి పూట కరెంటు ఉంటె మాత్రం జగ్గంపేట జనం తారేత్తిపోతున్నారు......ఇది నిజం.
జగ్గంపేట టౌన్ లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ..అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయత్రం ఆరు వరకు కరెంటు ఉండడం లేదు .....ఈ కోతల్లో ఎప్పుడైనా పొరపాటున కరంటు ఇచ్చారు అంటే జనం భయ పడుతున్నారు ..ఎందుకంటె  ఇచ్చిన కరెంటు ను ఏ అర్ధరాత్రో తీసి నరకం చూపిస్తారన్న భయం ...సోమవారం సంత రోజున ప్రతి చోట ఇదే టాపిక్ ...సాయంత్రం ఆరు గంటలకు ఇవ్వవలసినది ...మూడు గంటలకే ఇవ్వడం ....దీంతో ..ముందుగా ఇచ్చారు .....రాత్రికి ..ఏం జరుగునో అనుకున్నారు ...చూద్దాం 

13, డిసెంబర్ 2011, మంగళవారం

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .మురారి ,జే. కొత్తూరు లలో మంగళవారం దుర్గమ్మ అమ్మావారి తీర్దం ,జాతరలు మొదలయ్యాయి .మురారి లో మొనటి నుంచి జనం వస్తున్నారు .మంగళవారం అశేషం గా వివద దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి అక్కడే వండుకు తిన్నారు .తెల్లవారు జాము నుంచే రద్దీ  ఎక్కువ అయ్యింది .ఇక జే. కొత్తూరు లోనూ భక్తుల సందడి ఎక్కువగా ఉంది 

12, డిసెంబర్ 2011, సోమవారం

సైన్సు పెయర్ ప్రారంభం


దివంగత ఏం ఈ ఓ వెంకట లక్ష్మి జ్ఞాపకార్ధం జగ్గంపేట స్వామీ వివేకానంద స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్సు పెయర్ సోమవారం ప్రారంబమైనది .ఏం ఈ ఓ రమణ పారంబించారు .ఒమ్మి రఘురాం ప్రబృతులు పాల్గున్నారు 

we can watch video on youtube /mettaseema videos 

11, డిసెంబర్ 2011, ఆదివారం

అంకుశం ముఖ్యమంత్రి ఇక లేరు

అంకుశం ముఖ్యమంత్రి  ఏం ఎస్ రెడ్డి ..మల్లె మాల ఇక లేరు . ఎనబై ఏడు సంవత్సరాల మల్లెమాల సినిమా పరిశ్రమలో ముఖ్యలు .బాల రామయణం ద్వారా జూనియర్ యెన్ టి ఆర్ ను పరిచయం చేసింది ఆయనే .ఆయన పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి .హైదరాబాద్ లో స్టూడియో కూడా కట్టారు సిని పరిశ్రమలో అనేక అంశాలతో కూడిన " నా ఆత్మ కథ " వివాదం అయింది .ఈ పుస్తకం లో పలువురు ప్రముఖుల తీరును తూర్పార బట్టారు .

9, డిసెంబర్ 2011, శుక్రవారం

రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి

శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఉచిత డయాబెటిక్ అవగాహన సదస్సు జరుగుతుంది ..ఈ సందర్బం గా రాజముండ్రి రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి చేయనున్నారు .కొత్త కొండబాబు ప్రోగ్రాం కో ఆర్దిన్తర్ గా వ్యవహరిస్తున్నారు .

7, డిసెంబర్ 2011, బుధవారం

జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుండు బయటపడ్డారు

జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుండు బయటపడ్డారు .మంగళవారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ లారి డీకుంది.అయితే చంటిబాబుకు ఏం కాలేదు .కాగే చంటిబాబు ను జిల్లా నేతలతో పాటు నియోజవర్గ అభిమానులు ,కార్యకర్తలు పరామర్శ చేసారు 

6, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది - మంత్రి తోట నరసింహం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది అని మంత్రి తోట నరసింహం విమర్శించారు .జగ్గంపేట లో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ జనానికి మంచి పథకాలూ అందిస్తున్న ప్రభుత్వం పై చంద్రబాబు అవిశ్వాసం పెట్టి ఆబాసు పాలయ్యారని అన్నారు .కాగ రాష్ట్రం లో  నలబై రిజిస్త్రాసన్ కార్యాలయాలకు డబ్బై కోట్లతో సొంత భవనాలు నిర్మించాననున్న్నట్లు  వెల్లడించారు .జగ్గంపేట లో ముప్పై అయిదు లక్షలతొ భవనాలు నిర్మిస్తామనారు 

2, డిసెంబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లో కరెంట్ కోతలు

జగ్గంపేట లో కరెంట్ కోతలు ఊపందుకున్నై? గత మూడు రోజులు గా కోతను పెంచి శీతకాలమే చెమటలు కక్కిస్తున్నారు .జగ్గంపేట పట్టణం లో రాత్రి సమయంలో రెండు గంటలు కొత్త విధిస్తున్నారు .పగటి పూట కోతలు మామూలే .

30, నవంబర్ 2011, బుధవారం

ఘనంగా కందుల వారి పెళ్లి సందడి

కందుల వారి పెళ్లి సందడి ఘనంగా జరిగింది .జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కందుల కొండయ్య దొర మరియు ఆయన సోదరుడు చిట్టిబాబు ల కుమార్తెల పెళ్లి ఒకే రోజు ఒకే ముహూర్తం లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి రాజమండ్రి లో వైభవం గా జరిగింది .ఈ కార్యక్రమానికి జిల్లా లోని తెలుగు దేశం నేతలతో పాటు జ్యోతుల నెహ్రు  దంపతులు వారి అనుచరులు ,  కొర్పు లచ్చయ్య దొర , కాంగ్రెస్స్ నేతలు కూడా వచ్చారు .మంత్రి నరసింహం మాత్రం మొన్నే రాగంపేట వచ్చి కనిపించి వెళ్ళారు .

29, నవంబర్ 2011, మంగళవారం

28, నవంబర్ 2011, సోమవారం

కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం పరిశీలించారు




జగ్గంపేట మండలం లో కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం స్వయంగా తెల్సుకున్నారు .మర్రిపాక ,మామిడాడ ,నరేంద్ర పట్నం తదితర ప్రాంతాలను చూసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు .పలువుర్ రైతులు తమ గోడును అధికారి కి వివరించారు 

చెకుముకి మండల స్తాయి విజేతలు

చెకుముకి మండల స్తాయి పోటీలు ఈరోజు జగ్గంపేట ప్రాధమిక స్కూల్స్ నందు నిర్వహించారు .తెలుగు మీడియం లో గొల్లలగుంట విధ్యారుదులు ,ఆంగ్ల మాధ్యమం లో వివేకానంద స్కూల్ విజేతలగా నిలిచారు .వీరు వచ్చే నెల నాల్గవ తేది ఆదివారం కాకినాడ లో జిల్లా స్తాయి పరేక్ష కు హాజరవుతారు ,

24, నవంబర్ 2011, గురువారం

జగ్గంపేట్ నేతల్లో అననందం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జగ్గంపేట నియోజకవర్గం లో  రైతు పోరు బాట  విజయవంతం కావడం తో దేశం నేతలు ,కార్యకర్తలు ఆనందం తో మునిగి తేలుతునారు.అన్నవరం లో జరిగిన సమావేశం లో జ్యోతుల చంటిబాబు ,కందుల కొండయ్య దొర ,ఎస్ వి ఎస్ అప్పల రాజు లను అభినందించారు .అధినేత లో స్పష్టమైన సంతోషం కనిపించింది అని వారు చెప్పారు .పోరు బాటలో పాల్గున్న అందరికి వారు కృతజ్ఞతలు తెలిపారు .జగ్గంపేట్ నేతల్లో అననందం 

23, నవంబర్ 2011, బుధవారం

chandrabaabu paadyaatra photoes చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పాదయాత్ర ఫోటోలు








తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లోని మర్రిపాక నుంచి ఏలేశ్వరం వరకు పాదయాత్ర చేసారు ఫోటోలు 

22, నవంబర్ 2011, మంగళవారం

డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ -నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు





డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ లను మంత్రి తోట నరసింహం ఈరోజు అందించారు .కార్యక్రమం లో ఇరవై సూత్రా ల పధకం లో జగ్గంపేట మండలాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రదమ స్తానంలో నిలిపి అవార్డ్ అందుకున్న ఎం పిడి ఓ నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు 

