mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

31, అక్టోబర్ 2011, సోమవారం

ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే - తోట నరసింహం

రెండవ తేదిన జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే నని మంత్రి తోట నరసింహం తన పార్టీ వారికి నొక్కి చెప్పారు .ఈరోజు జగ్గంపేట లో కాంగ్రెస్స్ కార్యకర్తల మీటింగ్ ప్రత్యేకంగా జరిపారు .ముఖ్యమైన నేతలు హాజరయ్యారు .సి ఎం సభ నియోజవర స్థాయి లోనే జరుగుతున్నా ....జన సమీకరణ భారీగా ఉండాలని ....నియోజవర్గానికి పేరు వచ్చే విధంగా ప్రజలను తీసుకు రావాలని అన్నారు .వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు .కార్య క్రమంలో నేతలు కోర్పు లచ్చయ్య దొర ,అడబాల కుందరాజు, బండారు రాజ ,వత్సవాయి రాజు ,మూర్తి అయ్యన్న ,పైడియ్య,ప్రబృతులు పాల్గున్నారు .తదుపరి ఆయన సి ఎం సభ జరిగే ప్రాంగణాన్ని కలక్టర్ ,ఎస్ పి కల్సి సదర్సించారు .

30, అక్టోబర్ 2011, ఆదివారం

జిల్లా కలక్టర్ ఆకస్మికం గా వసతి గృహాలను తనిఖి


జగ్గంపేట్ వచ్చిన జిల్లా కలక్టర్ ఆకస్మికం గా వసతి గృహాలను తనిఖి చేసారు .స్పెషల్ హాస్టల్ ,గరల్స్ హాస్టల్ ను 
పరిశీలించారు .విద్యార్దు లతో  మాట్లాడి విషయాలు తెల్సుకున్నారు .బుక్స్ ,ఇతర పుస్తకాలు ,సామగ్రి ఇచ్చారో లేదో అని అడిగారు .

సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభ కోసం స్థలం ఎంపిక


సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభ కోసం స్థలం ఎంపిక జరిగింది .గతంలో సోనియా సభ ,జగన్-జ్యోతుల సభ జరిగిన ప్రాంతాన్ని ఎన్నుకున్నారు .ఆదివారం జిల్లా కలక్టర్ రవిచంద్ర తో పాటు పలువురు అధికారులు ,పోలీసు వారి ఆ స్తాలాని పరిశీలించారు  వీడియో

మెట్టసీమ ముచ్చట్లు: జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి -వీడియో ravulammatalli jaggampeta video

మెట్టసీమ ముచ్చట్లు: జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి -వీడియో ravulammatalli jaggampeta video

జగ్గంపేట లో అయ్యప్ప పడిపూజ video

cm tour at jaggampeta on nov 2ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు

ముఖ్యమంత్రి రాక కోసం అప్పుడే కసరత్తు ప్రారంబమైంది .వచ్చే నెల రెండవ తేదిన సి ఏం కిరణ్ కుమార్ జగ్గంపేట వస్తున్నారు .రూపాయి కిలో పథకాన్ని జిల్లాలో ఇక్కడనుంచే ప్రారంబిస్తారు .సభ జరిగే ప్రదేశం గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు .ఆదివారం సెలవు దినం  మరియు నాగుల చవితి అయినప్పటికీ జిల్లా,పెద్దాపురం డివిజన్ ,మండల అధికారులు ఉదయమే జగ్గంపేట వచ్చి స్తలాలు పరిశీలించారు .ఇదివరకు సోనియా సభ జరిగిన  ఆదిత్య ఆసుపత్రి ప్రక్క స్తలాని ఎంపిక చేసారు .హెలీ పాడ్ కూడా ఆ పక్కనే నిర్మిస్తారు .