mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
జగ్గంపేట టౌన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జగ్గంపేట టౌన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, డిసెంబర్ 2011, సోమవారం

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!,...ఇదేమిటి విచిత్రం అనుకుంటున్నారా ?   కరెంటు ఉంటె ..భాగేనే ఉంది అనుకుంటాం ..అయితే పగటి పూట కరెంటు ఉంటె మాత్రం జగ్గంపేట జనం తారేత్తిపోతున్నారు......ఇది నిజం.
జగ్గంపేట టౌన్ లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ..అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయత్రం ఆరు వరకు కరెంటు ఉండడం లేదు .....ఈ కోతల్లో ఎప్పుడైనా పొరపాటున కరంటు ఇచ్చారు అంటే జనం భయ పడుతున్నారు ..ఎందుకంటె  ఇచ్చిన కరెంటు ను ఏ అర్ధరాత్రో తీసి నరకం చూపిస్తారన్న భయం ...సోమవారం సంత రోజున ప్రతి చోట ఇదే టాపిక్ ...సాయంత్రం ఆరు గంటలకు ఇవ్వవలసినది ...మూడు గంటలకే ఇవ్వడం ....దీంతో ..ముందుగా ఇచ్చారు .....రాత్రికి ..ఏం జరుగునో అనుకున్నారు ...చూద్దాం 

11, నవంబర్ 2011, శుక్రవారం

కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వేడుకలు జగ్గంపేట పరిసర ప్రాంతాలలో సంప్రదాయబద్దం గా జరుపుకున్నారు .ముఖ్యంగా పొర్ణమి వ్రతాలు కలవారు ఎంతో నిస్టాగా ఉపవాసం చేసి పూజలు చేసారు .సాధారణం గా పూజలు ఎక్కువగా మహిళలు మాత్రమె చేస్తారు .అయితే కొందరికి మాత్రేమే ఉంటాయి .ఇంట్లో పురుషులు సైతం ఉదయం నుంచి ఉపవాసం ఉంది సాయంత్రం పూజలు చేసే వరకు ఏమి తినరు ,మహిళలు అయితే పున్న్నమి చంద్రుడిని చూసే వరకు ఏమి ముట్టుకోరు .గుడి వెళ్లి పూజలు చేస్తారు .గురువారం జగ్గంపేట లో ఎక్కడ చూసిన ఇటువంటి సందడే కనిపించింది ,

6, నవంబర్ 2011, ఆదివారం

వాలీబాల్ ఆటగాళ్ళ కు తెలుగుదేశం పార్టీ వాలీబాల్ కిట్ పంపిణి


జగ్గంపేట లోని వాలీబాల్ ఆటగాళ్ళ కు తెలుగుదేశం పార్టీ వారు ఆదివారం వాలీబాల్ కిట్ పంపిణి చేసారు .జ్యోతుల చంటిబాబు ,ఎస్ వి ఎస్ అప్పల రాజు, తాన్దోతు రామారావు నిమ్మగడ్డ సత్యనారాయణ ,వి జోగారావు ,కర్రి శ్రీను ,గంట రమణ ప్రబృతులు పాల్గున్నారు .రాష్ట్ర స్థాయిలో ఆడిన డి రాంబాబు ,డి ,చిన్నలని వారు అభినందించారు 

31, అక్టోబర్ 2011, సోమవారం

ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే - తోట నరసింహం

రెండవ తేదిన జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే నని మంత్రి తోట నరసింహం తన పార్టీ వారికి నొక్కి చెప్పారు .ఈరోజు జగ్గంపేట లో కాంగ్రెస్స్ కార్యకర్తల మీటింగ్ ప్రత్యేకంగా జరిపారు .ముఖ్యమైన నేతలు హాజరయ్యారు .సి ఎం సభ నియోజవర స్థాయి లోనే జరుగుతున్నా ....జన సమీకరణ భారీగా ఉండాలని ....నియోజవర్గానికి పేరు వచ్చే విధంగా ప్రజలను తీసుకు రావాలని అన్నారు .వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు .కార్య క్రమంలో నేతలు కోర్పు లచ్చయ్య దొర ,అడబాల కుందరాజు, బండారు రాజ ,వత్సవాయి రాజు ,మూర్తి అయ్యన్న ,పైడియ్య,ప్రబృతులు పాల్గున్నారు .తదుపరి ఆయన సి ఎం సభ జరిగే ప్రాంగణాన్ని కలక్టర్ ,ఎస్ పి కల్సి సదర్సించారు .

23, అక్టోబర్ 2011, ఆదివారం

compter teachers to be attack కంప్యూటర్ టీచర్స్ నిరసన తీవ్ర తరం



కంప్యూటర్ టీచర్స్ తమ నిరసన తీవ్ర తరం చేస్తున్నారు .నేత ల పై ఒత్తిడి తేవడానికి సిద్దమయ్యారు .ఈ నెల ఇరవై నాలుగు ,ఇరవై తేదిలలో మంత్రి ఇంటిని ముట్టడించడం ,ఇరవై ఏడు నుంచి హైదరాబాద్ లో రిలే దీక్ష లు ..ముప్పై ఒకటిన చలో అసెంబ్లీ చేయ్యనున్నట్లు సంఘ నేత పడాల బాలాజీ ,రాంపండు చెప్పారు 

19, అక్టోబర్ 2011, బుధవారం



జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది .చైర్మన్ గా అడబాల కుండరాజు ,పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేసారు .మంత్రి తోట నరసింహం ముఖ్య అదితి గా హాజరయ్యారు .జిల్లా కు చెందినా పలువురు ప్రజా ప్రతినిదులు ,కాంగ్రెస్ నేతలు ,జగ్గంపేట నియోజవర్గ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు .తులా కామ్ప్లెక్ష్ నందు ఈ సందడి జరిగింది

16, అక్టోబర్ 2011, ఆదివారం

కంప్యూటర్ టీచర్లు కు అఖిల పక్ష నేతల మద్దతు


నెల రోజుఅల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించు కోక పోవడం పై కంప్యూటర్ టీచర్లు మంది పడుతున్నారు .ఎన్నో విధాలుగా ఆందోళన చేస్తున్న వారు అఖిల పక్ష నేతల మద్దతు తో ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు సంఘ నేత పడాల బాలాజీ తెలిపారు .