19, నవంబర్ 2011, శనివారం

చంద్ర బాబు పర్యటనలో మార్పులు

ఈ నెల  23 తేదిన వచ్చే తెలుగుదేశం అధినేత చంద్ర బాబు పర్యటనలో మార్పులు జరిగాయి .ఆ రోజు మధురపూడి విమాన్స్యం నుంచి కారులో మర్రిపాక చేరుకుంటారు .అక్కడ కార్యకర్తలతో బోజనం అనంతరం పాదయాత్ర మొదలవుతుంది .మర్రిపాక లో ఎండిన పొలాలు చూసి ఇర్రిపాక్ చేరుకొని జ్యోతుల చంటిబాబు ఇంటి వద్ద తెన్నేరు సేవించి కాలి నడకన ఏలేశ్వరం చేరుకొని అక్కిడి బహిరంగ సభలో పాల్గుంటారు 

గొల్లలగుంట స్కూల్ విద్యార్దులు .వనబోజనాల సందడి



జగ్గంపేట మండలం లోని గొల్లలగుంట స్కూల్ విద్యార్దులు ఈ రోజు ఎంతో ఆనందం గా గడిపారు .వనబోజనాల సందడితో గ్రామంలో ని మామిడి తోట కళ కళ లాడింది .జగ్గంపేట క్షేత్రియ పరిషత్ వారు భాజనాలు పెట్టడం తో పాటు పిల్లలకు బుక్స్  పెన్స్ ఇచ్చారు .ఉపాధ్యాయులు వారికి చక్కని ఆటలు ఆడించి బహుమతులు ఇచ్చారు 

18, నవంబర్ 2011, శుక్రవారం

చంద్ర బాబు పర్యటన్ కోసం జగ్గంపేట తెలుగుదేశం పార్టి భారి కసరత్

ఈ నెల ఇరవై మూడున వచ్చే చంద్ర బాబు పర్యటన్ కోసం జగ్గంపేట తెలుగుదేశం పార్టి భారి కసరత్ చేస్తోంది .జగ్గంపేట లో జరిగే బహిరంగ సభ చేయాడానికి ,పాదయాత్ర విజయవంతం చేయాడానికి జిల్లా ఆ పాటీ నేతలు వచ్చి పరిశీలనా జరుపుతున్నారు .నిమ్మకాయల చిన రాజప్ప తో పాటు ఏం ఎల్ ఏ లు వచ్చారు .జిల్లా కమిట్టీ మీటింగ్ కూడా శనివారం జగ్గంపేట లో జరుపుతున్నారని ఎస్ వి ఎస్ అప్పలరాజు చెప్పారు .

17, నవంబర్ 2011, గురువారం

చంద్రబాబు జగ్గంపేట వస్తున్నారు

ఈ నెల ఇరవై మూడవ తేదిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగ్గంపేట వస్తున్నారు .అప్పనపాలెం నుంచి మర్రిపాక వరకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది .కాగ జగ్గంపేట లో భారి బహిరంగ సభ జరపడానికి ఆ పార్టి కసరత్ చేస్తోంది .జ్యోతుల చంటి బాబు ,ఎస్ వి ఎస్ అప్పలరాజు, కందుల కొండయ్య దొర ప్రబృతులు ఈ ఏర్పాట్లలో నిమగ్నం అవుతునారు 

16, నవంబర్ 2011, బుధవారం

ఖో ఖ్లో లో గొల్లలగుంట

పైకా ఆటల పోటీలలో ఖో ఖ్లో లో  గొల్లలగుంట బాలికల జట్టు మరో విజయం సాధించింది .జగ్గంపేట మండలం లో విజేత గా నిలిచిన ఈ జట్టు తాజాగా పెద్దాపురం డివిజన్ లో ద్వితీయ స్తానం పొందింది .కిర్లంపూడి జట్టు ప్రధమ స్థానం లో నిలిచింది .కిర్లంపూడి జట్టు నుంచి అయిదుగురు ,గొల్లలగుంట జట్టు నుంచి నలుగురు బాలికలను జిల్లా జట్టు కు ఎంపిక చేసారు .కాగా గొల్లలగుంట వ్యాయమ ఉపాధ్యాయురాలు వి .దేవి రాష్ట్ర స్తాయిలో విద్యార్దులకు శిక్షణ ఇచ్చే కోచ్ గగ ఎంపిక అయ్యారు 

15, నవంబర్ 2011, మంగళవారం

వస్త్ర దుకాణాలులు బంద్

వ్యాట్ పన్నును నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు  మంగళ వారం బంద్ పాటించారు .మొత్తం దుకాణాలు అన్ని మూతపడ్డాయి .రేపు బుధవారం కూడా దుకాణాలు తెరవరు 

అసలైన ఆదర్స రైతులు ఎవ్వరో తేలిపోనుంది!

