mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

4, నవంబర్ 2011, శుక్రవారం

కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా

జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా స్పందించారు .బండారు రాజ ,గుల్ల ఏడుకొండలు ,ఓబిన్ని సత్యనారయన్ ,శ్రీ బాబు ,గఫూర్ మాట్లాడుతూ మంత్రి తోట నరసింహం ఏ పనులు చేసారో ప్రజలకు తెల్సునని ..అధికారం లేక నెహ్రు ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు .ప్రజలకు ఇబ్బంది అని తెల్సిన జగ్గంపేట లో ఎందుకు బ్రిడ్జి కట్టకుండా ఆపలేక పోయారని ప్రస్నిచారు .తెలుగు దేశం లో చేసిన పనులు చెబుతున్నారని ..మూడు పార్టీలు మారిన మీరు ఏ ఎస్ ఆర్ పార్టి తరుపున ఏం చేశారన్నారు ,నాడు ధన యజ్ఞం చేసారని విమర్శా చేసిన ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఈనాడు ఆయన గురించి ఎలా మాట్లుతున్నరన్నారు 

మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టిన జ్యోతుల నెహ్రు

తన హయం తో పోల్చుకుంటే  ప్రస్తుత మంత్రి చేసిన అభివృద్ధి చాల తక్కువ అని వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు పేర్కున్నారు.జగ్గంపేట లో అయన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ ,మంత్రి తోట తీరును తీవ్రంగా దుయ్యబట్టారు .మెట్టసీమకు సాగు నీరు అందించే పుష్కర తానూ సాదిన్చానని ...దానిని  పరిపూర్ణం తీర్చి దిద్దలేక పోయారని విమర్శించారు .నియోజ వర్గం లో ఇంకా పలు గ్రామాలకు మంత్రి మంచి నీరు అందించా లేక పోయారని చెప్పారు .రచ్చబండ లో అధికార దుర్వినియాగం జరిగిందని ...ప్రయవేట్ స్కూల్స్ బస్సులు లాక్కుని ప్రజలను తరలించారని ...దుయ్యబట్టారు .సి ఏం జగ్గంపేట లో ఇచ్చిన వినతి పత్రాలు ఇక్కడే వదిలి పోవడాన్ని బట్టి కిరణ్ సర్కారుకు ప్రజలపై ఎంత శ్రద్ద ఉందొ అర్ధం అవుతున్నదని అన్నారు .జరిగిన అభివృద్ధి పై న మరియు వ్యక్తి గత విషయాలపై కూడా తానూ చర్సిన్చాడానికి తానూ సిద్దం అని సవాల్ చేసారు 

3, నవంబర్ 2011, గురువారం

జగ్గంపేట లో సి ఏం సభ వీడియో 1

సి ఏం జగ్గంపేట సభలో పదనిసలు

సి ఏం జగ్గంపేట సభలో  పదనిసలు 
  • ముఖ్యమంత్రి కి మంత్రి తోట తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు .పెద్దాపురం ఏం ఎల్ ఏ  పంతం గాంధి ని పోలీసులు అడ్డుకోవడంత్  ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు .
  • వచ్చి రాగానే సి ఏం రూపాయి కి కిలో బియ్యం పథకం ప్రారంబించారు .
  • మాజీ సి ఏం వై ఎస్ పేరును మంత్రి పినేపే ,సి ఏం కిరణ్ ప్రస్తావించినపుడు పలువురు ప్రజలు స్పదించారు .
  • సి ఏం బోజనం కోసం వస్తారని జగ్గంపేట లోనే ట్రావెలర్స్ బంగ్లా ఆఘమేఘాలపై ముస్తాబు చేసిన ...సి ఏం మాత్రం సభ వేదిక ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్ లోనే భోజనం చేసారు .
  • ఉదయం పదకొండు సమయానికి  సభ పలసగా ఉన్నప్పటికీ సి ఏం వచ్చే సరికి వేసిన ఇరవయ్ వేల కుర్చీలు నిండి పోయి ఇంకా చాల మంది బయట నిలబడ్డారు .
  • తమ సమస్యలు తెలపడానికి సి ఏం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన కంప్యూటర్ టీచర్స్ను అరెస్ట్ చేసి సి ఏం వెళ్ళే వరకు వదిలి పెట్ట లేదు .
  • జగ్గంపేట లోనే సమస్యాలను మంత్రి సి ఏం ఎదురుగానే ప్రస్తావించి అనంతరం పక్కన కూర్చుని వివరించారు .

2, నవంబర్ 2011, బుధవారం

cm meeting success in jaggampeta జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం









జగ్గంపేట లో ముఖ్యమంత్రి సభ విజయవంతం అయ్యింది .మధ్యాహ్నం రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో  నేరుగా సభాప్రాంగానాన్ని చేరుకున్నారు .మంత్రులు ,అధికారులు ఘన స్వాగతం పలికారు .అనంతరం మంత్రి తోట నరసింహం అద్వర్యం లో జరిగిన సభలో పాల్గున్నారు .రూపాయికే కోలో బియ్యం పథకం ప్రారంబించారు .జగ్గంపేట మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే పథకాన్ని ప్రారంబించారు .గండేపల్లి మండలానికి ఫిల్టర్ వాటర్ అందించే మరో పథకానికి శంకుస్థాపన చేసారు .

1, నవంబర్ 2011, మంగళవారం

జగ్గంపేటకళకళ



రేపటి సి ఎం సభ కోసం జగ్గంపేట శరవేగంగా ముస్తాబు అయ్యింది .కళకళ లాడుతోంది ..అడుగడుగునా పోలీసులే .

,పోరంబోకు భూములు పేదలకు





ప్రభుత్వ దేవాదాయ ,బంజరు ,పోరంబోకు భూములు పేదలకు పంచాలని కోరూతూ రైతు కూలి సంఘం డిమాండ్ చేసింది .ఈ మేరకు ర్యాలి చేసి తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు