mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

10, జనవరి 2012, మంగళవారం

తూరుపు లో ఆ నల్గురు ఏం ఎల్ ఏ లకు ఆశాభంగమే

ఆ నల్గురు ఎంతో ఆరాట పడ్డారు .కనీసం ఒకరికైనా మంత్రి యోగం దక్కుతుందని ..అయితే వారి ఆసలు ఆవిరి అయ్యాయి ...వారే ప్రజారాజ్యం ఏం ఎల్ ఏ లు  వంగా గీత ,బండారు సత్యానందం ,పంతం గండి మోహన్  మరియు కురసాల కన్నబాబు .చిరంజీవి కాంగ్రెస్స్ గూటిలో చేరిన నేపథ్యం లో తూర్పు లో ఎక్కవ గా ఉన్న నల్గురి లో ఒకర్కి మంత్రి పదవి ఖాయం అని ..పైగా ప్రస్తుత మంత్రి తోట నరసింహం పదవికి గండం అని వార్తలు వచ్చాయి .అయితే నేడు జరుగుతున్నా పరిణామాల ప్రకారం చిరు వర్గం నుంచి రామచంద్రయ్య ,గంటా శ్రినివాసులకే  మంత్రి పదవులు దక్కుతున్నాయని ..ఈ  నెల పంతోమిదోవ తేదిన ప్రమాణ స్వీకారం చేయ్యబోతునట్లు రూడీ అవుతోంది ..అంటే ఆ నల్గురి ఇక ఆశాభంగమే .

సంక్రాంతి మజా తూర్పు లోనే

తూర్పు నుంచి రాజధానికి మరో నాలుగు  రైల్స్ ప్రకటించడం ఆనందదాయకం .సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరబాద్ లో ఉన్న వేలాది మంది విధిగా స్వస్థలానికి వస్తారు .ముఖ్యంగా ఉబయగోదావరి జిల్లాలకు తాకిడి ఎక్కువ ..రాష్ట్రం లో ఎక్కడ లేని సరదా ఇక్కడే ఉంటుంది మరి .ఇంటి దగ్గర మహిళలు ,ఆరు బయట పురుషులు చేసే సందడి .....అల్లరి చూసి తీరవలసిందే పండుగ మజా చెయ్యాలి అంటే ఇక్కడ కు రావాల్సింది .చక్కని ప్రకృతి మధ్య ఏ  సాంప్రదాయ "పందాలు " చూడాలన్న ఇక్కడే సాధ్యం .ఎన్ని అడ్డంకులున్న కనీసం పండుగా మూడు రోజు లు ఎంజాయ్ చెయ్యవచ్చు ...(ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ..అనుమతులు పొందేసారు !).ఇక వెళ్ళడానికి ,రావడానికి రైల్స్, ఏ సి బస్సులు ఉండానే ఉన్నాయ్ 

6, జనవరి 2012, శుక్రవారం

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు ముగిస్సాయి .ఉదయం నుంచి అనేక మంది ప్రముఖులు ఆయన బౌతిక కాయని దర్శించి నివాళులు అర్పించారు .వై ఎస్ జగన్ ,జిల్లా మంత్రులు ,మూడు పార్టీల నేతలు ..వచ్చారు .మంత్రి తోట నరసింహం కాడి కూడా పట్టారు 

5, జనవరి 2012, గురువారం

తోట గోపాల కృష్ణ మృతి

తోట గోపాల కృష్ణ మృతి చెందారు .కాకినాడ ఎం.పి గా ,పెద్దాపురం ఎం ఎల్ ఏ గా ఆయన పనిచేసారు .తెలుగుదేశం లో ఎం పి ,కాంగ్రెస్స్ లో ఎం ఎల్ ఏ ..నేడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ లో ఉన్నారు ..ఆయన సభలో ఏమి మాట్లాడిన సరదాగా ఉంటుంది .ఏ విషయాన్నీ అయిన పిట్ట కతల లతో ముడి వేసి చెప్పి జనం తో చప్పట్లు కొట్టించు కోవడంలో ఆయనకు ఆయనే సాటి .గోపాల కృష్ణ మృతి పట్ల అన్ని పార్టీల నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు 

4, జనవరి 2012, బుధవారం

కంటి శిబిరం



జగ్గంపేట లయి న్ కంటి ఆసుపత్రి వారి అధ్వర్యంలో కంటి శిబిరం జరిగింది 

3, జనవరి 2012, మంగళవారం

గ్రామసభ




జగ్గంపేట ,గోవిందపుర గ్రామాల్లో ఏం పి డి ఓ నాతి బుజ్జి గ్రామసభ నిర్వహించారు .మధ్యాహాన బోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు 

1, జనవరి 2012, ఆదివారం

పోటా పోటీగా వేడుక చేసి .....

జగ్గంపేట లో నూతన సంవత్సర వేడుకలు చాల భారీగా జరిగాయి .రాజకీయ నేతలు పోటా పోటీగా వేడుక చేసి అభిమానులను అలరించారు .వీరవరం లో మంత్రి తోట నరసింహం ,ఇర్రిపాక లో జ్యోతుల నెహ్రు ,జగ్గంపేట లో జ్యోతుల చంటిబాబు సందడి చేసారు .నెహ్రు ,చంటి బాబు శిబిరాల్లో బోజనాల హడావడి భారీ స్తాయిలో కనిపించింది .మొత్తం మీద ముగ్గురు దగ్గరాకు జనం భారీగానే వచ్చారు