అసలైన ఆదర్స రైతులు ఎవ్వరో ఈరోజు తేలిపోనుంది .రైతులకు అవగాహన కల్పించడానికి వై ఎస్ సర్కార్ వీరిని ఏర్పాటు చేసారు .వీరికి నెలకు గౌరవ వేతనం కూడా చెల్లిస్తున్నారు .అయితే నూటికి పది శాతం కూడా సరిగ్గా పనిచేయ్యండం లేదు అని అధికారులే అంచనా వేస్తున్నారు .గతం లో కొంత మందిని తొలగించారు .నేడు మళ్లి కొందరు బయటకు వెళ్ళబోతున్నారు . ఎందుకంటె వీరికి పరీక్ష నిర్వహించి పాస్స్ అయిన వారినే కొన సాగిస్తారు .ఈ వార్త తెలియగానే వీరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నై .ఏ ప్రశ్నలు అడుగుతారో నని హడలి పోతున్నారు .ఇప్పటివరకు నెల నెల డబ్బులు తీసుకోవడం తప్ప సాటి రైతుకు సాహాయ పడధామన్న కనీస ఆలోచన చెయ్యని చాల మంది ..ఉద్యోగం ఊడితే డబ్బులు పోతాయన్న ధ్యాస లోనే కనిపిస్తూ ఏదోలా మేనేజ్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్న్నారు .

ప్రతిభావంతులైన చిన్నారులకు జగ్గంపేట వాకర్స్ క్లబ్ అవార్డ్స్

ప్రతిభావంతులైన చిన్నారులకు జగ్గంపేట వాకర్స్ క్లబ్ అవార్డ్స్ ప్రదానం చేసింది .బాలల దినోత్సవం సందర్బం గా క్లబ్ నిర్వహించిన వ్యాస ,వక్తృత్వ ,డ్రాయింగ్ పోటీలలో విజేతలకు సోమవారం రాత్రి బహుమతులు ఇచ్చారు .తిరుమలేశా అధినేత రాంప్రసాద్ ముఖ్య అదితి గా వచ్చారు .కొత్త కొండబాబు ,కర్రి సత్తిబాబు,కంచర్ల బాబు వెంకట నాగ రాంబాబు ప్రబృతులు పాల్గున్నారు 

జగ్గంపేట మండలాన్ని కూడా కరువు మండలం గా గుర్తించాలని వై ఎస్ ఆర్ పార్టి నేత జ్యోతుల డిమాండ్

తీవ్ర కరువుతో అల్లుడుతున్న జగ్గంపేట మండలాన్ని కూడా కరువు  మండలం గా గుర్తించాలని వై ఎస్ ఆర్ పార్టి నేత జ్యోతుల డిమాండ్ చేసారు .గండేపల్లి ,గోకవరం తో పాటు మొత్తం ఏడు మండలలలను కరువు మండలాలు గా సర్కార్ ప్రకటించింది .దీని పై నెహ్రు స్పందిస్తూ కొన్ని గ్రామాల్లో అసలు పంటలు వేయని జగ్గంపేట మండలం లో తీవ్ర కరువు ఉందని ఇది మంత్రి గారికి కనిపించ లేదా అని నెహ్రు ప్రశ్నించారు 

14, నవంబర్ 2011, సోమవారం

బాలల దినోత్సవం

బాలల దినోత్సవం ఆయా స్కూల్స్ నందు సంప్రదాయబద్దం గగ జరుపుకున్నారు .నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .కొన్ని చోట్ల ర్యాలి చేసారు .

