mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
జగ్గంపేట టౌన్ న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జగ్గంపేట టౌన్ న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, డిసెంబర్ 2011, సోమవారం
సైన్సు పెయర్ ప్రారంభం
9, డిసెంబర్ 2011, శుక్రవారం
రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి
శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఉచిత డయాబెటిక్ అవగాహన సదస్సు జరుగుతుంది ..ఈ సందర్బం గా రాజముండ్రి రెడ్ ఎఫ్ ఏం వారు సరదా సందడి చేయనున్నారు .కొత్త కొండబాబు ప్రోగ్రాం కో ఆర్దిన్తర్ గా వ్యవహరిస్తున్నారు .
4, నవంబర్ 2011, శుక్రవారం
మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టిన జ్యోతుల నెహ్రు
తన హయం తో పోల్చుకుంటే ప్రస్తుత మంత్రి చేసిన అభివృద్ధి చాల తక్కువ అని వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు పేర్కున్నారు.జగ్గంపేట లో అయన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ ,మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టారు .మెట్టసీమకు సాగు నీరు అందించే పుష్కర తానూ సాదిన్చానని ...దానిని పరిపూర్ణం తీర్చి దిద్దలేక పోయారని విమర్శించారు .నియోజ వర్గం లో ఇంకా పలు గ్రామాలకు మంత్రి మంచి నీరు అందించా లేక పోయారని చెప్పారు .రచ్చబండ లో అధికార దుర్వినియాగం జరిగిందని ...ప్రయవేట్ స్కూల్స్ బస్సులు లాక్కుని ప్రజలను తరలించారని ...దుయ్యబట్టారు .సి ఏం జగ్గంపేట లో ఇచ్చిన వినతి పత్రాలు ఇక్కడే వదిలి పోవడాన్ని బట్టి కిరణ్ సర్కారుకు ప్రజలపై ఎంత శ్రద్ద ఉందొ అర్ధం అవుతున్నదని అన్నారు .జరిగిన అభివృద్ధి పై న మరియు వ్యక్తి గత విషయాలపై కూడా తానూ చర్సిన్చాడానికి తానూ సిద్దం అని సవాల్ చేసారు
2, నవంబర్ 2011, బుధవారం
cm meeting success in jaggampeta జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం
జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం అయ్యింది .మధ్యాహ్నం రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో నేరుగా సభాప్రాంగానాన్ని చేరుకున్నారు .మంత్రులు ,అధికారులు ఘన స్వాగతం పలికారు .అనంతరం మంత్రి తోట నరసింహం అద్వర్యం లో జరిగిన సభలో పాల్గున్నారు .రూపాయికే కోలో బియ్యం పథకం ప్రారంబించారు .జగ్గంపేట మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే పథకాన్ని ప్రారంబించారు .గండేపల్లి మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే మరో పథకానికి శంకుస్థాపన చేసారు .
1, నవంబర్ 2011, మంగళవారం
,పోరంబోకు భూములు పేదలకు
30, అక్టోబర్ 2011, ఆదివారం
జిల్లా కలక్టర్ ఆకస్మికం గా వసతి గృహాలను తనిఖి
cm tour at jaggampeta on nov 2ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు
ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు ప్రారంబమైంది .వచ్చే నెల రెండవ తేదిన సి ఏం కిరణ్ కుమార్ జగ్గంపేట వస్తున్నారు .రూపాయి కిలో పథకాన్ని జిల్లాలో ఇక్కడనుంచే ప్రారంబిస్తారు .సభ జరిగే ప్రదేశం గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు .ఆదివారం సెలవు దినం మరియు నాగుల చవితి అయినప్పటికీ జిల్లా,పెద్దాపురం డివిజన్ ,మండల అధికారులు ఉదయమే జగ్గంపేట వచ్చి స్తలాలు పరిశీలించారు .ఇదివరకు సోనియా సభ జరిగిన ఆదిత్య ఆసుపత్రి ప్రక్క స్తలాని ఎంపిక చేసారు .హెలీ పాడ్ కూడా ఆ పక్కనే నిర్మిస్తారు .
29, అక్టోబర్ 2011, శనివారం
జగ్గంపేట లో అయ్యప్ప పడిపూజ
జగ్గంపేట లో శనివారం అయ్యప్ప పడిపూజ ,పెడతుల్లు ఘనంగా జరిగాయి .మావిళ్ళపల్లి కృష్ణ ,కుమారుడు అయ్యప్ప ఆధ్వర్యం లో వారి ఇంటి దగ్గర నిర్వహించారు .పరిసర గ్రామాలనుంచి అయ్యప్ప భక్త్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేసారు .పద్దేన్మిది మెట్లు ...అరటి బోదె లతో అందమైన మండపం నిర్మించి ...శబరిమలై లో చేసినట్టు రకరకాలా పూజలు అభిషేకాలు చేసారు .అయ్యప్పలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది .
వెంకట లక్ష్మి మృతికి .సంతాపం
జగ్గంపేట ఏం ఈ ఓ వెంకట లక్ష్మి మృతికి పలువురు తమ సంతాపాన్ని తెలిపారు .కొందరు రాజమండ్రి వెళ్లి బౌతిక కాయని సందర్శించి వచ్చారు .ఏం డి ఓ నాతి బుజ్జి ,ఎక్ష్ ఏం పి పి మారిసెట్టి పాపరత్నం భద్రం ,యూ టి ఎఫ్ నాయకులు వెళ్ళిన వారిలో ఉన్నారు .కాగ శుక్రవారం జగ్గంపేట లో సంతాప సభ జరిగింది .ఈ సందర్బంగా ఆమె సేవలను పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు
27, అక్టోబర్ 2011, గురువారం
jaggampeta meo dead మండల విద్య శాఖాధికారి వి .వెంకట లక్ష్మిమృతి
మండల విద్య శాఖాధికారి వి .వెంకట లక్ష్మి గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు .గత మూడు నెలలుగా ఆమె కాన్సర్ వ్యాధి తో భాద పడుతున్నారు .ఆరేళ్ళుగా ఆమె జగ్గంపేట మండలం లోనే పని చేస్తునారు .ఆమెకు భర్త ,ఇద్దరు పిల్లలు .ఏ ఈ ఓ మృతి కి సంతాప సూచకంగా శుక్రవారం మండలం లోని ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూల్స్ మూత పడుతున్నాయి .
22, అక్టోబర్ 2011, శనివారం
eye camp at svn techno shcool శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ విద్యార్దులకు ఉచితంగా కంటి పరీక్షలు
computer teachers begging at jpt భిక్షాటన
21, అక్టోబర్ 2011, శుక్రవారం
జగ్గంపేట లోఅమరవీరుల సంస్మరణ దినోత్సవం
అమరవీరుల సంస్మరణ దినోత్సవం జగ్గంపేట లో ఘనం గా నిర్వహించారు .సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో జగ్గంపేట కు చెందిన పలు స్కూల్స్ చిన్నార్లు,పెద్దలు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేస్తూ భారి ర్యాలి లో పోల్గున్నారు .కాగా సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో విద్యార్దులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు
16, అక్టోబర్ 2011, ఆదివారం
రావులమ్మ తల్లి దగ్గరసింహ ద్వారం ఏర్పాటు-మంత్రి తోట నరసంహం

మంత్రి తోట నరసంహం ఆదివారం జగ్గంపేట లోని రావులమ్మ తల్లి ని దర్శించుకున్నారు .పూజలు చేసారు .ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ రావులమ్మ తల్లి అంటే ఎంతో తనకు నమ్మకమని రెండువేల నాలుగు ఎన్నికల దగ్గర్నుంచి తానూ ముందుగా రావులమ్మ తల్లి ఆశీస్సులు అందుకుని ప్రచారం మొదలు పెట్టడం ఆనవాయితి అని చెప్పారు .తల్లి దగ్గర సరి కొత్త శోభ కనిపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేసారు .త్వరలోనే రోడ్ వేస్తారని ....ఆలాగే తన వంతు గా రోడ్ దగ్గర సింహ ద్వారం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు
13, అక్టోబర్ 2011, గురువారం
world health day at jaggampeta జగ్గంపేట లో దృష్టి దినోత్సవం
దృష్టి దినోత్సవం సందర్భంగా జగ్గంపేట లోని లయన్స్ కోడూరి రంగారావ్ జిల్లా కంటి ఆసుపత్రి నందు పళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు .కొత్తగా కొనుగోలు చేసిన కంటి యంత్రాన్ని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయకుమార్ .కొత్త కొండ బాబు విరాళంగా ఇచ్చ్సిన శీతల యంత్రం ను గవర్నర్ డి వి ఎస్ రాజు (రమేష్ ) ప్రారంబించారు . ఈ రోజు చాల మందికి పరీక్షలు జరిపి ఉచితం గా మందులు ఇచ్చారు .కార్యక్రమం లో కొండబాబు ,డాక్టర్ భషీర్ లయన్స్ సభ్యులు పాల్గున్నారు .
11, అక్టోబర్ 2011, మంగళవారం
అన్నదాతలతో వానదేవుడు ఆటలాడుకుంటున్నాడు.
అన్నదాతలతో వానదేవుడు ఆటలాడుకుంటున్నాడు.పంట వేసిన తర్వాత మెట్టసీమ లో ఎక్కడ జడివాన లేదు .దీంతో వర్శదారంగా వేసే పంటలతో పాటు ..కరంట్ కష్టాలు గల బోర్ల దగ్గర పంటలు ఎండుతున్నై .ఇప్పుడైనా కాస్త వర్షం పడితే కొద్ది గా అయిన పంట చేస్తికి వస్తుందని కర్షకులు ఎదురు చూస్తున్నారు .గత రెండు రోజులుగా ఆకశం లో మబ్బులు చూసి అన్నదాత ఆనందం పడే లోపే అది ఆవిరి అవుతోంది ......చిన్న పాటి జల్లులు తప్ప వర్షం లేదు ...ఏ గంట లో నైన వాన దేవుడు కరుణించక పోతాడా అన్న గంపెడాశతో ఎదురుచూస్తున్నాడు
10, అక్టోబర్ 2011, సోమవారం
ఎన్నాళ్ళ కు గుర్తోచ్చమే వాన !
