mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

2, అక్టోబర్ 2011, ఆదివారం

గోవిందాపురం లో ఇందిరా జల ప్రభ ప్రారంబించిన మంత్రి తోట -వీడియో

జ్యోతుల నెహ్రు మురారి లో ఏం మాట్లాడారు -వీడియో

లక్ష్మి పార్వతి మురారి లో ఏ మన్నారు -వీడియో

చంద్ర బాబు నాయుడు మాయ మాటలు నమ్మి ...-నెహ్రు

చంద్ర బాబు నాయుడు మాయ మాటలు నమ్మి ఆనాడు తానూ కూడా తెలుగు దేశం పార్టి అన్న ఎన్ టి ఆర్ కు అన్యాయం చేసిని వాడి లో తానూ ఒకడినని .....అందుకు పశ్స్తాప పడుతున్నానని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జ్యోతుల నెహ్రు చెప్పారు .మురారి లో జరిగిన కార్యక్రమం లో లక్ష్మి పార్వతి ఎదురుగా ఆయన ఈ విషయం చెప్పారు

"ఇందిరా జల ప్రభ " పథకం ప్రారంబించిన మంత్రి తోట



తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన "ఇందిరా జల ప్రభ " పథకం ప్రారంభమైనది .మంత్రి తోట నరసింహం స్వంత నియోజకవర్గ గ్రామ గోవిందపురం లో గాంధి జయంతి రోజు ఆదివారం తన చేతుల మీదుగా ప్రారంబించారు .ద్వామా పిడి ప్రసాద్ ,ఆర్డివో నటరాజన్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ,కాంగ్రెస్స్ కార్యకర్తలు గ్రామా ప్రజలు పాల్గొన్నారు .ఈ సందర్భం గా మంత్రి నరసింహం మాట్లాడుతూ ప్రజా అవసరాలు తీర్చడం లో కాంగ్రెస్ పార్టి ఎప్పుడు ముందు ఉంటుందని ...ఏ ముఖ్య మంత్రి ఉన్న ..ప్రజా సంక్షేమం దేయం గా పని చేస్తారని ...సి ఏం కిరణ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో మరిన్ని పధకాలు జీవం పోసుకున్టాయని చెప్పారు .

మురారి లో వై ఎస్ ఆర్ పించన్ ప్రారంబించిన లక్ష్మి పార్వతి



తూర్పు గోదావరి జిల్లా మురారి గ్రామానికి చెందినా అక్కిన వెంకటరాజు పేదల కోసం స్వచ్చందం గా వై ఎస్ ఆర్ పించన్ పేరిట పథకాని ఆరంబించారు .దివంగత యెన్ టి ఆర్ భార్య లక్ష్మి పార్వతి ప్రారంబించారు .మరో అతిధి గా జ్యోతుల నెహ్రు హాజరయ్యారు .ఎనబై మంది పేదలకు నెలకు రెండు వందలు చొప్పున ఇస్తారు .వై ఎస్ ఆర్ తన కుటుంబానికి చేసిన మేలుకు ప్రతిఫలంగా తానూ ఈ పథకాన్ని ఏర్పాటు చేసానని వెంకటరాజు తెలిపారు .

కందుల కొండయ్య దొర అద్వర్యం లోరైతన్నలు నిరాహారదీక్ష



పంటల విరామం ప్రకటించిన కోనసీమ రైతులకు మద్దత్తు గా శనివారం నుంచి మెట్టసీమ అన్నదాతలు రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు .తూర్పు గోదావరి జిల్లా తెలుగు దేశం పార్టి తెలుగు రైతు అధ్యక్షులు కందుల కొండయ్య దొర అద్వర్యం లో రైతన్నలు నిరాహారదీక్ష మొదలు పెట్టారు . గండేపల్లి రైతు దీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రం లో ప్రతి చోట రైతు పంట వేసుకోలేని పరిస్తితి వచ్చిందని దుయ్యబట్టారు .కార్యక్రమం లో నియోజవర్గ టి డి పి ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు ,అధికార ప్రతినిధి ఎస్ వి ఎస్ అప్పల రాజు ప్రబృతులు ,ర్యైతులు పాల్గొన్నారు