11, నవంబర్ 2011, శుక్రవారం

భూపోరాటాలు .ఆగవు -కర్నాకులు వీరాన్జనేయులు






పేద ప్రజల బతుకులు మారే వరకు ఏ భూపోరాటాలు ఆగవని ఆంధ్ర ప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రదాన కార్య దర్శి కర్నాకులు వీరాన్జనేయులు చెప్పారు .జగ్గంపేట లో అమర వీరుల సంస్మరణ సభ సందర్భం గా వీరాన్జనేయులు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం లో కూడా ఇంకా భూస్వాముల చేతుల్లో వేలాది ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నదని అయన అంటూ దీని కోసం పోరాటాలు చేస్తూ ఉన్నామని అయితే బూటకపు కేసులు బనాయించి పేద జనాని ఇబ్బంది పెడుతున్నరన్నారు

కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వేడుకలు జగ్గంపేట పరిసర ప్రాంతాలలో సంప్రదాయబద్దం గా జరుపుకున్నారు .ముఖ్యంగా పొర్ణమి వ్రతాలు కలవారు ఎంతో నిస్టాగా ఉపవాసం చేసి పూజలు చేసారు .సాధారణం గా పూజలు ఎక్కువగా మహిళలు మాత్రమె చేస్తారు .అయితే కొందరికి మాత్రేమే ఉంటాయి .ఇంట్లో పురుషులు సైతం ఉదయం నుంచి ఉపవాసం ఉంది సాయంత్రం పూజలు చేసే వరకు ఏమి తినరు ,మహిళలు అయితే పున్న్నమి చంద్రుడిని చూసే వరకు ఏమి ముట్టుకోరు .గుడి వెళ్లి పూజలు చేస్తారు .గురువారం జగ్గంపేట లో ఎక్కడ చూసిన ఇటువంటి సందడే కనిపించింది ,

7, నవంబర్ 2011, సోమవారం

విద్యార్దినులు కు గోల్డ్ ,సిల్వర్ మెడల్స్ ప్రదానం




జగ్గంపేట వాకర్స్ హెల్త్ క్లబ్ ఆద్వర్యం లో ఆదివారం రాత్రి టి .ఎస్ యెన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరుపున పదవ తరగతి ,ఇంటర్ లో మంచి మార్కులు సాదించిన విద్యార్దినులు కు గోల్డ్ ,సిల్వర్ మెడల్స్ ప్రదానం చేసారు .రెడ్డి కుమార్తె శారద ,భార్య శ్యామల ముఖ్య అతిధులు గా విచ్చేశారు ,

6, నవంబర్ 2011, ఆదివారం

వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతల స్పందనకుకాంగ్రెస్స్ నేతలు ప్రతి స్పందించారు

శనివారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతల స్పందనకుకాంగ్రెస్స్ నేతలు ఆదివారం  ప్రతి స్పందించారు .గుల్ల ఏడుకొండలు ,కోర్పు లచ్చయ్య దొర ,బండారు రాజ ,రామకుర్తి మూర్తి ,  కొండ్రోతు పైడియ్య,  అడబాల కుందరాజు, ఓబిన్ని సత్యనారాయణ రత్న కుమారి ,అడబాల ఆంజనేయులు ,గపూర్, అప్పాజీ  ,ప్రబృతులు పాల్గున్న సమావేశం లో ప్రతి విమర్శలు చేసారు .సి ఏం సభ విజయవంత కావడం తో  మంత్రి తోట నరసింహం  మరియు కాంగ్రెస్స్ పైన బురద జల్లు తున్నారని విమర్శించారు .ఎన్ని ట్రిక్కులు చేసిన మూడవ సారి కూడా తమ నేత చేతుల్లో చిత్తుగా ఓడిపోక తప్పదన్నారు వై ఎస్ ఆర్ నేతలు మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉన్నాయన్నారు .పార్టీలు మారితే ప్రయోజనం ఉండదు .రావులమ్మ తల్లి దగ్గర తెలుగ్డు దేశం పార్టీని వీడనని చెప్పి ప్రమాణం చేసి తప్పారు .ఓడిపోయారు .చాగల్నాడు ను సగంలో వదిలేసారు 

వాలీబాల్ ఆటగాళ్ళ కు తెలుగుదేశం పార్టీ వాలీబాల్ కిట్ పంపిణి


జగ్గంపేట లోని వాలీబాల్ ఆటగాళ్ళ కు తెలుగుదేశం పార్టీ వారు ఆదివారం వాలీబాల్ కిట్ పంపిణి చేసారు .జ్యోతుల చంటిబాబు ,ఎస్ వి ఎస్ అప్పల రాజు, తాన్దోతు రామారావు నిమ్మగడ్డ సత్యనారాయణ ,వి జోగారావు ,కర్రి శ్రీను ,గంట రమణ ప్రబృతులు పాల్గున్నారు .రాష్ట్ర స్థాయిలో ఆడిన డి రాంబాబు ,డి ,చిన్నలని వారు అభినందించారు 