ఎన్నాళ్ళ కు గుర్తోచ్చమే వాన ! అంటూ ...ఈరోజు వర్షం కురిసింది .చిటపట చినుకులతో కాస్త సాయత్రం సందడి చేసింది .వాతావరణం కాస్త కూల్ అయిన ...పంటలకు ఉపయోగే పడే విధంగా తగిన కనీస వర్షం కురియలేదు .ఇప్పటికే పలు పంటలు ఎండి పోతున్నాయి .మంచి వర్షం కురితే పైరు మేలు జరుగుతుంది .
9, అక్టోబర్ 2011, ఆదివారం
jakkampudi with jaggampeta జక్కంపూడి రామ్మోహన్ రావు కు జగ్గంపేట కు ఎంతో అనుభందం ఉంది


జక్కంపూడి రామ్మోహన్ రావు కు జగ్గంపేట కు ఎంతో అనుభందం ఉంది .కాంగ్రెస్స్ పార్టి రథ సారధి గా జక్కంపూడి జగ్గంపేట లో అనేక కార్య క్రమాల్లో పాల్గొన్నారు ...నియోజవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మనో ధ్యరయం అందించేవారు .ముఖ్యంగా డి సి సి జిల్లా నేత గా ,తెలుగు దేశం హయాంలో గట్టి ప్రతి పక్షం గా పనిచేసారు .అప్పటి జిల్లా టి డి పి అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు తో పలుమార్లు రాజకీయం గా డీ కున్నారు .తోట వెంకట చలం ఆకష్మిక మృతి సమయంలో ఆయన చాల సమయస్పూర్తి గా మెలిగి ఆ కుటుంబానికి న్యాయం చేసారు .చలం చనిపోయిన వెంటనే అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్ చలం కుటుంబానికి ఇప్పిస్తానని మాట ఇచ్చి ఆ ప్రకారం తమ్ముడు తోట నరసింహం కు సీటు ఇప్పించారు .కాగ ఆయన కుటుంబం నేడు వై ఎస్ ఆర్ పార్టి లో ఉంది .ఆయన మృతి కి అటు మంత్రి తోట నరసింహం ,ఇటు జ్యోతుల నెహ్రు తో పాటు అన్ని పార్టీల నేతలు అభిమానులు తమ సంతాపాన్ని తెలిపారు
వికలాంగుల మండల సమైక్యలు ఏవి ?
వికలాంగులను ఇందిరా క్రాంత పథం (ఐ కే పి) లో చేర్చమని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు వికలాంగుల మండల సమైక్యలు ఏర్పాటు చెయ్యలేదని మథర్ థెరిస్సా మండల వికలాంగుల సమైక్య విమర్శిసింది .అప్పన పెదకాపు అధ్యక్షతన జగ్గంపేటలో ఆదివారం జరిగిన సమావేశం లో వారు మాట్లాడుతూ ఈ విషయం గూర్చి గ్రీవెన్ సేల్స్ కు రెండు సార్లు ,మంత్రి గార్కి విన్నవించామని వాపోయారు
కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న

కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కాకపోవడం శోచనీయం .న్యాయమైన తమ డిమాండ్స్ తీర్చమని వారు సమ్మె చేస్తునారు .రోజుకో నిరశన చొప్పున ప్రతీ రోజు ఓ టెంట్ వేసుకుని ఉదయం నుంచి సాయత్రం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు .కళ్ళ కు గంతలు కట్టుకోవడం ..మహనీయుల విగ్రహాలకు పాలాభిషేకం ..వినతిపత్రాలు ఇవ్వడం ...పచ్చిరొట్ట తినడం ...మోకాళ్ళు వేయడం ....దున్నపోతు కు వినతి పత్రం ..దిష్టిబొమ్మ దగ్దం ...సి ఏం కు ఉత్తరాలు రాయడం ....ఇలా ఎన్నో రకాల నిరసన కార్య క్రమామలు చేస్తూనే ఉన్నారు .ఆదివారం జగ్గంపేట జాతీయరవదారి పై రాస్తా రోకో చేసి తమ నిరసన్ తెలిపారు .....ఉపాధ్యాయ ,ఉద్యోగ సంఘాలు ....తో పాటు సి ఐ టి యూ అద్వర్యం లో ఎన్నోసంఘాలు వీరికి మద్దతు గా నిలిచాయి .జగ్గంపేట నియోజవర్గ కంప్యూటర్ టీచర్స్ సంఘం అధ్యక్షుడు పడాల బాలాజీ అద్వర్యం లో ఈ కార్య క్రమలూ జరుగుతున్నాయి .సోమవారం నుంచి మరో వైపు స్కూల్స్ తెరుస్తునారు .హైస్కూల్స్ లో కంప్యూటర్ విద్యకు విఘాతం కల్గుతుంది .పైగా విద్యార్ధి ప్రతి సమాచారం కంప్యూటర్ ద్వారానే అధికార్లులు అడుగుతున్నారు .త్వరగా వీరి సమస్య పరిష్కారం చేస్తే అందరికి మంచిది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)





