జగ్గంపేట లో ఫించన్లు పంపిణి సభలో మంత్రి మాటలు వీడియో

జ్యోతుల విమర్శించే అర్హత మీకు ఎక్కడిది ? ఏ ఎస్ ఆర్ నేతల ఆగ్రహం వీడియో

జ్యోతుల విమర్శించే అర్హత మీకు ఎక్కడిది ? ఏ ఎస్ ఆర్ నేతల ఆగ్రహం  వీడియో video

మంత్రిచే జగ్గంపేట లో ఫించన్లు పంపిణి


రచ్చబండ లో దరఖాస్తు చేసుకున్న పలువురికి శనివారం మంత్రి జగ్గంపేట లో ఫించన్లు పంపిణి చేసారు .కేవలం రెండు రోజుల్లో సి ఏం సభను ను విజయవంతం చేసిన ఘనత జగ్గంపేట ప్రజలేదే నని చెప్పారు .గత జగ్గంపేట పాలకుల కంటే చాల మెరుగ్గా సేవలు చేస్తున్నామన్నారు .

5, నవంబర్ 2011, శనివారం

మంత్రి తోట గురించి జ్యోతుల నెహ్రు ఏమ్మన్నారు?

మంత్రి తోట గురించి జ్యోతుల నెహ్రు ఏమ్మన్నారు?  వీడియో VIDEO

చోటాలు వీళ్ళు -వై ఎస్ ఆర్ నేతల విమర్శ


తమ నేత జ్యోతుల నెహ్రూను విమర్శించే అర్హత జగ్గంపేట చోట కాంగ్రెస్ కు లేదని ఏ ఎస్ ఆర్ పార్టి నేతలు విమర్శించారు .శుక్రవారం జగ్గంపేట లో కాంగ్రెస్ నేతలు జ్యోతుల పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పదించారు .మారిశెట్టి  బద్రం ,జీను మణిబాబు,అత్తులూరి నాగబాబు ,ఒమ్మి రఘురాం ,బోర సత్తిబాబు వరసాల ప్రసాద్ ,నీలాద్రిరాజు,ఏ .భాస్కర రావు ,పాలచర్ల సత్యనారాయణ   ప్రబృతుల  శనివారం మాట్లాడారు .ఈ చోటాల మా నాయకుణ్ణి విమర్శించేది ? అంటూ వారిపై విమర్శలు చేశారు .సి ఏం ను తీసుకు వచ్చి వీరు ఏమి సాధించారని వారు ప్రశ్నించారు .బెజవాడ సభ కు  జగన్ సభ కు వచ్చి "తాను  వచ్చానని చెప్పవద్దని " చెప్పిన ఓ చోట నేత ఈ రోజు నెహ్రు పై విమర్శ చెయ్యండం  విడ్డూరం గా  ఉంది .చిరంజీవి ని విమర్శించిన  వారే ఈరోజు చంక పెట్టుకున్నారు అనే విమర్శించారు .దమ్ము ఉంటె స్వతత్రం గా మీ నాయకుణ్ణి  రాజేనామ చేసి మా నేత నెహ్రు తో స్వతంత్రంగా పోటి చెయ్యండి ..అని సవాల్ విసిరారు .రాజశేఖర రెడ్డి  దయ వల్లే తోట మంత్రి అయ్యారు . కుందరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు .పుష్కర పదకాన్ని తెచ్చింది ఎవరు /? స్థాయి తెల్సుకోకుండా  మాట్లాడితే బావుండదు  అని హెచ్చరించారు .

4, నవంబర్ 2011, శుక్రవారం

కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా

జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా స్పందించారు .బండారు రాజ ,గుల్ల ఏడుకొండలు ,ఓబిన్ని సత్యనారయన్ ,శ్రీ బాబు ,గఫూర్ మాట్లాడుతూ మంత్రి తోట నరసింహం ఏ పనులు చేసారో ప్రజలకు తెల్సునని ..అధికారం లేక నెహ్రు ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు .ప్రజలకు ఇబ్బంది అని తెల్సిన జగ్గంపేట లో ఎందుకు బ్రిడ్జి కట్టకుండా ఆపలేక పోయారని ప్రస్నిచారు .తెలుగు దేశం లో చేసిన పనులు చెబుతున్నారని ..మూడు పార్టీలు మారిన మీరు ఏ ఎస్ ఆర్ పార్టి తరుపున ఏం చేశారన్నారు ,నాడు ధన యజ్ఞం చేసారని విమర్శా చేసిన ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఈనాడు ఆయన గురించి ఎలా మాట్లుతున్నరన్నారు 

మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టిన జ్యోతుల నెహ్రు

తన హయం తో పోల్చుకుంటే  ప్రస్తుత మంత్రి చేసిన అభివృద్ధి చాల తక్కువ అని వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు పేర్కున్నారు.జగ్గంపేట లో అయన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ ,మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టారు .మెట్టసీమకు సాగు నీరు అందించే పుష్కర తానూ సాదిన్చానని ...దానిని  పరిపూర్ణం తీర్చి దిద్దలేక పోయారని విమర్శించారు .నియోజ వర్గం లో ఇంకా పలు గ్రామాలకు మంత్రి మంచి నీరు అందించా లేక పోయారని చెప్పారు .రచ్చబండ లో అధికార దుర్వినియాగం జరిగిందని ...ప్రయవేట్ స్కూల్స్ బస్సులు లాక్కుని ప్రజలను తరలించారని ...దుయ్యబట్టారు .సి ఏం జగ్గంపేట లో ఇచ్చిన వినతి పత్రాలు ఇక్కడే వదిలి పోవడాన్ని బట్టి కిరణ్ సర్కారుకు ప్రజలపై ఎంత శ్రద్ద ఉందొ అర్ధం అవుతున్నదని అన్నారు .జరిగిన అభివృద్ధి పై న మరియు వ్యక్తి గత విషయాలపై కూడా తానూ చర్సిన్చాడానికి తానూ సిద్దం అని సవాల్ చేసారు 

3, నవంబర్ 2011, గురువారం

జగ్గంపేట లో సి ఏం సభ వీడియో 1

సి ఏం జగ్గంపేట సభలో పదనిసలు

సి ఏం జగ్గంపేట సభలో  పదనిసలు 
  • ముఖ్యమంత్రి కి మంత్రి తోట తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు .పెద్దాపురం ఏం ఎల్ ఏ  పంతం గాంధి ని పోలీసులు అడ్డుకోవడంత్  ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు .
  • వచ్చి రాగానే సి ఏం రూపాయి కి కిలో బియ్యం పథకం ప్రారంబించారు .
  • మాజీ సి ఏం వై ఎస్ పేరును మంత్రి పినేపే ,సి ఏం కిరణ్ ప్రస్తావించినపుడు పలువురు ప్రజలు స్పదించారు .
  • సి ఏం బోజనం కోసం వస్తారని జగ్గంపేట లోనే ట్రావెలర్స్ బంగ్లా ఆఘమేఘాలపై ముస్తాబు చేసిన ...సి ఏం మాత్రం సభ వేదిక ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్ లోనే భోజనం చేసారు .
  • ఉదయం పదకొండు సమయానికి  సభ పలసగా ఉన్నప్పటికీ సి ఏం వచ్చే సరికి వేసిన ఇరవయ్ వేల కుర్చీలు నిండి పోయి ఇంకా చాల మంది బయట నిలబడ్డారు .
  • తమ సమస్యలు తెలపడానికి సి ఏం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన కంప్యూటర్ టీచర్స్ను అరెస్ట్ చేసి సి ఏం వెళ్ళే వరకు వదిలి పెట్ట లేదు .
  • జగ్గంపేట లోనే సమస్యాలను మంత్రి సి ఏం ఎదురుగానే ప్రస్తావించి అనంతరం పక్కన కూర్చుని వివరించారు .

2, నవంబర్ 2011, బుధవారం

cm meeting success in jaggampeta జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం









జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం అయ్యింది .మధ్యాహ్నం రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో  నేరుగా సభాప్రాంగానాన్ని చేరుకున్నారు .మంత్రులు ,అధికారులు ఘన స్వాగతం పలికారు .అనంతరం మంత్రి తోట నరసింహం అద్వర్యం లో జరిగిన సభలో పాల్గున్నారు .రూపాయికే కోలో బియ్యం పథకం ప్రారంబించారు .జగ్గంపేట మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే పథకాన్ని ప్రారంబించారు .గండేపల్లి మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే మరో పథకానికి శంకుస్థాపన చేసారు .